Breaking News

అదే నా ఐడేంటిటీ

Published on Sun, 02/15/2026 - 00:13

సింపుల్‌గా కనిపిస్తుంది. కాని, సీరియస్‌ డెసిషన్స్ తీసుకోవడం బాగా తెలుసు ఈ తెలుగు అమ్మాయి ఈషా రెబ్బాకి. అందుకే, గ్లామర్‌ ట్యాగ్స్‌కి దూరంగా, పెర్ఫార్మెన్స్ రోల్స్‌కి దగ్గరగా ఉంటూ, చాలా జాగ్రత్తగా తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఆమె మాటల్లోనే..  

⇒ నేను వరంగల్‌లో పుట్టాను. హైదరాబాద్‌లో పెరిగాను. ఎంబీఏ చేశాను. కాలేజీలో ఉండగానే మోడలింగ్‌ చేసేదాన్ని. ఫేస్‌బుక్‌లో నా ఫోటోలు చూసిన ఇంద్రగంటి మోహనకృష్ణ నాకు మొదటి సినిమా అవకాశం ఇచ్చారు.

⇒ ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ నా మొదటి సినిమా. కాని, ‘అంతకు ముందు ఆ తరువాత’ నన్ను హీరోయిన్ గా గుర్తింపునిచ్చిన సినిమా. గ్లామర్‌ కంటే పెర్ఫార్మెన్స్‌ ముఖ్యమని అప్పుడే అర్థమైంది.

⇒ హీరోయిన్‌ అవ్వకముందు నా రోజు చాలా బిజీగా ఉండేది. ఉదయం కాలేజీ, మధ్యాహ్నం సాఫ్ట్‌వేర్‌ జాబ్, సాయంత్రం ఇంకో పని. అప్పుడే హార్డ్‌ వర్క్‌ అలవాటు అయిపోయింది.

⇒ ‘అ!’ సినిమాలో లెస్బియన్‌ పాత్ర చేశాను. చాలామంది షాక్‌ అయ్యారు. కాని, నేను మాత్రం కొత్తగా ట్రై చేయాలనే ఫీలింగ్‌తో ఎంతో ఎంజాయ్‌ చేశాను. రిస్క్‌ తీసుకోకపోతే గ్రోత్‌ ఉండదు కదా.

⇒ నేను తెలంగాణ అమ్మాయినే. కాని, ‘ఓం శాంతి శాంతిః’ సినిమా కోసం తూర్పు గోదావరి యాసలో మాట్లాడాను. యాస మారడం నాకు సరదానే. అదే సినిమాలోని ఒక సీన్‌ కోసం నిజంగానే హీరో నా చెంపపై కొట్టారు. ఆ సీన్ లో కనిపించే కన్నీళ్లు యాక్టింగ్‌ కాదు. నా ప్యూర్‌ రియాక్షన్‌.

⇒ కెరీర్‌ మొదట్లో నా రంగు గురించి, లుక్స్‌ గురించి చాలా కామెంట్స్‌ వచ్చాయి. అప్పట్లో చాలా బాధపడ్డాను. ఇప్పుడు మాత్రం నా రంగుపై నాకు పూర్తి గౌరవం ఉంది. అదే నా ఐడెంటిటీ.

⇒ రిలేషన్ షిప్‌ రూమర్స్‌ వస్తూనే ఉంటాయి. నేను ఒక వ్యక్తికి దగ్గరగా ఉన్న మాట నిజమే. పెళ్లి గురించి ఇంకా ఏమీ అనుకోలేదు. సరైన సమయం వస్తే నేనే చెప్తాను.

⇒ కాఫీ లేకుండా నా రోజు ప్రారంభం కాదు. ఖాళీ దొరికితే ప్రశాంతమైన ప్రదేశాలకు వెళ్లడం నాకు చాలా ఇష్టం.

⇒ ఫిట్‌నెస్‌ నాకు సీరియస్‌ విషయం. యోగా, జిమ్, కిక్‌బాక్సింగ్‌ రెగ్యులర్‌. స్ట్రాంగ్‌గా ఉండాలంటే కష్టపడాల్సిందే అని నమ్ముతాను.

⇒ ఎప్పటికైనా సరే మహిళా ప్రాధాన్యం ఉన్న చరిత్రాత్మక పాత్ర ఒకటి చేయాలన్న కల నన్ను వెంటాడుతోంది.

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)