తాడేపల్లి YSRCP పార్టీ ఆఫీస్ కూల్చివేత అంబటి స్టాంగ్ వార్నింగ్
Breaking News
71 ఏళ్ల మాజీ ఫ్యామిలీ కోర్ట్ జడ్జి భరతనాట్య ప్రదర్శన!
Published on Thu, 10/08/2026 - 10:42
ఎర్నాకుళం ఫ్యామి కోర్టు మాజీ న్యాయమూర్తి, మానవ హక్కుల కమిషన్ మాజీ చైర్మన్ పి మోహన్‌దాస్ 71 ఏళ్ల వయసులో గురువాయూర్‌లోని శ్రీకృష్ణుని సన్నిధిలో తన తొలి భరతనాట్య ప్రదర్శన చేశారు. ఆయన 'హస్త స్కూల్ ఆఫ్ డాన్స్'కు చెందిన నృత్య గురువు డాక్టర్ చంద్రిక సుందరేషన్ వద్ద 21 నెలల పాటు శిక్షణ పొంది మరి అరంగేట్రంగా పిలిచే తొలి భరనాట్య ప్రదర్శన చేశారు.
గతంలో నృత్యం నేర్చుకున్నప్పటికీ ఇంతకు ముందెన్నడు ఇలా ప్రదర్శన ఇవ్వలేదు. ఈసారి ఆరుగుర మహిళలతో కలిసి ఈ భరతనాట్య ప్రదర్శనలో పాల్గొన్నారు. మానహక్కుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వర్ష చంద్రన్ , అర్చన, శోభశ్రీకుమార్, జీజ, జైసీ, హిష్ణ తదితర మహిళలు మాజీ జడ్జి మోహన్‌దాస్‌తో వేదికను పంచుకున్నారు. ఈ మహిళలు కూడా గతంలో నృత్యం నేర్చుకుని వివిధ కారణాల వల్ల అరగేట్రం చేయలేకపోయిన వాళ్లే కావడం విశేషం.
ఇక ఈ ప్రదర్శనలో పుష్పాంజలి, తోడయం, అష్టలక్ష్మీ స్తుతి వంటి అంశాలు ప్రధాన భాగం ఉన్నాయి. వయసుతో సంబంధం లేకుండా, పదవీ విరమణ తర్వాత కూడా కళల పట్ల ఉన్న ఆసక్తితో ఆయన చేసిన ఈ ప్రయత్నం సోషల్ మీడియాలో విశేష ప్రశంసలు అందుకుంటోంది.
ఇదీ చదవండి: శాకాహరం అందించే కేఎఫ్‌సీ గురించి తెలుసా..!
Tags : 1