Breaking News

నీట్‌ ఎగ్జామ్‌ పాసైన 62 ఏళ్ల డాక్టర్‌.. స్టూడెంట్‌గా కాలేజ్‌లో..!

Published on Mon, 02/10/2025 - 16:10

గతంలో చదువుకోవడానికి వయసుతో సంబంధం లేదని చాలామంది నిరూపించారు. అలా కాకుండా ఉన్నతమైన వృత్తిలో స్థిరపడి పదవీవిరమణ చేసే సమయంలో మరిన్ని విద్యా అర్హతలు సంపాదించాలనుకోవడం మాములు విషయం కాదు !. పైగా ఆ వయసులో కఠినతరమైన ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ చదివి పాసవ్వడం అంటే ఆషామాషి కాదు. కానీ ఈ పెద్దాయన చాలా అలవోకగా సక్సస్‌ అయ్యి.. చదవాలంటేనే భారంగా భావించే విద్యార్థలందరికీ స్ఫూర్తిగా నిలిచాడు. ఇంతకీ అతడెవరో వింటే మాత్రం కంగుతినడం గ్యారంటీ. అంతటి బిజీ వృత్తి చేపట్టి కూడా ఆ వయసులో చదువుకోవాలనుకుంటున్నాడా..? అని నోరెళ్లబెడతారు. 

ఎవరంటే..62 ఏళ్ల వయసులో  పీడియాట్రిక్ వైద్యుడు డాక్టర్ నీలి రాంచందర్ నీట్ పీజీ 2024 పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఇప్పుడాయన ప్రభుత్వ వైద్య కళాశాలలో అడ్మిషన్‌ తీసుకోనున్నారు. ఆయనకు సుదీర్ఘ కెరీర్‌ ఉన్నప్పటికీ..అత్యంత కఠినతరమైన పరీక్షలలో ఒకటైన నీట్‌ పీజీ 2024 ఎగ్జామ్‌ ప్రిపేరై పాసవ్వడం చాలామంది విద్యార్థులకు ప్రేరణగా నిలిచింది. ఈ వయసులో కూడా నేర్చుకునేందుకు మక్కువ చూపించడం అనేది విశేషం. 

సుదీర్ఘ కల సాకారం కోసం..
నిజామాబాద్‌కు చెందిన నీలి రాంచందర్‌ ప్రముఖ శిశు వైద్యుడుగా 30 ఏళ్లకు పైగా సేవలందించారు. తన కెరీర్‌ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి, కొత్త వైద్య అర్హతలను పొందడానికి నీట్‌ పీజీ 2024 పరీక్షకు హాజరయ్యారు. ఇప్పుడు ఆయన నిజామాబాద్‌ ప్రభుత్వ వైద్య కళాశాలలోని ఎండీ(ఫార్మకాలజీ) కోర్సులో చేరి విద్యార్థిగా మారడానికి సిద్ధంగా ఉన్నారు. 

ఆయన 2014లో ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ జాతీయ ఉపాధ్యక్షుడు, తెలంగాణ పీడియాట్రిక్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడితో సహా ప్రతిష్టాత్మక పదవులను అలంకరించారు. అతను నేషనల్ రెడ్ క్రాస్ గోల్డ్ మెడల్ (2017-2018)తో సహా అనేక అవార్డులను కూడా అందుకున్నారు. ఎండీ కోర్సును అభ్యసించాలనే అతని దీర్ఘకాల కోరిక అతన్ని NEET PG 2024కి హాజరు కావడానికి ప్రేరేపించింది.

వైద్యుడిగా ప్రస్థానం..
డాక్టర్ రాంచందర్ ప్రారంభంలో 1982లో బీ. ఫార్మా కోర్సును వదిలి కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్‌లో చేరారు. అతను 1991,  1993ల మధ్య పీడియాట్రిక్స్‌లో సేవ చేయడానికి డిప్లొమా ఇన్ చైల్డ్ హెల్త్ (DCH) పూర్తి చేశారు. 

ఆ తర్వాత వెంటనే ప్రాక్టీస్‌ చేపట్టి వైద్యుడిగా బిజీ అయిపోయారు. ఈ నేపథ్యంలో ఎండీ పూర్తి చేయలేకపోయారు. సరిగ్గా 62 ఏళ్లకు తన చివరి కలను సాకారం చేసుకునే అవకాశం చిక్కింది. ఆయన ఏమాత్రం సంశయించకుండా ఈ వయసులో ఉన్నత చదువు చదవాలనుకోవడం ప్రశంసించనదగ్గ విషయం. సాకులు చెప్పే ఎందరో విద్యార్థులకు స్ఫూర్తి ఈ శిశు వైద్యుడు.

(చదవండి: దటీజ్‌ సుధీర్‌..! దూషించే పదాన్నే లగ్జరీ బ్రాండ్‌గా మార్చి..)

 

 

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)