పోలింగ్ రోజు మా వాళ్లపై చిన్న గీత పడినా... అవినాష్ రెడ్డి మాస్ వార్నింగ్
Breaking News
99 సంవత్సరాల వయసులో... విమానం రెక్కలపై!
Published on Sat, 10/31/2026 - 08:14
నాలుగు అడుగులు నడవాలంటేనే కష్టమయ్యే వయసులో తన సాహసంతో ఔరా అనిపించింది 99 సంవత్సరాల బామ్మ. జర్మనీకి చెందిన హెల్గా డఫీ ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళా వింగ్ వాకర్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది.
వింగ్ వాకర్ అంటే ఎగురుతున్న విమానం రెక్కలపై విన్యాసాలు చేసే స్టంట్ పెర్ఫార్మర్.
‘ఏమాత్రం భయపడ లేదు. చాలా ఉత్సాహగా చేశాను’ అని తన సాహసాన్ని గురించి ఒకింత గర్వంగా చెబుతోంది డఫీ బామ్మ. గ్లౌసెస్టర్‌షైర్‌లోని సైరెన్సెస్టర్లో ఉన్న ఆర్ఎఫ్సీ రెండ్కోంబ్ ఎయిర్‌ఫీల్డ్‌లో వింగ్వాక్ను విజయవంతంగా పూర్తి చేసింది.
తన సాహసంతో అబ్బురపరిచిన డఫీకి విమానాశ్రయంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అధికారులు ఒక సర్టిఫికెట్ అందించారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ పోస్ట్ చేసిన వీడియోలో... జంకు గొంగు లేకుండా విమానంపై దూసుకుపోతున్న డఫీ వీడియోను చూస్తే ఔరవురా అనకుండా ఉండలేము!
హెల్గా డఫీ ఒక కేర్ హోమ్‌లో నివసిస్తోంది. ఎయిర్ అంబులెన్స్ ఛారిటీకి అత్యధికంగా విరాళలు సేకరించిన వారిలో ఆమె ఒకరు. ఛారిటీలో వాలెంటీర్ అయిన సామ్ కాన్వే, హెల్గా డఫీ బామ్మను ‘లెజండ్’గా అభివర్ణించారు.
ఇదీ చదవండి: అక్టోబర్ 31 రాత్రి ఆత్మలు వస్తాయా? ఈ నమ్మకం వెనుక కథేంటి?
Tags : 1