Breaking News

తాతగారి సెన్సేషనల్‌ విడాకులు : భరణం ఎంతో తెలిస్తే అవాక్కే!

Published on Wed, 12/18/2024 - 13:56

బెంగళూరు టెకీ ఆత్మహత్మ, భరణం కేసు ప్రకంపనలు రేపుతున్న తరుణంలో మరో ఆసక్తికరమైన విడాకుల  కేసు ఒకటి  వెలుగులోకి వచ్చింది. హర్యానాలోని కర్నాల్ జిల్లాకు చెందిన 70 ఏళ్ల రైతు  ఒకటీ రెండూ  కాదు, ఏకంగా 18 ఏళ్ల పాటు సుదీర్ఘ న్యాయ పోరాటం చేసి,  కోట్ల రూపాయల భరణం చెల్లించిన ఉదంతం నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. అదీ పెళ్లి అయిన 44  ఏళ్ల తరువాత పట్టువీడకుండా, శాశ్వత భరణంగా రూ.3.01 కోట్లు చెల్లించి సెన్సేషన్ క్రియేట్ చేశాడు.

వివరాలు ఇలా ఉన్నాయి...
హర్యానాలోని కర్నాల్ జిల్లాకు చెందిన  సుభాష్ చంద్  1980, ఆగస్టు 27వ తేదీన సంతోష్ కుమారిని పెళ్లి చేసుకున్నాడు. ఉన్నన్ని రోజులు వీరి సంసారం సజావుగానే సాగింది.  వీరి అన్యోన్య దాంపత్యానికి  గుర్తుగా  ముగ్గురు పిల్లలు కూడా పుట్టారు. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. అంతా బావుంది అనుకుంటున్న క్రమంలో ఈ జంట మధ్య విభేదాలు మొదలయ్యాయి. అవి చిలికి చిలికి గాలివానలా మారాయి. దీంతో  2006,  మే 8వ తేదీ నుంచి విడిగా జీవించడం ప్రారంభించారు.  భార్యనుంచి విడాకులు ఇప్పించాల్సిందిగా 2006లొనే  కోర్టును ఆశ్రయించాడు. అయితే కర్నాల్ కోర్టు 2013 జనవరిలో అతని విడాకుల అభ్యర్థనను తిరస్కరించింది. అయినా పట్టువీడని సుభాష్‌ హైకోర్టులో అప్పీల్ చేశాడు.

దాదాపు 11 సంవత్సరాల  తరువాత రాజీ  చేసుకోవాల్సిందిగా కోరిన హైకోర్టు, ఈ ఏడాది నవంబర్ 4వ తేదీన  ఈ విషయాన్ని మధ్యవర్తిత్వం మరియు రాజీ కేంద్రానికి సూచించింది. ఈ ప్రక్రియలో భాగంగానే వీరికి మంజూరైనాయి.  అయితే భార్యకు శాశ్వత భరణంగా మొత్తం 3.07 కోట్ల రూపాయలను చెల్లించేందుకు అంగీకరించాడు సుభాష్‌. దీనికి భార్యతో పాటు ముగ్గురు పిల్లలు కూడా  అంగీకరించారు.  అయితే ఈ భరణం  ఎలా చెల్లించాడు అనేదే హాట్‌ టాపిక్‌
 
అంత భరణం ఎలా?
తన  వ్యవసాయ భూమిని అమ్మి మరీ డిమాండ్ డ్రాఫ్ట్‌గా 2 కోట్ల 16 లక్షల రూపాయలను చెల్లించాడు. పంట అమ్మగా వచ్చిన సొమ్ముతో  50 లక్షల నగదు చెల్లించాడు. ఇక మిగిలిన  40 లక్షల రూపాయలను బంగారు, వెండి రూపంలో చెల్లించాడు. ముదిమి వయసులో , 18 ఏళ్ల  సుదీర్ఘం న్యాయ పోరాటం తరువాత  44 ఏళ్ల తమ వివాహ బంధానికి  స్వస్తి పలకడం చర్చకు దారి తీసింది. 

ఒప్పందం ప్రకారం చంద్‌కు చెందిన ఆస్తిపై భార్యాపిల్లలు అన్ని హక్కులను వదులు కున్నారని చంద్‌కు చెందిన రాజిందర్ గోయెల్ పేర్కొన్నారు. ఈ పరస్పర నిర్ణయాన్ని కోర్టు అంగీకరించి గత వారం విడాకులు ఖరారు చేసిందని ఆయన వెల్లడించారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)