Breaking News

ఆసియాలోని బెస్ట్‌ రెస్లారెంట్లుగా ఐదు భారత రెస్టారెంట్లు!

Published on Wed, 03/13/2024 - 18:45

యూకే ఆధారిత విలియం రీడ్‌ బిజనెస్‌ మీడియా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 50 బెస్ట్‌ రెస్టారెంట్ల జాబితాను విడుదల చేయనుంది. అందుకోసం మిడిల్‌ ఈస్ట్‌ నార్త్‌ ఆఫ్రికాకు సంబంధించి సుమారు 50 బెస్ట్‌ రెస్టారెంట్ల ఎంట్రీలను ఆహ్వానించింది. వాటిలో 51 నుంచి 100 ర్యాంకుల వరకు ఆసియాకి సంబంధించిన వివిధ రెస్టారెంట్లే ఉన్నాయి. ఇక ఈ ప్రతిష్టాత్మక జాబితాలో ఐదు భారతీయ సంస్థలు ఉండటం విశేషం.

ఈ ఏడాదికి సంబంధించిన ఆసియా టాప్‌ 50 బెస్ట్‌ రెస్టారెంట్ల జాబితాను ఈ నెలాఖరులోగా వెల్లడించనుంది. ఈ జాబితా ఎంట్రీల్లో 51-100 ర్యాంకుల్లో మూడు ముంబై రెస్లారెంట్లు, డిల్లీకి సంబంధించిన రెండు రెస్టారెంట్లు చోటు దక్కించుకున్నాయి. ముంబైలోని అమెరికాలనో(61), ది బాంబే క్యాంటీన్‌(70), ఎకా(98), ఇక ఢిల్లీకి సంబంధించి గురుగ్రామ్‌లో కొమెరిన్‌(79), న్యూఢిల్లీలోని దమ్‌ పుఖ్త్‌ (87)వ ‍స్థానంలో ఉన్నాయి. ఈ జాబితా ఎంట్రీలో దేశం వెలుపల ఉన్న రెస్టారెంట్లు, బ్యాంకాక్‌కి సంబంధించిన ఇతర రెస్టారెంట్లు తర్వాత స్థానంలో ఉన్నాయి.

దీనికి భారతీయ చెఫ్‌ గరిమా అరోరా నాయకత్వం వహిస్తున్నారు. ఇక ఈ ఆసియా బెస్ట్‌ రెస్టారెంట్‌ ఎంట్రీల జాబితాలో టోక్యో, సింగపూర్‌ అగ్రస్థానంలో ఉన్నాయి. ఇక 51 నుంచి 100 ర్యాంకుల జాబితాలో మాత్రం ఆసియాలోని 16 నగరాలకి సంబంధించిన ఇతర రెస్టారెంట్లు ఉన్నాయి. ఈ ఆసియా బెస్ట్‌ రెస్టారెంట్ల 2024 జాబితాన మార్చి 26, 2024న దక్షిణ కొరియాలోని సియోల్‌లో జరిగే అవార్డుల కార్యక్రమంలో వెల్లడించనున్నారు. ఈ బెస్ట్‌ రెస్టారెంట్ల ఎంట్రీల జాబితాకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవ్వుతోంది. కాగా, గతేడాదిలో ఈ బెస్ట్‌ రెస్టారెంట్‌ జాబితాలో అమెరికానో 66వ స్థానాన్ని, ఎకా 93వ స్థానాన్ని దక్కించుకుంది. 

(చదవండి: బెస్ట్‌ శాండ్‌విచ్‌గా ఈ భారతీయ స్ట్రీట్‌ ఫుడ్‌కి చోటు! ఎన్నో ర్యాంకులో నిలిచిందంటే..)
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)