Breaking News

ప్రాణాంతక 'డయాబెటిక్‌ కోమా స్టేజ్‌'..! కానీ ఆమె జస్ట్‌ రెండు నెలల్లో..

Published on Mon, 06/30/2025 - 12:53

ప్రతి ఏడాది వేలాది మంది డయాబెటిస్‌ సమస్యతో బాధపడుతున్నారు. దీన్ని మందులతోనే నిర్వహించగలం తప్ప నివారిణి ఉండదు. అయితే కొందరూ ఈ సమస్యను  చక్కటి జీవనశైలితో అధిగమించి స్ఫూర్తిగా నిలుస్తారు. ఇక్కడ కావల్సింది తాను ఈవ్యాధి నుంచి బయటపడి మెరుగైన ఆరోగ్యంతో ఉండాలనే 'గట్టి పట్టుదల'. అది ఉంటే డయాబెటిస్‌ ఎంతటి ప్రమాదకర స్టేజ్‌లో ఉన్న అవలీల అధిగమించగలరు అనేందుకు ఉదాహారణ ఈ 57 ఏళ్ల మాజీ జర్నలిస్ట్‌ ఉషా రాచెల్ థామస్. ఆమెకు శరీరంలో చక్కెర స్థాయిలు ఏ రేంజ్‌లో ఉన్నాయో..? ఆమె పరిస్థితి ఎంత క్రిటికల్‌గా ఉందో తెలిస్తే విస్తుపోతారు. మరీ అంతటి ప్రమాదకరస్థితిలో ఉన్న డయాబెటిస్‌ని జయించి ఎలా ఆరోగ్యవంతురాలిగా మారిందో సవివరంగా చూద్దామా..!.

సీనియర్ బ్రాండ్ స్ట్రాటజిస్ట్ అండ్‌ కమ్యూనికేషన్స్ లీడర్ ఉషా రాచెల్ థామస్ అధిక ఒత్తిడి, అనారోగ్యకరమైన జీవనశైలి అలవాట్లతో ఉండేది. చెప్పాలంటే.. తన ఆరోగ్యంపై ధ్యాస పెట్టేది కాదు. తాను డయాబెటిస్‌ పేషెంట్‌నని తెలిసి కూడా లైట్‌ తీసుకుంది. ఉత్తిపుణ్యానికే అలసట, విపరీతమైన దాహం, భోజనం చేసిన వెంటనే  అలిసిపోవటం వంటి శరీర సంకేతాలను కూడా నిర్లక్ష్యం చేసింది. ఫలితంగా ఆమె శరీరంలోని గ్లూకోజ్‌ స్థాయిలు అమాంతం పెరిగిపోయాయి. 

ఒకరోజు అనుకోకుండా ముంబైలోని ఒక ప్రముఖ డాక్టర్‌ని సందర్శించింది. ఆయన  శరీరంలోని గ్లూకోజ్‌ స్థాయిలు చూసి అవాక్కయ్యారు. ఎందుకంటే గ్లూకోమీటర్ ఏకంగా 500 నుంచి 538 పైనే రీడింగ్‌ చూపిస్తోంది. అంటే..ఇది ఒక షుగర్‌ పేషెంట్‌కి ఉండాల్సిన దానికంటే ఐదు రెట్లు ప్రమాదకర స్థాయిలో ఉందని అర్థం. ఆ వైద్యుడు ఉషతో మీరు ఐసీయూలో ఉండాలని చెప్పారు. ఆ మాటలు విని ఉషకు గుండె ఆగినంత పని అయ్యింది.

 ఆయన ఉషను  డయాబెటిక్ కోమా స్టేజ్‌లో ఉన్నట్లు తేల్చి చెప్పారు. పరిస్థితి ఇలానే ఉంటే..ఏ క్షణం ఎలా ఉంటుందో చెప్పడం కష్టం అన్నారు. అందువల్ల ఉషా అనునిత్యం డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉండటం మంచిది అని సూచించారాయన. ఆ డాక్టర్‌ మాటలు చెంప చెళ్లుమనిపించినట్లయ్యింది ఉషకు. ఒక్కసారి తన అనారోగ్యకరమైన అవాట్లు అన్ని కళ్లముందు కదలాడాయి. చేజేతులారా తానే ఈ పరిస్థితి కొని తెచ్చుకున్నానని కుమిలిపోయింది. 

మూడెళ్ల నుంచి తన శరీరం ఇస్తున్న​ సంకేతాలను తాను ఎలా నిర్లక్ష్యం చేసిందో గుర్తు తెచ్చుకుంది. కాళ్లలో వచ్చిన బెణుకులు, శరీరంలోని అసాధారణ మార్పులను గమనించడం ప్రారంభించింది. తన అధిక బరువుపై కూడా ఫోకస్‌ పెట్టింది.

మార్పుని బలంగా స్వాగతించడం..
వెంటనే అధిక బరువుని నియంత్రణలోకి తెచ్చుకుంటే గనుక తాను ఎదుర్కొనే చిన్న చిన్న అనారోగ్య సమస్యలను అధిగమించొచ్చు అని భావించింది ఉష. ఆ దిశగా వర్కౌట్లు, తీసుకునే ఆహారంపై ధ్యాస పెట్టడమే గాక మంచి జీవనశైలిని అనుసరించింది. ఎలాగైన డయాబెటిస్‌ని తన శరీరం నుంచి తరిమి కొట్టాలని స్ట్రాంగ్‌గా డిసైడ్‌ అయ్యింది. 

జస్ట్‌ 60 రోజుల్లో మాయం...
క్రహశిక్షణాయుతమైన జీవనశైలి మార్పులతో కేవలం రెండు నెలల్లోనే తన రక్తంలో చక్కెరస్థాయిలను నార్మల్‌కి తీసుకొచ్చింది. అంతేగాదు పదినెలలు ఎలాంటి మందులు లేకుండా డయాబెటిస్‌ని సమర్థవంతంగా నిర్వహించింది. ప్రస్తుతం అత్యంత తక్కువ మోతాదులో డయాబెటిక్‌ మందులు తీసుకుంటూ..నాన్‌ డయాబెటిక్‌గా ఉన్నారామె.

వర్కింగ్‌ విమెన్స్‌ మేల్కోండి..
ఇద్దరు పిల్లలు తల్లి అయిన ఉషా తన శరీరంతో చక్కటి సంబంధాన్ని ఏర్పరుచుకోకపోవడంతో ఇలాంటి ప్రాణాంతక పరిస్థితిని ఎదుర్కొన్నట్లు పేర్కొంది. తనలా ప్రతి వర్కింగ్‌ ఉమెన్‌ ఆలోచనా తీరు ఉంటుందన్నారు. ఒక ఏడాది క్రితం నాన్న చనిపోవడంతో అమ్మ ఒంటిరితనం పోగొట్టేలా ధైర్యం చెప్పడం. అలాగే పిల్లలు విదేశాల్లో స్థిరపడటంతో ఏర్పడి ఒంటరితనం అనే సిండ్రోమ్‌. దీనికి తోడు తాను పనిచేసే 24*7 మీడియాలో లేట్‌నైట్‌ డిన్నర్‌లు వంటి చెడు ఆహారపు అలవాట్లు తన ఆరోగ్యాన్ని పూర్తిగా ప్రమాదంలోకి నెట్టేసిందని చెప్పుకొచ్చారామె. 

అలాగే మోనోపాజ్‌ దశలోకి వచ్చిన ప్రతి మహిళ సులభంగా అనారోగ్య సమస్యల బారినపడుతుందని గ్రహించకపోవడం వంటి తప్పిదాలే కారణాలని చెప్పుకొచ్చారు ఉషా. వర్కింగ్‌ విమెన్స్‌ ఎవ్వరూ తనలా అంతటి పరిస్థితి తెచ్చుకోవద్దని..ఉద్యోగ కెరీర్‌ తోపాటు ఆరోగ్యం కూడా ముఖ్యమేనని సూచించారామె.

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రేమ ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

(చదవండి: హార్ట్‌ ఫెయిల్యూర్‌ అంటే..? ఈ పరిస్థితి ఎందువల్ల వస్తుందంటే..)

 

Videos

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)