Breaking News

చాట్‌ జీపీటీ బామ్మ..!

Published on Wed, 02/19/2025 - 09:58

చాట్‌ జీపీటీ బామ్మ బెంగళూరుకు చెందిన 88 ఏళ్ల బామ్మ చాట్‌జీపీటీతో స్నేహం కట్టింది. అన్ని ప్రశ్నలూ దానినే అడుగుతోంది. ‘నా మనవడు పెళ్లి చేసుకోవడం లేదు. కారణం ఏంటంటావ్‌’ అనే ప్రశ్నకు చాట్‌జీపీటీ చెప్పిన జవాబుకు నెటిజన్లు బోలెడు ముచ్చటపడుతున్నారు. మనవడు పోస్ట్‌ చేసిన వీడియో వైరల్‌ అయ్యింది.

ఊళ్లలో చాలామంది బామ్మలు టీవీతో కాలక్షేపం చేస్తారు. కాని బెంగళూరు(Bengaluru)కు చెందిన ఈ బామ్మ(Grand mother) ఏకంగా ‘ఏఐ’ చాట్‌బాట్‌ అయిన ‘చాట్‌జీపీటీ’(ChatGPT)తో స్నేహం కట్టింది. వాయిస్‌ ద్వారా చాట్‌జీపీటీతో మాట్లాడవచ్చు కనుక బామ్మ తనకున్న సందేహాలన్నిటినీ దానినే అడుగుతూ కాలక్షేపం చేస్తోంది. ఆమె మనవడు శశాంక్‌ జాకబ్‌ ఇదంతా వీడియో తీసి ఇన్‌స్టాలో పెడితే వస్తున్న ప్రశంసలు అన్నీ ఇన్నీ కావు. ఆ వీడియోలో సంభాషణ ఇలా సాగింది.

బామ్మ: హాయ్‌
చాట్‌జీపీటీ: హాయ్‌
బామ్మ: నా వయసు 88. నా బిపి 165/88 ఉంది. ప్రమాదం అంటావా?
చాట్‌జీపీటీ: సిస్టాలిక్‌ కొంచెం ఎక్కువుంది. డయస్టాలిక్‌ నార్మల్‌గా ఉంది.
బామ్మ: నా మనవడు పెళ్లి చేసుకోనంటున్నాడు. కారణం ఏంటి?
చాట్‌జీపీటీ: ఓ ఇది మంచి ప్రశ్న. నీ మనవడు పెళ్లి వద్దనడానికి అనేక కారణాలు ఉంటాయి. కెరీర్‌ గురించి ఆలోచిస్తుండవచ్చు, ఏవైనా లక్ష్యాలు ఉండవచ్చు లేదా గత అనుభవాల వల్ల కూడా కావచ్చు. బామ్మ మనవడి వైపు తిరిగి: ఏరా.. ఏవైనా గత అనుభవాలు ఉన్నాయా?
మనవడు: ఉండొచ్చు
బామ్మ: సరే అలా అయితే. నీకు క్లారిటీ రావడానికి కొంత టైమ్‌ ఇస్తాను...
ఇంతటితో ఆ సంభాషణ ముగిసింది. ఇన్‌స్టాలో ఈ వీడియోను వేల మంది లైక్‌ చేశారు. బామ్మను చాలా మెచ్చుకుంటున్నారు. బామ్మా.... మనం స్నేహం చేద్దామా అని అడుగుతున్నారు. చాలామంది తమ బామ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు. 

(చదవండి: మహిళా ఉద్యోగిని ఆ సాకుతో జాబ్‌లోంచి తీసేశారు..! కట్‌చేస్తే..)

#

Tags : 1

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు