Breaking News

దీపికా పదుకొణె మెడలో సిక్కు మహారాజుల నాటి నెక్లెస్‌..!

Published on Sun, 07/14/2024 - 08:29

బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రెగ్నెంట్‌తో ఉండి కూడా వరుస సినిమాల ప్రమోషన్లు, షూటింగ్‌లతో బిజీగా ఉండే నటి. బిలియన్‌ వ్యాపార దిగ్గజం ముఖేష్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ వివాహానికి పలువురు ప్రముఖులు, సెలబ్రెటీలు విచ్చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ లగ్జరీయస్‌ వివాహానికి హజరైన నటి దీపికా పదుకొణె డిఫెరెంట్‌ లుక్‌తో మెస్మరైజ్‌ చేశారు. ఎవ్వరూ ఊహించని విధంగా రాజుల కాలం నాటి దుస్తులు, నగలతో దేవకన్యలా మెరిసింది. 

దీపీకా ఈ వివాహ వేడుకలో 20వ శతాబ్దం నాటి టోరానీ సింధీ చోగా సల్వార్‌ ధరించింది. ముఖ్యంగా ఆమె కంఠానికి ధరించిన చోకర్‌ నెక్లెస్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. దీపికా ధరించిన నగ సిక్కు సామ్రాజ్యం మొదటి పాలకుడు మహారాజా రంజిత్‌ సింగ్‌ నాటి కాలంలోని నగ. చెప్పాలంటే ఆయన దీన్ని చేతి పట్టి లేదా మోచేతి ఆభరణంగా ధరించేవారు. సిక్కు కళాత్మకతకు ఈ నగ అద్భుతమైన ఉదాహరణ. ఆ నగలో ఆకట్టుకునే రీతీలో జెమ్‌సెట్‌తో ఉంది. మధ్యలో ఓవల్‌ షేప్‌లో 150 క్యారెట్ల బరువుతో ఒక జెమ్‌. దాని చుట్టూ రెండు వరుసల నీలమణి రాళ్లు ఉంటాయి.

ఆ నగ బాజుబ్యాండ్‌ సిక్కు హస్తకళకు నిదర్శనం. మహారాజు రంజిత్‌ సింగ్‌కు ఆభరణాలు, విలువైన రాళ్ల అన్న మక్కువ. ఆయన ఖజానా(లాహోర్‌ తోషఖానా) కోహ్‌ ఇ నూర్‌ వజ్రాలకు నిలయంగా ఉంది. అయితే ఇప్పుడది బ్రిటిష్‌ కిరీటం అధీనంలో ఉంది. మహారాజా రంజిత్‌ సింగ్‌ ఆభరణాల సేకరణల ఎలా ఉండేదనేందుకు ఈ నగను రూపొందించిన విధానమే నిదర్శనం. కాగా, ఆంగ్లో-సిక్కు యుద్ధం తర్వాత అతని లాహోర్ తోషఖానా బ్రిటిష్ పాలకుల చేతుల్లోకి వచ్చింది. 19వ శతాబ్దంలో, రంజిత్ సింగ్, అతని వారసుడు షేర్ సింగ్ మరణానంతరం, అతని చిన్న కుమారుడు  పదేళ్ల వయసులో దులీప్ సింగ్ వారసుడిగా ఎంపికయ్యాడు.

పంజాబ్ విలీనమైన తర్వాత, అతని తల్లి మహారాణి జిందన్ కౌర్ అరెస్టయ్యి, నేపాల్‌కు బహిష్కరించబడింది. దీంతో అతను పంజాబ్‌పై ఈస్ట్ ఇండియా కంపెనీకి సంతకం చేయవలసి వచ్చింది. కోహ్-ఇ-నూర్  వజ్రాలే కాకుండా, సిక్కు రాజ్యం నుంచి కొల్లగొట్టబడిన ఇతర ఆభరణాలలో తైమూర్ రూబీ అని పిలువబడే 224 పెద్ద ముత్యాలతో కూడిన మరొక ప్రసిద్ధ హారము కూడా ఉంది. 1820 నుంచి 1830 మధ్య కాలంలో స్వర్ణకారుడు హఫీజ్ ముహమ్మద్ ముల్తానీ చేసిన మహారాజా రంజిత్ సింగ్ సింహాసనం లండన్‌లోని విక్టోరియా అండ్‌ ఆల్బర్ట్ మ్యూజియంలో ఉంది.

(చదవండి: అన్నం లేదా రోటీ: బరువు తగ్గేందుకు ఏది మంచిది? నిపుణులు ఏమంటున్నారంటే..)

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి