Breaking News

41 కాదు 24 ఏళ్లే : వయసు తగ్గించుకున్న లండన్‌​ డాక్టర్‌ సీక్రెట్‌ ఇదే!

Published on Fri, 06/13/2025 - 12:20

ఆధునిక కాలంలో బరువును తగ్గించుకోవడం కాదు.. వయసును తగ్గించుకోవడం ట్రెండ్‌గా మారింది. ఈ విషయంలో  లండన్‌కు చెందిన 41 ఏళ్ల వైద్యుడు వార్తల్లో నిలుస్తున్నాడు. తన అసలు వయసుతో తెలిస్తే జీవసంబంధమైన వయస్సు 24 సంవత్సరాలు అని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ డాక్టర్‌ స్టోరీ నెట్టింట సందడిగా మారింది. పదండి మరి ఆ వివరాలుతెలుసుకుందాం.

మిలియనీర్‌ టెక్‌ వ్యవస్థాపకుడు బ్రయాన్‌ జాన్సన్‌, ప్రాజెక్ట్‌ బ్లూప్రింట్‌ పేరుతో కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి తన వయసును తగ్గించుకోవడంలో విజయవంతమయ్యాడు. తాజాగా లండన్‌కు చెందిన Hum2n longevity  క్లినిక్ వ్యవస్థాపకుడు 41 ఏళ్ల డాక్టర్ ఎనాయత్ తన క్రోనోలాజికల్ ఏజ్ కంటే బయో ఏజ్ 24 సంవత్సరాలని ప్రకటించుకున్నాడు. 18 నెలల క్రితం తీసుకున్న పరీక్షల ఆధారంగా తన వయస్సు  17 సంవత్సరాలు తగ్గిందని తెలిపాడు. 

ఇందుకోసం డాక్టర్ ఎనాయత్ ఏడేళ్లుగా ఔరా రింగ్, హూప్ స్ట్రాప్ వంటి  పరికరాల ద్వారా క్రమం తప్పకుండా రక్తం, మూత్రం, మైక్రోబయోమ్ పరీక్షలతో పాటు తన ఆరోగ్యాన్ని నిత్యం పరిశీలించుకున్నాడు. ఫలితాల ఆధారంగా అతను సప్లిమెంట్లతో సహా ఆయుష్సును పెంచే  జీవన శైలిని పాటించాడు. ప్రధాంగా బీకాంప్లెక్స్, ఫోలేట్, మెగ్నీషియం, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాల వంటి సప్లిమెంట్లు తన బయో ఏజ్‌ను తగ్గించాయని  చెప్పడం గమనార్హం. "ఈ సప్లిమెంట్‌లు నా జీవసంబంధమైన వయస్సు  వెనక్కి మళ్లడానికి మద్దతు ఇచ్చాయని బిజినెస్ ఇన్‌సైడర్‌తో అన్నారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం..

విటమిన్ బి కాంప్లెక్స్
మిథైలేషన్ జన్యు లోపం కారణంగా హోమోసిస్టీన్ స్థాయిలు పెరగడం వల్ల రక్తం గడ్డకట్టడం, గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని తెలిపారు. ఇవి  ఈ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. సాధారణంగా, డైటీషియన్లు ఆహారం ద్వారా పోషకాలను పొందాలని, కొన్ని పోషకమైన ఆహారాలు లోపం లేదా తీసుకోలేక పోవడం వంటి సందర్భాలలో అవసరమైనప్పుడు మాత్రమే వాటిని తీసుకోవాలని సిఫార్సు చేస్తారు. చేపలు, పౌల్ట్రీ, చిక్కుళ్ళు ,ఆకుకూరలు వంటి బి విటమిన్లు అధికంగా ఉన్న ఆహారాలు హోమోసిస్టీన్ స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడతాయి.అయితే బీవిటమిన్లు మెరుగైన మానసిక స్థితి, చిత్తవైకల్య నివారణకు అనుసంధానించబడి ఉండవచ్చు, కానీ ఈ ఫలితాలను నిర్ధారించడానికి మరిన్ని అధ్యయనాలు అవసరంఅంటున్నారు నిపుణులు.

"మిథైలేషన్-సంబంధిత జన్యు లోపం లేకుండా కూడా, ముఖ్యంగా అధిక ఒత్తిడి, పేలవమైన నిద్ర లేదా ఇంటెన్సివ్ శిక్షణ కాలంలో మిథైలేటెడ్ బి కాంప్లెక్స్ తీసుకోవడాన్ని నేను ఇప్పటికీ పరిశీలిస్తాను, ఎందుకంటే ఇవి బి విటమిన్ల డిమాండ్‌ను పెంచుతాయి" అని డాక్టర్ ఎనాయత్ అన్నారు.

మెగ్నీషియం
డాక్టర్ ఎనాయత్ ఆహారం తీసుకోవడం ద్వారా సహజంగా తక్కువ మెగ్నీషియం స్థాయిలు ఉన్నందున మెగ్నీషియం బిస్గ్లైసినేట్ తీసుకుంటాడు. మెరుగైన శోషణ కోసం, దాని స్థాయిలను పెంచడానికి సహాయ పడేలా దీన్ని ఎంపిక చేసుకున్నాడు. ముఖ్యంగా ఎముకల ఆరోగ్యం, రక్తంలో చక్కెర నియంత్రణ, కండరాల పనితీరుకు మెగ్నీషియం చాలా అవసరం. చిక్కుళ్ళు, ఆకుకూరల్లో ఇది లభిస్తుంది.

మెగ్నీషియం తీసుకోవడం కండరాల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుందని, నిద్రను మెరుగు పరుస్తుందని, తద్వారా తాను చాలా సులభంగా నిద్రపోతానని డాక్టర్ ఎకాయత్ చెప్పారు.

ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు 

డాక్టర్ ఎనాయత్  ప్రతిరోజూ ఒమేగా-3 సప్లిమెంట్ తీసుకుంటాడు. చేపలు, వాల్‌నట్‌లు, చియా విత్తనాలలో లభించే ఒమేగా-3లు గుండె ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి. వాపును, రక్తపోటును తగ్గిస్తాయి. కొవ్వు చేపలను వారానికొకసారి తినడం హృదయ సంబంధ వ్యాధుల నుండి రక్షించడానికి నిరూపించబడినప్పటికీ, సప్లిమెంట్ రూపం  ప్రయోజనాలు అంత స్పష్టంగా లేవు. అయితే, కొన్ని పరిశోధనలు ఒమేగా-3 సప్లిమెంట్లు యాంటీ-ఏజింగ్ ప్రభావాలను కలిగి ఉండవచ్చని సూచిస్తున్నాయి. ఇటీవలి అధ్యయనంలో ఒమేగా-3లు రోజూ తీసుకున్న పాల్గొనేవారు తక్కువ జీవసంబంధమైన వయస్సు తగ్గినట్టు గుర్తించారు. 

నోట్‌: ఆరోగ్యకరమైన జీవనశైలి  అంటే పోషకమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, తగినంత నిద్ర, ఒత్తిడి నిర్వహణ బయోలాజికల్ ఏజ్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. కానీ ఇలాంటి ప్రయోగాలు చేసేటపుడు నిపుణుల పర్యవేక్షణచాలా అవసరం  అని గుర్తించాలి.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి