బైకును ఎత్తిండ్రు అన్నలు
Breaking News
77 ఏళ్ల 'ఫిట్‌నెస్ క్వీన్'..! ఓ బామ్మ సరిలేరు మీకెవ్వరూ..
Published on Fri, 08/01/2025 - 16:57
సెలబ్రిటీలు, ప్రముఖులు ఫిట్‌నెస్ ట్రైనర్లు, పోషకాహారుల నిపుణులు పర్యవేక్షణ వంటివి ఉంటేనే మంచి ఫిట్‌నెస్‌ని సాధించగలరు. అవన్నీ కూడా పెద్దపెద్ద వాళ్లకే మనలాంటి వాళ్లకు అలాంటి సౌకర్యాలు ఉండవు కాబట్టి మనవల్ల కాదు అనుకుంటారు చాలామంది. కానీ ఈ బామ్మని చూస్తే ఆ విధమైన ఆలోచనతీరునే మార్చుకుంటారు. సాదాసీదాగా ఉన్నవాళ్లు కూడా తమ ఆరోగ్యంపై ఫోకస్ పెట్టొచ్చు అని తెలుస్తుంది ఈ బామ్మని చూస్తే. వృద్ధాప్యాన్ని అత్యంత ఆనందంగా ఎలా ఆస్వాదించాలో నేర్పుతోందామె.
ఆమెనే హర్యానాకు చెందిన సాబో దేవి అనే 77 ఏళ్ల బామ్మ. గ్రామీణ హర్యానాకు చెందిన సాబోదేవి..అసాధారణమైన ఫిట్‌నెస్‌కి కేరాప్ అడ్రస్ ఆమె. చక్కటి జీవనశైలి, మంచి వర్కౌట్లతో అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఈ వయసులో అంతలా వ్యాయమాలా అని ఆశ్చర్యపోయేలా చేస్తోందామె. అంతేగాదు ఆమె ఫిట్‌నెస్ పట్ల ఫోకస్‌ని చూసి చుట్టుపక్కల వాళ్లంతా 'హర్యానా ఫిట్‌నెస్ క్వీన్' అని ఆమెకు కితాబు కూడా ఇచ్చారు. అంతలా ఆకర్షించేలా ఆమె ఏం చేస్తుంది అనే కదా సందేహం.
ఆమె బాల్యంలో సరదాగా నేర్చుకున్న ఈత తన దినచర్యలో భాగం చేసుకుంది. ఆమె తన ప్రతి ఉదయాన్ని ఈతతో ప్రారంభిస్తారామె. ఈ ఈత నైపుణ్యంతోనే గంగానదిలో పడిపోయిన ముగ్గురు వ్యక్తులను కాపాడి సూపర్ బామ్మ అని కూడా అనిపించుకుంది. ఈ తరాన్ని ప్రేరేపించేలా స్క్వాట్‌లు చేస్తుంది. తన వయసు శారీరక పరిమితులకు సంబంధం లేకుండా యువత మాదిరిగా చురుకుగా ఉంటుందామె. అందులోనూ ఆమెది గ్రామీణ నేపథ్యమే అయినా..ప్రతి ఉదయం వ్యాయమాలు, తీసుకునే ఆహారానికి ప్రాధాన్యత ఇస్తుంది.
అథ్లెట్లకు కూడా కష్టసాధ్యమైన గంగానది ఈతను అలవోకగా చుట్టొచ్చేసింది. అంతేగాదు 2024లో తన మనవడితో కలసి సాబోదేవి 'ఐస్ ఛాలెంజ్'ను స్వీకరించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆమె తన మనవడి పక్కన మంచుతో నిండిన తొట్టిలో గంటల తరబడి ఉండి మరి అతడిని ఓడించింది.
ప్రమాదవశాత్తు సోషల్ మీడియా ఐకాన్..
హర్యానాలో సోనిపట్‌లోని సీతావాలి గ్రామంలో జన్మిచింది సాబో దేవి. హుల్లెడి గ్రామానికి చెందిన ట్రాక్టర్ మెకానిక్ కృష్ణను వివాహం చేసుకుంది. చిన్న వయసులోనే ఆమె భర్త మరణించడంతో ఆమె ఒక్కత్తే ఆ ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలను ఒంటరిగా పెంచింది. పిల్లలందరికి వివాహలైపోగా, తన రెండో కుమారుడితో ఉంటుందామె. అతడి కొడుకు చిరాగ్ అకా ఖగత్ కారణంగా సోషల్ మీడియా ఐకాన్‌గా మారింది.
చిరాగ్ తన బామ్మ వ్యాయామాలు, ఈత కొడుతున్న చేస్తున్న వీడియోలు నెట్టింట షేర్ చేయడంతో ఒక్కసారి ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయింది. సాంప్రదాయ భారతీయ జీవన విధానం ప్రాముఖ్యతను తెలియజేసేలా ఆమె ఆహార్యం అందరిని ఆకట్టుకుంటుంది. ఆవనూనె, నెయ్యి, తాజా ఆకుకూరలు, తేలికపాటి పదార్థాలనే తీసుకుంటానని చెబుతోంది.
అంతేగాదు దేశీ నెయ్యి, ఆవాల నూనె, పచ్చి కూరగాయలు, గోధుమలు తదితరాలే మంచి ఆరోగ్యానికి ప్రధానమైనవని నిపుణులు సైతం సూచించడం విశేషం. అందువల్ల ఆమెను అంతా ఫిట్‌నెస్ క్వీన్ కీర్తిస్తున్నారు. ఆమె జీవిత విలువలకే కాదు ఫిటనెస్కు, సాంస్కృతిక పరిజ్ఞానానికి, ధైర్యానికి ఐకాన్‌గా నిలిచి అందరికి స్ఫూర్తిని కలిగిస్తోంది.
(చదవండి: పిల్లికి హైలెవల్ సెక్యూరిటీ..! ఇంకా ఇలానా..!)
Tags : 1