అమ్మ అలా చెప్పి ఉండకపోతే ఇలా ఉండేవాడిని కాను: అమిర్‌ ఖాన్‌

Published on Fri, 07/04/2025 - 10:00

నేడు సమాజంలో ప్రతి ఒక్కరూ సంక్షోభ సమయాలు ఎదుర్కొంటున్నారు. సంక్షోభ సమయంలో ‘నీ కోసం నేనున్నానని’ ఎవరో ఒకరు నిలవకపోతే బయటపడటం కష్టమవుతోంది. ‘రీమాతో విడాకుల తర్వాత తాగుడు అలవాటు లేని నేను తాగుబోతుగా మారాను. సంవత్సరం పాటు లెక్కకు మించి తాగుతూ స్పృహ తప్పేవాణ్ణి. కాని అమ్మ నన్ను కాపాడింది’ అని తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు అమిర్‌ ఖాన్‌. అతడు తీసిన ‘సితారే జమీన్‌ పర్‌’ విజయవంతం కావడంతో తన జీవితంలో సవాళ్లను ఎలా అధిగమించాడో పంచుకున్నాడు.

మనిషి ఒంటరితనం అనుభవిస్తున్నప్పుడు, సమస్యతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఎవరో ఒకరు వచ్చి ‘ఇక చాలు... బయటపడు... నిన్ను నువ్వు నిలబెట్టుకో’ అని ధైర్యం చెప్పాలి. అలా ధైర్యం చెప్పే మనిషి  ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలి. లేదంటే సంక్షోభంలో ఉన్న మనిషి తీసుకునే నిర్ణయాలు అసాధారణం అవుతాయి. నేడు పేపర్‌ తెరిస్తే హత్యలు, ఆత్మహత్యలు కనపడుతున్నాయి. సాటి మనిషి నుంచి సరైన సహాయం లేకపోవడం వల్లే ఇలాంటి దుర్ఘటనలు. స్వీయ విధ్వంసం లేకుండా జీవితాన్ని నిలబెట్టుకోవడం నేడు పెద్ద సవాలుగా ఉంది. 

ఇలాంటి స్థితి సెలబ్రిటీలకు కూడా ఉంటుంది. కాని వారు ఎలా బయటపడ్డారో తెలిస్తే సాధారణ వ్యక్తులకు స్ఫూర్తి అందవచ్చు. తాజాగా ‘సితారే జమీన్‌ పర్‌’ సినిమాతో విజయం అందుకున్న అమిర్‌ ఖాన్‌ ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తూ తన జీవిత విశేషాలు చెప్పుకుంటూ వస్తున్నాడు. వాటిలో ఒకటి తన మొదటి విడాకుల సమయంలో ఎదురైన కుంగుబాటు. ‘మా అమ్మ హెచ్చరికతో నేను కోలుకున్నాను’ అంటున్నాడు.

తాగుబోతుగా మారాను
అమిర్‌ ఖాన్‌ కెరీర్‌లో ఎదగక ముందే రీనా దత్తాను 1986లో రహస్య పెళ్లి చేసుకున్నాడు. ఇది ‘సఖి’ సినిమాలో జరిగినట్టుగానే జరిగింది. అయితే ఆ తర్వాత ఇరు కుటుంబాలూ మెల్లగా వారిని యాక్సెప్ట్‌ చేశాయి. అయితే 2000 సంవత్సరం నాటికి వీరి అనుబంధంలో పగుళ్లు వచ్చాయి. అదే సంవత్సరం రీనా పిల్లల్ని తీసుకుని సమీపంలోని ఫ్లాట్‌లోకి మారిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో అమిర్‌ ఇలా చెప్పాడు. ‘రీనా వెళ్లిన రోజు రాత్రి నేను ఇంట్లో ఒక్కణ్ణే ఉన్నాను. పనివాళ్లు లేరు. మా డ్రైవర్‌ని ఆమెకు, పిల్లలకు తోడు ఇచ్చి పంపాను. 

నాకు ఏం చేయాలో పాలుపోలేదు. అప్పటికి నేను ఆల్కహాల్‌ ముట్టలేదు– ఒకటి రెండుసార్లు సినిమా షూటింగ్‌ లో భాగంగా తప్ప. అయితే స్నేహితుల కోసం మా ఇంట్లో ఆల్కహాల్‌ ఉండేది. ఆ రోజు రాత్రి బాటిల్‌ తాగి స్పృహ తప్పి పడిపోయాను. అప్పటి నుంచి రోజూ తాగుతూనే ఉండేవాణ్ణి. నాకు నిద్ర వచ్చేది కాదు. తాగి తాగి స్పృహ తప్పేవాణ్ణి అంతే. ప్రతి శనివారం పిల్లలు వచ్చేవారు. రెండు వారాలకు ఒకసారి రెండు రోజులు నాతో ఉండేవారు. 

ఆ రోజుల కోసం ఎదురుచూసే వాణ్ణి. అప్పుడు మాత్రం తాగేవాణ్ణి కాదు. ఆ సమయంలో నేను సినిమాలు చేయలేదు. ఇంట్లో నుంచి బయటకు రాలేదు. సినిమా పరిశ్రమలో కేవలం ఇద్దరు ముగ్గురే నా పరిస్థితి విని చూడటానికి వచ్చారు. వారిలో జూహీ చావ్లా, సల్మాన్‌ ఖాన్, అనిల్‌ కపూర్‌ ఉన్నారు. ఇక ఇలాగే ఉండిపోతానేమో అనుకున్నాను’ అన్నాడతను.

తల్లి చెప్పిన మాట
అమిర్‌ తండ్రి తాహిర్‌ హుసేన్‌ ఒకప్పటి ప్రసిద్ధ నిర్మాత. తల్లి జీనత్‌ గృహిణి. తండ్రి 2010లో మరణించాడు. తల్లి ముంబైలోని మరో ఇంట్లో కుమార్తెలతో ఉంటోంది. అమిర్‌ జీవితంలో ఏం జరుగుతున్నదో ఆమెకు తెలుసు. కాని ఆమిర్‌ను ఎలా దారికి తేవాలో తెలియదు. ఆ సమయంలో ఏం జరిగిందో అమిర్‌ ఇలా తెలియచేశాడు. ‘నేను డిప్రెషన్‌లో వ్యాయామం వదిలేశాను. ఏం తింటున్నానో ఏం తినడం లేదో తెలియదు. 

అప్పటికి ఏడాదిన్నర అయ్యింది నేను షూటింగ్‌ చేసి. ఒకరోజు ఉదయాన్నే మా అమ్మ ఫోన్‌ చేసింది. పేపర్‌లో నీ ఫొటో రాణి ముఖర్జీతో వచ్చింది చూడు అంది. నా ఫొటో రాణిముఖర్జీతో ఎందుకు వచ్చింది అని పేపర్‌ చూశాను. ఆ రోజుల్లో చాలా లావుగా ఉండే ఒక యాక్టర్‌తో రాణి ముఖర్జీ ఫొటో ఉంది. నేను తిరిగి అమ్మకు కాల్‌ చేశాను– నీ ఫొటో కూడా అలా చూస్తానేమోనని బెంగగా ఉందిరా అంది. 

వెంటనే నాకు షాక్‌ తగిలింది. సాధారణంగా అమ్మలు తమ పిల్లల్ని ఎంత లావుగా ఉన్నా చిక్కిపోయాడనే అంటూ ఉంటారు. ఇక్కడ మా అమ్మ మాత్రం నేను లావుగా అయిపోతున్నానని బాధ పడుతోంది. అమ్మ ఇలా బాధపడటం నా అరాచకానికి అంతిమస్థాయి అనిపించింది. అంతే. ఆ రోజే నిర్ణయం తీసుకున్నాను... మళ్లీ పూర్వపు మనిషి కావాలని. అలా మా అమ్మ నన్ను నిలబెట్టింది’ అన్నాడు. అమిర్, రీనా 2002లో విడాకులు తీసుకున్నారు.

(చదవండి: ప్రధాని మెచ్చిన రొట్టె! ఆ ఒక్క మాటతో..)
 

#

Tags : 1

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)