Breaking News

900 గంటలు, 180 బటన్స్‌ : ఆమె స్పెషల్‌ వెడ్డింగ్‌ గౌను విశేషాలు

Published on Mon, 06/30/2025 - 11:19

లేటు వయసులో లేటెస్ట్‌గా అంటూ లవ్‌ బర్డ్స్‌ అమెజాన్‌ ఫౌండర్‌ జెఫ్ బెజోస్,లారెన్ సాంచెజ్   (Lauren Sanchez and Jeff Bezos) వివాహ బంధంలోకి  అడుగు పెట్టారు.  ఇటలీలోని వెనిస్‌లో శనివారం రాత్రి పెళ్లి  అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు ప్రపంచవ్యాప్తంగా వ్యాపార, రాజకీయ , వినోద రంగాలకు చెందిన పలువురు సెలబ్రిటీలు హాజరైనారు. ఈ సందర్భంగా 55 ఏళ్ల వధువు వెడ్డింగ్‌ గౌన్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది.

మాజీ టీవీ యాంకర్ , పైలట్ లారెన్ సాంచెజ్, డోల్స్ & గబ్బానా ఆల్టా మోడా రూపొందించిన గౌనులో మెరిసింది. ఈ పెళ్లి గౌను తయారీకి 900 గంటలు పట్టిందట.  అలాగే చేతితో తయారు చేసిన ఇటాలియన్ లేస్,180 సిల్క్ చిఫ్ఫోన్-కవర్డ్ బటన్లుకూడా ఉన్నాయట. హౌస్‌బోట్ చిత్రంలో నటి సోఫియా లోరెన్ ధరించిన 1950ల నాటి లుక్‌ ప్రేరణగా దీని డిజైన్‌ రూపొందించారు. దీని  ధర దాదాపు 12 కోట్లు అని అంతర్జాతీయ మీడియా నివేదించింది. అన్నట్టు ఈ  గౌను తయారీ వెనుక పెద్ద కథే ఉందట.

వోగ్‌ కథనం ప్రకారం  ఏప్రిల్‌లో, సాంచెజ్ బెజోస్  స్థాపించిన బ్లూ ఆరిజిన్స్ స్పేస్ ఫ్లైట్ కంపెనీలో అంతరిక్ష అంచుకు వెళ్లింది. ఈ అనుభవం తనను అనేక విధాలుగా మార్చిందని, అదే తన జీవితంలో మధురమైన క్షణాల సమయంలో  ఎలా కనిపించాలో  నిర్ణయం తీసుకునేలా చేసిందని తెలిపింది.  అంతకుముందు తాను స్ట్రాప్‌లెస్ డ్రెస్ ధరించాలని ఊహించుకున్నానని సాంచెజ్ చెప్పింది.  కాలాతీతంగా, అర్థవంతంగా తన డ్రెస్‌ ఉండాలని నిర్ణయించుకున్నానని తెలిపింది.  అలాగే తన పెళ్లి రోజున తన గ్లామ్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది,  ఇది గౌను కాదు, కవితా భాగం, మీ మ్యాజిక్‌కు ధన్యవాదాలు  అంటూ మేకర్స్‌కు ధన్యవాదాలు తెలిపింది.

తానేంటో, తన స్టోరీ ఏంటో తెలియజేయాలనే కోరికతోపాటు, 11 నిమిషాలు తన అంతరిక్ష యాత్రకు ప్రత్యేక జ్ఞాపకంగా కొంచెం నీలిరంగులో,ముఖ్యంగా పెళ్లి కూతుళ్లు అదృష్టంగా  భావించే వివాహ సంప్రదాయాన్ని జోడించేలా  ఈ స్పెషల్‌ వెడ్డింగ్‌ గౌన్‌ను ఎంచుకున్నట్టు వెల్లడించింది.  అంతేకాదు ఈ డ్రెస్‌ను ముందే చూడాలిన జెఫ్ బెజోస్ చాలా వేడుకున్నాడట. కానీ  బిగ్‌ సర్‌ప్రైజ్‌గా ఉండాలని లారెన్ సాంచెజ్  దీనికి సున్నితంగా తిరస్కరించిందిట. కాగా 2019నుంచి డేటింగ్‌లో ఉన్న  లారెన్ శాంచెజ్ జెఫ్ బెజోస్‌, గత ఏడాది నిశ్చితార్థం చేసుకున్నారు. జూన్ 27న పెళ్లి చేసుకున్నారు. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)