Breaking News

ఆరు అలవాట్లు.. విజయానికి అడ్డు గోడలు

Published on Tue, 02/18/2025 - 09:20

మనం లోతుగా దృష్టిసారిస్తేగానీ గ్రహించలేని మనలోని కొన్ని అలవాట్లు మన విజయానికి అడ్డుగోడలుగా నిలుస్తుంటాయి. వీటిని గుర్తించి, మన తీరుతెన్నులను మార్చుకున్నప్పడే మనం విజయబావుటా ఎగురవేయగలుగుతాం. ఆ అలవాట్లు ఏమిటో, వాటిని మనలో నుంచి ఎలా తరిమికొట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.

విజయానికి అడ్డుపడే అలవాట్లివే..

1. ప్రతీ పనిని వాయిదా వేయడం
మనలో చాలామంది తాము చేయాల్సిన ప్రతి పనిని వాయిదా వేస్తుంటారు. ఇటువంటి అలవాటును ప్రొక్రాస్టినేషన్‌(Procrastination) అని అంటారు. ఇటువంటి అలవాటు ఎవరిలో ఉన్నా, విజయం అనేది వారి దరిదాపులకు కూడా చేరదని మానసిక నిపుణులు చెబుతుంటారు. చేయాల్సిన పనిని తగిన సమయంలో మొదలుపెట్టి, పూర్తిచేయడం వలన విజయానికి చేరువవుతాం.

2. నెగిటివ్‌ ఆలోచనలు
మనలోని ఆలోచనలే మన పనులలో ప్రతిబింబిస్తుంటాయి. మనలో మనం, మనతో మనం ఎలా మాట్లాడుకుంటామో అలాగే ‍మనం ప్రవర్తిస్తుంటాం. నిత్యం నెగిటివ్‌ విషయాలు (Negative Talks) మాట్లాడుకోవడమనేది ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. అదే సమయంలో పాజిటివ్‌గా వ్యవహరించడం విజయానికి దోహదపడుతుంది. కష్టమైన పరిస్థితుల నుంచి బయటపడేలా చేస్తుంది.

3. రిస్క్‌ తీసుకోకపోవడం
ఎవరైనా  ఏదైనా కొత్త పనిని చేపట్టేందుకు రిస్క్‌ తీసుకోవడంలో వెనుకాడితే వారికి విజయావకాశాలు సన్నగిల్లుతాయి. అందుకే రిస్క్‌ తీసుకునైనా సరే ఏరైనా మంచి పనిని ప్రారంభించాలి. అప్పుడే విజయానికి దగ్గరవుతాం.

4. లైఫ్‌ స్టయిల్‌లో చెడు అలవాట్లు
రోజువారీగా తీసుకునే ఆహారం, చేసే వ్యాయామంపై దృష్టిపెట్టినప్పుడే శరీరం బలిష్టంగా మారుతుంది. అప్పుడే మానసికంగా  మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మంచి అలవాట్లను అలవరుచుకోవడం ద్వారా ఉత్సాహంగా ఉంటూ విజయంవైపు ముందడుగు వేయగలుగుతాం.

5. ప్రతీదాన్నీ సమస్యగా చూడటం
ఎవరైనా ప్రతీ అంశాన్ని సమస్యగా తీసుకుంటే వారు జీవితంలో ముందుకు సాగలేరు. అన్నింటినీ సమస్యలుగా చూడకుండా, వాటికి పరిష్కారాలను కనుగొంటే విజయావకాశాలు దగ్గరవుతాయి.

6. ఇతరులను సంతోష పెట్టాలనుకోవడం
చాలామంది ఇతరులను సంతోషపెట్టాలని, వారి మెప్పు పొందాలని ప్రయత్నిస్తుంటారు. దీనిని చెడ్డ అలవాటు అని మానసిక నిపుణులు చెబుతుంటారు. ఈ తరహాలో ప్రవర్తించే వ్యక్తి తన లక్ష్యాన్ని మరిపోతాడని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటువంటి అలవాట్లను దూరం చేసుకున్న వ్యక్తి విజయానికి దగ్గరవుతాడని వారు సూచిస్తున్నారు. 

ఇది కూడా చదవండి: Railway Station Stampede: రద్దీ నియంత్రణకు మూడు విధానాలు
 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)