Breaking News

ఆటో డ్రైవర్‌ బామ్మ @ 65

Published on Tue, 02/24/2026 - 05:52

‘నువ్వు నాకు ఆటోడ్రైవింగ్‌ నేర్పించాలిరా కన్నా’ అని కుమారుడిని అడిగింది మంగళ. ‘ఈ సరదా ఏమిటి!’ ఆశ్చర్యంగా అడిగాడు కుమారుడు. ‘సరదా కోసం కాదు, ఆటో నడిపి నాలుగు డబ్బులు సంపాదించాలనుకుంటున్నాను’ అని చెప్పింది తల్లి. మనసులో ఏమనుకున్నాడో తెలియదుగానీ, తల్లి కోరినట్లే ఆటో నడపడం నేర్పించాడు కుమారుడు. పదిహేను రోజుల్లో పర్‌ఫెక్ట్‌గా ఆటోనడపడం నేర్చుకుంది మంగళ. ఆ తరువాత ఆటోరిక్షా డ్రైవర్‌గా కొత్త ప్రయాణం మొదలుపెట్టింది. మహారాష్ట్ర సతార జిల్లాలో కరాడ్‌–ఉండాలే రోడ్డులో రోజూ ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఆటో నడుపుతుంది. 

నెలకు అయిదు నుంచి ఏడు వేల వరకు సంపాదిస్తుంది. ఇది తక్కువ మొత్తమే కావచ్చు. ఆమెకు మాత్రం కోట్లతో సమానం! ఎందుకంటే ఆ డబ్బులో శ్రమ ఫలం ఉంది. ఆత్మగౌరవం ఉంది. ‘నేను చాలారోజులు ఇంట్లోనే ఉన్నాను. దీని వల్ల ఎవరికీ ఉపయోగం లేదు అనిపించింది. ఏదో ఒక పని చేయాలనుకున్నాను. నా కొడుకు ్రపోత్సాహంతో ఆటో నడపడం నేర్చుకున్నాను. ఇంటి ఖర్చులకు, నా వైద్య అవసరాలకు నేను సంపాదించిన డబ్బు ఉపయోగపడుతుంది. డ్రైవింగ్‌ అంటే నాకు ఇష్టం కాబట్టి, ఎలాంటి భయం ఉండదు. ఇతర డ్రైవర్లు నన్ను గౌరవంగా చూస్తారు. ముందు అమ్మను వెళ్లన్విండి అంటారు’ అని ఆసందంగా చెబుతోంది 65 సంవత్సరాల మంగళ.


 

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు