మంత్రాలయం రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
Breaking News
'అచ్చం చిన్ని కృష్ణుడిలానే'..!
Published on Wed, 04/15/2026 - 14:37
పసిపిల్లలు సహజంగానే ముద్దుగా అనిపిస్తారు. వారి అమాయకపు మోము ఎవ్వరినైనా.. ఇట్టే కట్టిపడేస్తుంది. కొందరు చిన్నారులను చూడంగానే ఎత్తుకుని ముద్దాడాలనిపిస్తుంటుంది కూడా. కానీ ఈ చిన్నారిని చూడగానే వాసుదేవ నందనుడు, ఆ నందగోపాలుడే గుర్తుకొస్తాడు. చిన్ని కృష్టుడిలా ముద్దుగా ఆకర్షిస్తున్న ఈ చిన్నారిని చూసి ఎవ్వరూ కళ్లు తిప్పుకోలేరు.
అంత అందంగా ముగ్ధమనోహరంగా ఉందా ఆ పాపాయి. ఆ జగన్నాథుడే మళ్లీ ఈ భువిపై ఇలా చిన్ని కృష్ణుడిలా అవతరించాడా అన్నంతగా అందంగా ఉంది ఆ చిన్నారి. ఆ చిన్నారి చిరునవ్వు నుంచి ఆడుకుంటున్న విధానం అన్ని చూస్తే..ఒక్కసారిగా మన కళ్లముందు శ్రీకృష్ణుడి బాల్య జ్ఞాపకాలు కదలాడతాయి.
అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనికి “అచ్చం చిన్ని కృష్ణుడిలాగే ఉన్నాడు!” అనే క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేశారు. అంతేగాదు ఈ వీడియోకి వేలల్లో లైక్లు, వ్యూస్ వచ్చాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు ఓ లుక్కేయండి మరి..!.
Looks just like little Krishna!🥰 pic.twitter.com/XrTWBV8gwV
— 𝑺𝒂𝒏𝒅𝒉𝒚𝒂𝒂'𝒗 (@vedicvenus_) April 10, 2026
(చదవండి: చలువ చేసే మారేడు పానకం..!)
Tags : 1