Breaking News

మరో లగ్జరీ ఇల్లు కొనుగోలు చేసిన సైఫ్‌ అలీఖాన్‌, కారణం ఏంటో తెలుసా?

Published on Tue, 04/22/2025 - 12:43

విలక్షణ నటుడు సైఫ్ అలీ ఖాన్ తనపై కత్తి దాడి జరిగిన కొన్ని నెలల తరువాత ఖతార్‌లో మరో ఇల్లు కొనుగోలు చేశాడు. ఖతార్‌లోని దోహాలోని ది పెర్ల్‌లోని ది సెయింట్ రెగిస్ మార్సా అరేబియా ద్వీపంలో తాను పెట్టుబడి పెట్టానని సైఫ్ అలీ ఖాన్ ఇటీవల వెల్లడించాడు.  ఇండియాకి దగ్గరగా ఉండటంతోపాటు,  ఇది చాలా సేఫ్‌ అని కూడా  తెలిపారు. ఖతార్‌లో ఇల్లు  కొనాలనే తన నిర్ణయం గురించి సైఫ్ అలీ ఖాన్  ఏమన్నాడో ఒకసారి చూద్దాం.

భద్రత, బ్యూటీతో పాటు భారతదేశానికి దగ్గర ఉన్నందు వల్ల  ఖతార్‌లోని దోహాను ఎంచుకున్నట్టు అల్ఫర్డాన్ గ్రూప్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో  సైఫ్‌   తెలిపాడు.  అందమైన ప్రదేశాలతో, పరిపూర్ణమైన హాలిడే హోమ్ అని కూడా దోహాపై  ప్రశంసలు కురిపించాడు.  అందుకే ఆ దేశం తనను సురక్షితంగా  ఇంట్లో ఉన్న ఫీలింగ్‌ కలిగేలా  చేసిందన్నాడు.  ఒకటి రెండు రోజులు సెలవులు దొరికితే తనకు గుర్తొచ్చేది   దోహా. పైగా అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే అది చాలా సురక్షితంగా ఉంటుందనీ,  ఒక ద్వీపం లోపల  ద్వీపం అనే భావన  ఇంకా లగ్జరీగా ఉంటుంది, నిజంగా ఉండటానికి దానికి మించిన ప్రదేశం అందుకే అక్కడ ఉండటం తనకు చాలా సంతోషాన్నిస్తుందని  చెప్పుకొచ్చాడు.   సేఫ్టీ, ప్రైవసీ, లగ్జరీ అద్భుతమైన కలయిక దోహా, ‘ఇల్లు తరువాత మరో ఇల్లు’ (హోం అవే ఫ్రం హోం) అని పేర్కొన్నాడు. షూటింగ్‌లో భాగంగా అక్కడ కొన్ని  రోజులు ఉన్నాను. అప్పడు బాగా నచ్చేసింది,  మరో విధంగా చెప్పాలంటే అక్షరాలా ఇంటి నుండి దూరంగా ఉన్న మరో ఇల్లులా అనిపించింది, ప్రశాంతంగా .ఏకాంతంగా ఉంటుందని, త్వరలోనే పిల్లల్నీ,ఫ్యామిలీని అక్కడికి తీసుకెళతానని పేర్కొన్నాడు.

లగ్జరీ జీవన శైలి, ఆస్తులు 
హైప్రొఫైల్‌ నేపథ్యం, రాజ కుటుంబ వారసత్వం, విలావసవంతమైన   కార్లు, వాచెస్‌.. లగ్జరీ ఇల్లు ఇదీ  జీవన శైలి. సైఫ్‌ తన భార్య, సినీ నటి కరీనాకపూర్‌తో కలిసి ముంబైలోని సద్గురుశరణ్‌లోని విలాసవంతమైన ఇంట్లో నివసిస్తున్నాడు. దీనిక విలువ రూ.55 కోట్లు.  ఇది కాకుండా సైప్‌, కరీనా జంటకు స్విట్జర్లాండ్‌లోని గస్టాడ్‌ ప్రాంతంలో  రూ.33 కోట్ల  విలువ చేసే మరో ఇల్లు కూడా  ఉంది. పూర్వీకుల పటౌడీ ప్యాలెస్, లండన్ కూడా ఆస్తులు ఉన్నాయి. తాజా లెక్కల ప్రకారం వారసత్వంగా వచ్చిన సంపదతోపాటు  సైఫ్‌ ఆస్తుల విలువ రూ.1,200 కోట్లకు పైమాటే. అంచనా.  బెంజ్‌ ఎస్‌ క్లాస్‌కు చెందిన ఎస్‌350డీ, ల్యాండ్‌ రోవర్‌ డిఫెండర్‌ 110, ఆడీ క్యూ7, జీప్‌ రాంగ్లర్‌  వింటికి సైఫ్‌ కార్లు. పర్ఫ్యూమ్స్‌, ఫుట్‌వేర్‌, హోమ్‌ డెకార్‌ రంగాల్లో వ్యాపారాన్ని కూడా విస్తరించాడు.  ఒక్కో సినిమాకు సైఫ్‌ రెమ్యూనరేషన్‌ సినిమాకు రూ.10-15 కోట్లు ద  ఎండార్స్‌మెంట్ల ద్వారా కోట్ల సంపాదన. దీనికి తోడు బాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా  ఒక వెలుగు వెలిగిన  సతీమణి కరీనా సంపాదన కూడా  తక్కువేమీ కాదు.

కత్తిపోట్లు ఘటన
కత్తిపోట్టు ఈ ఏడాది జనవరిలో తన సొంత ఇంట్లో సైఫ్ అలీ ఖాన్‌ కత్తి పోట్లుకు గురి కావడం  కలకలం రేపింది. ముంబైలోని లీలావతి  ఐదు రోజులు చికిత్స పొందిన అనతరం డిశ్చార్జ్ అయ్యాడు.  ప్రస్తుతం తన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.

'జువెల్ థీఫ్' 
తన రాబోయే థ్రిల్లర్ 'జువెల్ థీఫ్: ది హీస్ట్ బిగిన్స్' లో సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. ఏప్రిల్ 25న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. సైఫ్  ఈ మూవీలో జైదీప్ అహ్లవత్, కునాల్ కపూర్ , నికితా దత్తా కూడా నటించారు.  కూకీ గులాటి , రాబీ గ్రేవాల్ దీనికి దర్శకత్వం వహించారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)