91 ఏళ్ల తల్లి అవధులులేని ప్రేమ..! మంచానికి పరిమితమై కూడా..

Published on Sun, 12/28/2025 - 14:11

తల్లి ప్రేమకు మించిది ఏది లేదు. ఈ సృష్టిలో తల్లికి మించిన దైవం లేదు అన్న ఆర్యోక్తి ఎప్పటికీ ప్రకాశంతంగా వెలుగుతుంటుంది. ముదుసలి వయసులో సైతం తన బిడ్డకు తానే ఏదో చేయాలని తప్పనపడుతుంటుంది. అందుకోసం ఎంతలా తల్లి కష్టపడేందుకైనా సిద్ధపడుతుంది అనేందుకు ఈ 91 ఏళ్ల తల్లే ఉదాహారణ. ఆ ముదసలి వయసులో కూడా కొడుకు కోసం తప్పన పడుతూ అల్లిన స్వెటర్‌లో ప్రతి అల్లికలో ఆమె ప్రేమ, కష్టం కనిపిస్తుంది. ఎంత ఖరీదైన స్వెటర్‌ కూడా ఈ అమ్మ అల్లిన స్వెటర్‌ ఇచ్చిన వెచ్చదనంతో సరితూగదు.

సోషల్‌ మీడియోలో అరుణ్‌ భాగవతులు తన తల్లి అంతులేని ప్రేమకు నిదర్శనమైన ఓ సన్నివేశాన్ని షేర్‌ చేసుకున్నారు. అది నెటిజన్లను ఆకర్షించడమే కాదు..అమ్మ ప్రేమ అనంతం అని కీర్తిస్తున్నారు. ఇంతకీ అతడు పోస్ట్‌లో ఏం రాసుకొచ్చాడంటే..అరుణ్‌ భాగవుతుల తల్లి 91 ఏళ్ల వయసులో మంచానికే పరిమితమై ఉందామె. 

అయినా తన కొడుక్కు తన చేతనైనది ఏదో ఒక గిఫ్ట్‌ ఇవ్వాలనుకుంది. అందుకోసం తన చేత్తో తానే స్వయంగా స్వెటర్‌ అల్లాలనుకుంది. అలా మంచం మీద స్వెటర్‌ కుట్టేందుకు రెడీ అయ్యింది. చేతులు నొప్పి పుట్టినప్పుడల్లా కాసేపు ఆగి విశ్రాంతి తీసుకుని అల్లడం ప్రారంభించేది. కొడుకు మీద ఉన్న ప్రేమ అనారోగ్యాన్ని కూడా పక్కన పెట్టేలా చేసింది. అయితే ఈ వయసులో ఇదంతా ఎందుకు అని కొడుకు వారించిన వినలేదామె. 

అయితే ఆమె మందుగా పైభాగాంలోని మెడ భాగాన్ని పూర్తిచేసింది. ఒక్కసారి ధరించి చూసి..సరిపోయిందో లేదో చెప్పమంది. అయితే అరుణ్‌ దాన్ని వేసుకుని చూసి..కొంచెం పొడవు చేయమని సూచించాను. అందుకోసం అల్లిందంతా విప్పేయాల్సి వస్తుందని తెలియదు. అయితే తన తల్లి ఒక మాటకూడా మారుమాట్లాడకుండా కామ్‌గా అంత విప్పేసి కుట్టింది. నడుము కొలత కాకుండా ఛాలికొలత తీసుకుని కుట్టడంతో కాస్త టైట్‌ అయ్యిందని వివరించాడు అరుణ్‌. 

అయితే ఆమె ముందు వెనుక భాగాలు అల్లడం పూర్తయ్యాక.. మరోసారి అది సరిపోయిందో లేదో చూడమని కోరగా..అప్పుడు ముందు భాగానికి, వెనుక భాగానికి, ఆరు అంగుళాలు ఖాళీ ఉంది. దాంతో ఆమె షాక్‌ అయ్యింది. అయినా సరే ఏదో రకంగా తన తల్లి స్వెట్టర్‌ని పూర్తిచేసి మళ్లీ ఇచ్చారట చూడమని. ఈసారి అది కాస్తా సరిపోయినా..పొట్టైందట. అయితే ఈసారి మార్పులు చేర్పులు గురించి చెప్పబుద్దిగాక, ఊరుకున్నానని ఆయన పోస్ట్‌లో రాసుకొచ్చారు. అంతేగాదు ఆ స్వెట్టర్ పొట్టిగా ఉందేమో..ఆమె ప్రేమ మాత్రం చిన్నది కాదు అని షేర్‌ చేయడం నెటిజన్లు మనసును హత్తుకుంది. బ్రాండెడ్‌ స్వెటర్లలో అత్యంత అమూల్యమైన స్వెటర్‌ అని కొనియాడుతూ పోస్టులు పెట్టారు. 
 

#

Tags : 1

Videos

హార్ట్ పేషెంట్స్ ఎవ్వరూ లేరు..! కేటీఆర్ కు పొన్నం కౌంటర్

అల్లాడిపోతున్నది అమ్మ మా అనిత.. పేర్నినాని ఊర మాస్ ర్యాగింగ్

ఎవడబ్బ సొమ్మని మా భూమిలోకి వస్తారు.. మీకు చేతనైతే..

ఒక్క బిడ్ రాలేదు.. జగన్ దెబ్బకు బొమ్మ రివర్స్.. పగతో రగిలిపోతున్న చంద్రబాబు

సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టిన విజయ్

సాక్షి మీడియా గ్రూప్ డైరెక్టర్ దివ్యారెడ్డికి గోల్డ్ మెడల్

టీడీపీ, జనసేన నేతలే ఛీ కొడుతున్నారు.. అయినా మీకు సిగ్గు రాదు

శివాజీ వ్యాఖ్యలపై కేఏ పాల్ షాకింగ్ కామెంట్స్

వైఎస్ జగన్ ను చూసి చంద్రబాబు అండ్ కో భయపడుతున్నారు

ప్లాన్ చేసి యువకుడి మర్డర్.. అక్కా చెల్లెళ్ల మాస్టర్ ప్లాన్

Photos

+5

బేబీ బంప్‌తో హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

అబుదాబిలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. ఫోటోలు

+5

ప్రభాస్ ది రాజాసాబ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఫ్యాన్స్‌ సందడి.. ఫోటోలు

+5

బీచ్ ఒడ్డున 'కోర్ట్' బ్యూటీ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

మహేశ్ బాబు 'మురారి' క్లైమాక్స్ ఇలా తీశారు (ఫొటోలు)

+5

చీరలో రీసెంట్ ట్రెండింగ్ బ్యూటీ గిరిజ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్‌ కర్ణ్‌ శర్మ (ఫొటోలు)

+5

తెలుగు రాష్ట్రాల్లో వరుస సెలవులు.. కిక్కిరిసిన ఆలయ ప్రాంగణాలు.. పోటెత్తిన భక్తులు.. (చిత్రాలు)

+5

తెలంగాణలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ శివయ్యను మీరు ఎప్పుడైనా చూశారా (ఫొటోలు)

+5

హీరోయిన్ల దుస్తులపై 'శివాజీ' కామెంట్‌.. ట్రెండింగ్‌లో 'అనసూయ' (ఫోటోలు)