Breaking News

50 వేల ఏళ్ల నాటి పిల్ల మమొత్‌..!

Published on Sat, 03/29/2025 - 12:20

పిల్లలూ... ఇక్కడ మీరు టేబుల్‌ మీద చూస్తున్నది ఏమిటో తెలుసా? ఏనుగు. కాని ఏనుగు కాదు. పూర్వకాలపు ఏనుగు. ఐస్‌ఏజ్‌ కాలం నాటిది. ఇప్పటి ఏనుగులా కాక  ఒంటి నించి రోమాలతో ఉండేది. దానిని ‘మమొత్‌’ అంటారు. 

డైనోసార్లలాగానే ఇది కూడా భారీ ఆకారంతో ఉండేది. దీనికి పెద్ద పెద్ద దంతాలు ఉండేవి. కాని డైనోసార్లలాగానే 4000 ఏళ్ల క్రితం మమొత్‌లు కూడా అంతరించి పోయాయి. దానికి కారణం ఏమిటో అంతుపట్టలేదు కాని ఏదైనా మహమ్మారి కావచ్చని శాస్త్రవేత్తల ఊహ. అయితే వీటి కళేబరాలు రష్యాలోని సైబీరియా మంచు ఎడారిలో దొరుకుతూనే ఉన్నాయి. 

ఇక్కడ మీరు చూస్తున్నది రష్యాలోని ‘ఎకుషియా’ అనే చోట మంచు పొరల కింద దొరికిన పిల్ల మమొత్‌ కళేబరం. ఇది పిల్ల ఏనుగే అయినా దీని బరువు 180 కిలోలు ఉంది. ఇది 50 వేల ఏళ్ల క్రితం నాటిదని శాస్త్రవేత్తలు నిర్థారించారు. ఆ కళేబరానికి ‘నెక్రోప్సీ’ చేస్తున్న ఫొటోలు ఇవి. మనిషి మృతదేహాన్ని కోసి పరీక్ష చేస్తే ‘అటాప్సీ’. జంతువులను కోసి పరీక్ష చేస్తే ‘నెక్రోప్సీ’. ఈ పరీక్షల వల్ల మమొత్‌లకు సంబంధించిన మరిన్ని జీవన రహస్యాలు తెలుస్తాయని శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తుంటారు.  

(చదవండి: 'చిన్నారి జర్నలిస్టు'..! ఏకంగా యుద్ధాన్ని రిపోర్ట్‌ చేస్తూ..)

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)