Breaking News

నేనొక పెద్ద విమర్శకురాలిని!

Published on Sun, 07/05/2026 - 01:02

ఒక్కో సినిమా, ఒక్కో భాష, ఒక్కో క్యారెక్టర్‌ , ఒక్కో స్టయిల్‌ కాని ఆమె మాత్రం ఒక్కరే. ఇలా ఆన్‌ ఇన్‌ వన్‌ ఫుల్‌ ఫన్‌ ఫ్యాకేజ్‌తో క్రేజీ స్టార్‌గా మారిన నటి కయాదు లోహార్‌– తన గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. అవన్నీ ఆమె మాటల్లో...  

ఇంట్లో భాషల సందడి!
నేను అసోంలో పుట్టాను, కానీ మా కుటుంబ మూలాలు మొత్తం నేపాల్‌కు చెందినవి. మా పూర్వీకులు చాలా ఏళ్ల క్రితమే అసోంలో స్థిరపడ్డారు. తర్వాత పూణేకు వచ్చాం. అలా మా ఇంట్లో నేపాలీ, హిందీ, ఇంగ్లిష్, మరాఠీ భాషలు ఎక్కువగా మాట్లాడతాం.

జీవితాన్ని మార్చిన జ్యూలరీ పోటీ!
చిన్నప్పుడు ఫ్యాషన్‌ డిజైనర్‌ అవ్వాలనుకునేదాన్ని. అందమైన డ్రెస్సుల డిజైన్స్, కొత్త కొత్త స్టయిల్స్, ట్రెండ్స్‌ గురించే ఎక్కువ అలోచించేదాన్ని. అయితే పూణేలో జరిగిన ఓ జ్యూలరీ పేజెంట్‌లో సరదాగా పాల్గొని గెలిచిన తర్వాత మోడల్‌గా మారాను. ఆ తర్వాత నుంచి కెమెరా ముందు ఉండటమే ఎక్కువ నచ్చింది. అలా సినిమాల్లోకి వచ్చాను.

బాగా ఏడ్చేదాన్ని
స్కూల్‌లో నేను చాలా సైలెంట్‌ స్టూడెంట్‌ని. ఎవరైనా అడిగితే నాకు చాలా ఇష్టమైన బొమ్మలను కూడా ఇచ్చేసేదాన్ని. తర్వాత ఇంటికి వెళ్లి అవి గుర్తొచ్చి ఏడ్చేదాన్ని. ఇప్పుడది గుర్తొస్తే నవ్వొస్తుంది. కాని, ఇప్పుడలా అసలు లేను.

కష్టాలు నేర్పిన జీవిత పాఠాలు!
సినిమాల్లోకి రాకముందు కొంతకాలం సేల్స్‌ గర్ల్‌గా పనిచేశాను. ఆ అనుభవం డబ్బు విలువను, కష్టపడి పనిచేయడం ఎంత ముఖ్యమో నేర్పింది. అలాగే మనుషులతో ఎలా మెలగాలో కూడా నేర్చుకున్నాను.

అలా భాష నేర్చేసుకుంటా!
తెలుగు, తమిళ, కన్నడ భాషలు మొదట నాకు రావు. కొత్త భాష నేర్చుకోవాలంటే ముందుగా ఆ భాషలోని పాటలు ఎక్కువగా వింటాను. అలా ఉచ్చారణ, యాస అర్థమవుతాయి.

సినిమాలు చూడాలంటే ఇప్పటికీ టెన్షనే!
చాలామంది నటులు తమ సినిమాలను పదే పదే చూస్తుంటారు. కాని, స్క్రీన్ పై నన్ను చూసుకుంటే ముందుగా నా తప్పులే కనిపిస్తాయి. ‘ఇంకా బాగా చేయొచ్చుగా!’ అనిపిస్తుంటుంది. అందుకే నా సినిమాలు చూడాలంటే ఇప్పటికీ కొంచెం టెన్షన్ గానే ఉంటుంది. నాకు నేనే ఒక పెద్ద విమర్శకురాలినైతే, మా తమ్ముడు నా ఫేవరెట్‌ ఫ్యాన్‌!

అల్‌ పచీనో అంటే క్రష్‌!
హాలీవుడ్‌ లెజెండ్‌ అల్‌ పచీనో నాకు చాలా ఇష్టం. ఆయన నటనలో కనిపించే ఇంటెన్సిటీ నన్నెప్పుడూ ఆకట్టుకుంటుంది. ఇంకా రొమాంటిక్‌ కామెడీలు ఇష్టం. ముఖ్యంగా ‘క్రేజీ స్టూపిడ్‌ లవ్‌’ సినిమా ఎన్నిసార్లు చూసినా బోర్‌ కొట్టదు. ఆ సినిమా నా ఆల్‌టైమ్‌ ఫేవరెట్స్‌లో ఒకటి.

నచ్చితేనే గ్రీన్  సిగ్నల్‌!
సినిమా పెద్దదా, చిన్నదా అనేది నాకు ముఖ్యం కాదు. పాత్రలో కొత్తదనం ఉండాలి. కథలో నా పాత్రకు ప్రాధాన్యం ఉంటేనే ఒప్పుకుంటాను. అయితే, కత్తి సాము, గుర్రపు స్వారీ, యోధురాలి పాత్రలు అంటే నాకు ప్రత్యేకమైన ఆసక్తి. అలాంటి పాత్రల్లో నటించే అవకాశం వస్తే వెంటనే ఓకే చెబుతాను.

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)