Breaking News

సిల్వర్ స్క్రీన్ శిల్పం

Published on Sat, 01/25/2025 - 23:30

‘ఒక్క చాన్స్‌..ఒకే ఒక్క చాన్స్‌’ కొందరిని స్టార్‌గా నిలబెడుతుంది. మరికొందరిని అడ్రస్‌ లేకుండా చేస్తుంది. అలా ఒక్క చాన్స్‌తో మెరిసి.. అపజయాలతో తడబడి.. మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన నటే శిల్పా మంజునాథ్‌. ఆ వివరాలే ఇక్కడ..

శిల్పా మంజునాథ్‌.. బెంగళూరులో పుట్టిపెరిగింది. నటన మీదున్న ఆసక్తితో చదువు పూర్తయిన వెంటనే మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించింది. ఒకవైపు మోడలింగ్‌ చేస్తూనే, మరోవైపు ఆడిషన్స్‌ ఇచ్చేది.

విజయ్‌ ఆంటోని నటించిన ‘కాళీ’ తమిళ చిత్రంతో వెండితెరకు పరిచయం అయింది. ఇదే సినిమా అదే పేరుతో తెలుగులోనూ డబ్‌ అయింది. అందులో ఆమె నటనకు మంచి మార్కులే పడి, వరుస అవకాశాలతో బిజీ అయిపోయింది. ఒకేసారి కన్నడ చిత్రం ‘మగ 2’, మలయాళ చిత్రం ‘రోసాపూ’లలో నటించింది.

ఇలా ఒకే ఏడాది తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ సినీ ఇండస్ట్రీల్లోకి ఎంట్రీ ఇచ్చి పాపులర్‌ అయింది. కాని, వరుస అపజయాలతో తడబడింది. దాంతో కాస్త గ్యాప్‌ తీసుకుంది.

‘హైడ్‌ అండ్‌ సీక్‌’ అనే థ్రిల్లర్‌ చిత్రంతో విజయం సాధించి, తిరిగి ఫామ్‌లోకి వచ్చింది శిల్పా. త్వరలోనే ఈ చిత్రం ‘ఆహా’లో స్ట్రీమ్‌ కానుంది.

ఏ క్యారెక్టర్‌నైనా సులభంగా ఆకళింపు చేసుకోగలను. అదే నా బలం. పాత్రను డైరెక్టర్‌ నరేట్‌ చేస్తున్నప్పుడే, నేను ఆ క్యారెక్టర్‌ మూడ్‌లోకి వెళ్లిపోతా. అలా తీసుకెళ్లగలిగే స్క్రిప్ట్‌లనే సెలెక్ట్‌ చేసుకుంటా. – శిల్పా మంజునాథ్‌.

#

Tags : 1

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు