Breaking News

80 ఏళ్ల స్విమ్మర్‌! ఒకప్పుడు నీళ్లంటే చచ్చేంత భయం..కానీ..!

Published on Mon, 09/16/2024 - 11:13

ఏదైనా నేర్చుకోవాలన్న కోరిక ఉంటే చాలు వయసు ఏ మాత్రం అడ్డంకి కాదు. అదే నిరూపించింది 80 ఏళ్ల బామ్మ. లేటు వయసులో స్విమ్మింగ్‌ నేర్చుకుని ఎన్నో పతకాలు సాధించింది. అతేగాదు నృత్యకారిణిగా కూడా రంగ ప్రవేశం చేసి ఆరంగేత్రం ప్రదర్శించిన అత్యంత వృద్ధురాలిగా పేరు తెచ్చుకుంది. జీవితంలో కష్టాలు మాములే వాటిని పక్కన పెట్టి మంచిగా ఆస్వాదించడం తెలిస్తే హాయిగా జీవించొచ్చు అంటోంది ఈ బామ్మ. ఎవరీమె? రెస్ట్‌ తీసుకునే వయసులో మెరుపుతీగలా పతకాలు సాధిస్తూ.. దూసుకుపోతున్న ఆమె నేపథ్యం ఏంటంటే..

గుజరాత్‌కు చెందిన 80 ఏళ్ల బకులాబెన్‌ పటేల్‌ అనే బామ్మకి ఒకప్పుడు నీళ్లంటే చచ్చేంత భయమట. కానీ ఇప్పుడు గజ ఈతగాడి మాదిరి అలవోకగా ఈత కొట్టేస్తోంది. 58 ఏళ్ల వయసులో ఈత నేర్చుకోవడం ప్రారంభించిందట. మొదట్లో విభిన్న అథ్లెటిక్‌ క్రీడలు ప్రయత్నిస్తూ..చివరికి ఈత నేర్చుకోవాలని నిర్ణయం తీసుకుందట. అలా ఆమె జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈతల పోటీల్లో పాల్గొని ఎన్నో పతాకాలు, సర్టిఫికేట్‌లు సాధించింది. 

ఈ పోటీల నేపథ్యంలో ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా ఆస్ట్రేలియా వంటి 12 దేశాల్లో జరిగే టోర్నమెంట్‌లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. అంతేగాదు ఆ బామ్మ పేరు మీదుగా ఏకంగా తొమ్మిది అంతర్జాతీయ పతకాలు, దాదాపు 500కి పైగా సరిఫికేట్‌లు ఉన్నాయి. అంతేగాదు 400 మందికి పైగా స్విమ్మర్‌లకు శిక్షణ కూడా ఇచ్చింది. 

అలాగే ప్రపంచంలో అత్యంత సవాలుతో కూడిన సముద్రాలు, నదులను కూడా ఈదేసింది. అత్యంత కష్టమైన కెనడియన్‌ సముద్రంలో కూడా అలవోకగా రెండుసార్లు స్విమ్‌ చేసింది. అంతేగాదు ఏదో ఒక రోజు ఇంగ్లిష్‌ ఛానెల్‌ను కూడా జయించి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డును నెలకొల్పాలని భావిస్తోంది బకులాబెన్.  దీంతోపాటు ఏడు పదుల వయసులో భరతనాట్య నృత్యకారిణిగా రంగప్రవేశం చేసింది. పైగా ఆరంగేత్రం ప్రదర్శించిన అత్యంత వృద్దురాలిగా నిలవడమే గాక ఉత్తమ నృత్యకారిణిగా ప్రశంసలందుకుంది. 

ఇక బకులాబెన్ నేపథ్యం వచ్చేటప్పటికీ..ఆమె చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయింది. 13వ ఏటనే వివాహం చేసుకుని ఇద్దర పిల్లలకు తల్లి అయ్యింది. అయితే కొంతకాలనికే భర్త మరణించడంతో ఒంటిరిగా పిల్లలను పోషించుకుంటూ బతికింది. వాళ్లు పెద్దవాళ్లై మంచి పొజిషన్‌లో సెటిల్‌ అవ్వడంతో మళ్లీ ఆమె జీవితం శూన్యంతో నిశబ్దంగా ఉండిపోయింది. 

దీన్నుంచి బయటపడేలా ఆమె తన దృష్టిని క్రీడలవైపుకి మళ్లించింది. అలా ఆమె అంచెలంచెలుగా ఎదుగుతూ మంచి క్రీడాకారిణిగా ఎన్నో  విజయాలు సాధించింది. తాను ఏ రోజుకైనా దేశం గర్వపడేలా విజయం సాధించి, రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోవాలనేది ప్రగాఢమైన కోరికట ఆమెకు. 

(చదవండి: ఫ్యాషన్‌ బ్లాగ్‌తో ..ఏకంగా రూ. 40 కోట్లు..!)
 

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)