105 ఏళ్ల పురాతన మట్టి ఇంటిలో విశ్రాంత ఉద్యోగి..!

Published on Wed, 03/25/2026 - 11:02

ప్రస్తుతం అంతా ఆధునికతతో తీర్చిదిద్దిన ఇళ్లే దర్శనమిస్తాయి. మట్టి ఇళ్లు కనిపించే అవకాశాలే తక్కువ. పైగా దానికి చాలా చాకిరీ చేయాల్సి ఉంటుంది. అలాంటిది ఓ విశ్రాంతి ఉద్యోగి..మట్టి ఇల్లే బాగుందంటూ..ఏకంగా తన తండ్రి కట్టిన వందల ఏళ్ల నాటి మట్టి ఇంటిలో ఉంటున్నాడు. ఎవరతను..? ఎందుకిలా అంటే..

అతడే బ్రెజిల్‌కి చెందిన 80 ఏళ్ల ఫ్రాన్సిస్కో మటియాస్. స్థానికులు అతడిని ముద్దుగా "స్యూ చిక్విన్హో"గా పిలుచుకుంటారు. అతడు ఉద్యోగ కెరీర్‌ అంతా బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో గడిపినప్పటికీ..అక్కడి పట్టణ వాతావరణం అంతగా అతడికి నచ్చలేదు. ఎప్పటికైనా తన మూలాలను వెతుక్కుంటూ తను పుట్టి పెరిగిన బ్రెజిల్‌లోని లోతట్టు గ్రామీణ ప్రాంతానికి వెళ్లిపోవాలని భావించేవాడు. 

అనుకున్నట్లుగానే..ఉద్యోగం నుంచి రిటైర్‌ అవ్వగానే..బ్రెజిల్‌లోని సియారా గ్రామీణ ప్రాంతంలోని హిడ్రోలాండియా ఈనే చిన్న పట్టణానికి వెళ్లిపోయాడు. అక్కడే మటియాస్‌ పెరిగాడు. అక్కడ తన తండ్రి కట్టిన 105 ఏళ్ల నాటి మట్టి ఇల్లు ఉంది. అదికాస్త పాడైనప్పటికీ..ఆ ఇంటిలోనే ఉంటున్నాడు మట్టియాస్‌. అక్కడ సమీపంలోని బావి నుంచి నీళ్లు తోడుకుని కుండల్లో నిల్వచేసుకుంటాడు. ఇక వంట కట్టెల పొయ్యిమీదే చేసుకుంటాడు. 

అది కాస్త శ్రమతో కూడుకున్నది అయినా..అలా వండుకుని తింటేనే రుచిగాఉందని అంటాడు మటియాస్‌.  తన ఇల్లు ఎంత చల్గా ఉంటుందటే..ఏసీలో కూడా అలాంటి అద్భుత వాతావరణం పొందలేమని నవ్వుతూ చెబుతున్నాడు. తన ఇంటిని మరింత అందంగా పునరుద్ధరించాలని అనుకుంటున్నాడు గానీ, అదికూడా నాటి పురాతన పద్ధతుల్లోనే చేయాలనేది అతడి ఆలోచన. 

నిజానికి ప్రస్తుతం ఇలాంటి ఇళ్లు కనిపించే అవకాశం లేదు. కానీ ఇతడి జీవన విధానం, ఇంటిని చూస్తే..కాలం ఒక్కసారిగా కాలం ఆగిపోయి వెనుతిరిగిందేమో అనిపిస్తుంది. ప్రస్తుత డిజిటల్‌ ప్రపంచంలో..ప్రతీదాంట్లో కొత్తదనం కనిపిస్తున్న ఈ తరుణంలో..పూర్వకాలం నాటి వేగానికి వెళ్లిపోయామా అనిపిస్తుంది మటియాస్‌ జీవన విధానం చూడగానే. ఆ మట్టి ఇల్లు మరో యుగంలోకి తీసుకుపోయినట్లు అనిపించినా..అది నాటి సాంప్రదాయ గ్రామీణ వాస్తు శిల్పానికి సజీవ ఉదాహరణగా చెప్పవచ్చు. 

అక్కడ అతను ఏకాకీగా లేడు..చుట్టుపక్కల వాళ్లు ఏదో ఒకటైంలో వచ్చి పలకరిస్తూ ఉంటారట కూడా. ప్రస్తుత డిజిటల్‌ ప్రపంచంలో అంతా ఫోన్‌లోనే మాటలు, కలుసుకోవడం అయిపోయాక..ఇలాంటి పిచ్చపాటి కబుర్లుతో కూడిన మానవ స్పర్శ తనకు అత్యంత విలువైనదని చెబుతున్నాడు మటియాస్‌. నిజానికి ఈ 80 ఏళ్ల మటియాస్‌ తాత చెబుతున్న ప్రతి మాట అక్షర సత్యం..నాటి రోజులే నిజంగా గొప్పవి..కష్టపడి పనిచేసేవాళ్లం, హాయిగా కడుపు నిండా కబుర్లు చెప్పుకునేవాళ్లం. కానీ ఇప్పుడు నోటికి తాళం చెప్పి.. బుర్ర, చేతులు..అనుక్షణం ఐఫోన్‌, స్మార్ట్‌ఫోన్‌లకు అంకితమై మూగ ప్రపంచంలో బతికేస్తున్నాం కదూ..!.

(చదవండి: అచ్చం పండ్ల తరహాలో నోరూరించే డిజర్ట్స్‌..! ఆ క్రియేటివిటీకీ మాటల్లేవ్‌ అంతే..)

 

#

Tags : 1

Videos

ఐదేళ్లలో లక్షను కోటి చేసిన ఐటీ స్టాక్.. ఏకంగా 10 వేల శాతం జంప్ ...

KCR మంచి దోస్త్ నాకు..

తొందర పడకు.. ప్రతి రోజు సినిమా చూపిస్తా..

BJP MLA రాకేష్ రెడ్డి క్షమాపణ చెప్పాలి..

పూరీలా ఒక్క రోజు బతికితే చాలు..

పరిస్థితుల్ని అదుపుచేయ్యాలి అంటే లాక్ డౌన్ తప్పదా..?

ఆ బిల్లుకు పూర్తి మద్దతు మోదీకి జగన్ ట్వీట్

కూటమి వేధింపులు.. IAS, IPSలను కూడా వదలరా!

యుద్ధం పేరుతో గ్యాస్ మాటలు... కిరోసిన్ ఇస్తావు సరే... స్టవ్ లు సంగతేంటి

ఇబ్బందులు ఉంటాయి తెలిసినా అశోక్ బాబు మాత్రం...

Photos

+5

నువ్వు దేవుడిచ్చిన వరం.. కూతురిని చూసి మంచు లక్ష్మీ ఎమోషనల్ (ఫోటోలు)

+5

డిఫరెంట్ లుక్స్‌తో షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

వావ్ అనేలా మహేశ్-రాజమౌళి 'వారణాసి' సెట్స్ ఫొటోలు

+5

IPL 2026: కెప్టెన్లంతా ఒకే చోట..! (ఫొటోలు)

+5

హనీమూన్ కాదు బడ్డీమూన్.. రష్మిక-విజయ్ ఇలా (ఫొటోలు)

+5

ఇదేం బిల్డప్‌ చంద్రబాబూ.. క్రెడిట్ చోరీ ఆగదా?: వైఎస్‌ జగన్‌ (ఫోటోలు)

+5

యువ నటుడు కెన్ కరుణాస్ 'యూత్' సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : పెట్రోల్‌ బంక్‌ల వద్ద భారీ క్యూ.. వదంతులతో జనం పరుగులు (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో జోరు వాన (ఫోటోలు)

+5

నటిని పెళ్లాడిన ప్రముఖ ర్యాపర్‌ బాద్‌షా (ఫోటోలు)