Breaking News

నా లోపల రెబెల్

Published on Sun, 04/19/2026 - 00:56

సౌమ్యమైన చూపులు, భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇచ్చే పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మాళవిక నాయర్, జీవితంలోని ఆసక్తికరమైన విషయాలు ఆమె మాటల్లోనే...

నా బాల్యమే నా బలం!
నేను ఢిల్లీలో ఒక మలయాళీ కుటుంబంలో పుట్టాను. నా బాల్యం నాన్నగారి వృత్తిరీత్యా కొన్నిసార్లు ఢిల్లీ హడావుడి, మరికొన్నిసార్లు  కేరళ ప్రశాంతత మధ్య సాగింది. ఒకసారి మా కుటుంబంలో జరిగిన బైక్‌ ప్రమాదం నాపై చాలా ప్రభావం చూపింది. అప్పటి నుంచి నేను స్వతంత్రంగా ఉండాలని నిర్ణయించుకున్నాను.

నాన్న నా పెద్ద సపోర్టర్‌!
‘అమ్మాయివి, బైక్‌ ఎందుకు?’ అని చాలామంది చెప్పినా, మా నాన్న వినలేదు. నాకు బైక్‌ నేర్పించారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నన్ను నేనే కాపాడుకోగలగాలి అని ఆయన కోరుకున్నారు.

కెమెరా బయట నా ప్రపంచం!
షూటింగ్‌ లేకపోతే నేను ఎక్కువగా పుస్తకాల్లో మునిగిపోతుంటాను లేదా స్కెచింగ్‌ చేస్తుంటాను. నేను ఎడిన్‌బర్గ్‌ యూనివర్సిటీలో తత్త్వశాస్త్రంలో మాస్టర్స్‌ పూర్తి చేశాను. ఆ చదువు నాకు పాత్రలను కొత్త కోణంలో అర్థం చేసుకునే దృష్టిని ఇచ్చింది.

నేను కేవలం నటించను!
నా ప్రయాణం చిన్నప్పుడే మలయాళం సినిమా ‘కరుత్త పక్షికల్‌’లో మొదలైంది. కానీ, ‘కుక్కూ’ నాకు అసలైన గుర్తింపు ఇచ్చింది. అంధురాలైన పాత్రలో కళ్లతో కాదు, మనసుతో ప్రపంచాన్ని చూడటం నేర్చుకున్న అనుభవం. అందుకే, పాత్రలోని భావాలను లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను.

చిన్న సీక్రెట్స్‌!
ఒంటరిగా ఉండటానికే ఇష్టపడతాను. కానీ నా లోపల ఒక చిన్న రెబెల్‌ ఉంది. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే నాకు కొన్ని టాటూలు ఉన్నాయి. ఒక చిన్న నిమ్మకాయ ముక్క ఆకారంలో ఒక టాటూ ఉంది. అలాగే పోలినేషియన్  స్టయిల్‌లో ట్రయాంగిల్స్, ట్రైబల్‌ డిజైన్స్ తో మరో టాటూ కూడా ఉంది. అవి నా జీవితంలో ప్రత్యేకమైన గుర్తుల్లాంటివి.

వ్యక్తిత్వం ముఖ్యం!
మొదట్లో ‘గ్లామర్‌’ అనే భావన నాకు పెద్దగా నచ్చేది కాదు. ఇండస్ట్రీలో ప్రెజెంటబుల్‌గా ఉండాలి కానీ, వ్యక్తిత్వాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు అని నేను నమ్ముతాను.

అరుదైన గుర్తింపు!
చిన్నప్పుడే ఉత్తమ బాలనటి అవార్డు అందుకున్నందుకు, కొందరు నన్ను ప్రముఖ నటి శారదతో పోలుస్తుంటారు. ఆ గుర్తింపు కాపాడుకోవడానికే పారితోషికం కంటే భావోద్వేగాలకు ప్రాధాన్యం ఉన్న కథలను ఎంచుకోవడానికే ఎక్కువ ఇష్టపడతాను.

ఫుడ్‌ అంటే ఫుల్‌ లవ్‌!
నేను పక్కా ఫూడీని. ఢిల్లీలో పెరిగాను కాబట్టి అక్కడి స్ట్రీట్‌ ఫుడ్, మసాలా చాట్‌ ఎప్పటికీ నా ఫేవరెట్‌. అలాగే మా ఇంట్లో చేసే మటన్  రసం కలిపిన అన్నం. నెమ్మదిగా ఉడికిన ఆ మాంసం నోట్లో కరిగిపోతుంది. అది నా ఆల్‌టైమ్‌ కంఫర్ట్‌ ఫుడ్‌. ఇప్పుడు షూటింగ్‌లు ఎక్కువగా ఉండటంతో, శక్తి కోసం ఆర్గానిక్, హెల్తీ ఫుడ్‌ కూడా నా మెనూలో చేరింది.

ఇష్టమైన స్టార్‌!
చిన్నప్పటి నుంచే నేను మోహన్ లాల్‌ సర్‌కి పెద్ద అభిమానిని. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయనతో కలిసి పని చేసిన రోజు నాకు ఒక కలలా అనిపించింది. అలాగే జ్యోతిక నటనలోని శక్తి, ఒక సినిమాను తన భుజాలపై మోసే ధైర్యం నాకు పెద్ద ఇన్ స్పిరేషన్ .

#

Tags : 1

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)