Breaking News

ప్రజల ఆకలి తీర్చడానికి...

Published on Tue, 10/28/2025 - 11:24

భూమండలాన్ని పృథు చక్రవర్తి పాలిస్తున్న రోజులలో ఒకప్పుడు ధర్మనష్టం జరిగి వర్షాలు పడక, పంటలు పండక, ప్రజలు కందమూలాలు తిని ఆకలి తీర్చుకోవాల్సి వచ్చింది. కరవును భరించలేని జనం పృథు చక్రవర్తి వద్దకు వెళ్ళి ఆ భయంకర క్షామం నుండి కాపాడమని వేడుకున్నారు. అది చూసి తట్టుకోలేని పృథు చక్రవర్తి, సస్యనాశనం కావించి జనులకు ఆహారాన్ని దూరం చేసిన భూదేవిని శిక్షించడానికి పూను కున్నాడు. 

భయపడిన విశ్వంభర గోరూపం ధరించి బ్రహ్మ దగ్గరకు చేరింది. ఎక్కడికి వెళ్ళినా వెంబడించి పట్టుకుని శిక్షిస్తానని, తాను కూడా వెళ్ళాడు పృథు. ‘అంతగా కోపం తెచ్చుకోవడానికి నేను చేసిన తప్పేమిటి?’ అని అడిగింది భూదేవి. ‘క్షామ పరిస్థితులు సృష్టించి ప్రజలు ఆకలితో అలమటించేలా చేసిన దుష్టచారిణివి నీవు. నిన్ను శిక్షిస్తే ప్రజలు సుఖపడతారు’ అన్నాడు పృథు. ‘కరవుకు అసలు కారణం గ్రహించకుండా నీవు నన్ను శిక్షించే ఆలోచన చేస్తున్నావు. నీ ప్రజలను కాపాడుకునే ఉపాయం నేను చెబుతాను. సస్యరాశి సమస్తం, ఔషధాలు నాలో జీర్ణమై ఉన్నాయి. గోరూపంలో ఉన్న నాకు సంతానం కలిగితే, పాల రూపంలో అవన్నీ మళ్ళీ భూమిపై ప్రవహించి, బీజములు మొలకెత్తి, పంటలు సమృద్ధిగా పండుతాయి. కనుక అలా చెయ్యి’ అని సలహా ఇచ్చింది. 

ఆలోచించిన పృథు చక్రవర్తి, పర్వత శ్రేణులతో ఎత్తుపల్లాలుగా ఉన్న భూమిని చదును చేశాడు. గ్రామాలు, పట్టణాలు నిర్మింపజేశాడు.  కాయకష్టం చేయడానికి జీవనోపకరణాలను తయారు చేయించి అందరికీ సమ కూర్చాడు. అలా అంతటినీ వ్యవస్థీకృతం చేసి భూదేవి సలహా ప్రకారంగా చేయడానికి ఇలా పూనుకున్నాడని వెన్నెలకంటి సూరన ‘శ్రీవిష్ణుపురాణం’, ప్రథమాశ్వాసంలో చెప్పాడు. 

కం.  పాయక భూధేనువునకు / స్వాయంభువు గ్రేపుగాగ సమకట్టి మహీ
     నాయకుడు పిదికె దుగ్ధ/ ప్రాయంబై జగములెల్ల బరిపూర్ణముగాన్‌. 

గోరూపంలో ఉన్న భూదేవికి స్వాయంభువ మనువును దూడగా చేసి పృథు చక్రవర్తి పాలు పితికి భూమండలం మొత్తం తడిసేలా చేశాడని పై పద్యంభావం. ఆ చర్యతో భూమి మళ్ళీ సారవంతమై పంటలు పండి ప్రజలు సుఖించారని ‘శ్రీవిష్ణుపురాణం’లోని పృథు చక్రవర్తి కథ చెబుతోంది.
– భట్టు వెంకటరావు

Videos

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)