Breaking News

గడ్డకట్టిన మంచుపై పరుగు పందెం..! సత్తాచాటిన భాగ్యనగరవాసులు

Published on Tue, 05/06/2025 - 12:00

ఆత్మవిశ్వాసం ఉండాలే గానీ అసాధ్యం అంటూ ఏదీ ఉండదు? అరుదైన సాహసాలు చేయాలనే తపన ఉండాలే గానీ..అద్భుతాలు సృష్టించవచ్చు.. ఘనమైన ప్రతిభను పొందవచ్చు.. అంటున్నారు హైదరాబాద్‌ నగరానికి చెందిన అడ్వెంచర్‌ టూరిస్టులు. నగరంలో సాహసికులు పెరుగుతున్న కొద్దీ వైవిధ్య భరిత సాహసాలు కూడా వెలుగు చూస్తున్నాయి. ఇదే క్రమంలో నగరానికి చెందిన నలుగురు భిన్న రంగాలకు చెందిన ఔత్సాహికులు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పర్వతంగా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ గుర్తించిన పాంగోంగ్‌ ఫ్రోజెన్‌ లేక్‌లో హాఫ్‌ మారథాన్‌లో పాల్గొని హైదరాబాద్‌ నగరం నుంచి ఆ ఘనతను దక్కించుకున్నారు. 

లద్దాఖ్, ఫిబ్రవరి 24–25, 2025: ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో జరిగే మంచు సరస్సు మారథాన్‌గా ప్రసిద్ధి పొందిన పాంగోంగ్‌ ఫ్రోజెన్‌ సరస్సు మారథాన్‌ ఈ ఏడాది కూడా లద్దాఖ్‌లో ఘనంగా జరిగింది. ఇది కేవలం రన్నింగ్‌ ఈవెంట్‌ మాత్రమే కాకుండా, హిమాలయాల్లో వేగంగా కరుగుతున్న హిమనీనదాలపై మరియు వాతావరణ మార్పుల ప్రభావంపై చైతన్యాన్ని పెంచే ప్రయత్నం కూడా. 

రన్‌ విశేషాలివీ.. 
హిమాలయాల్లో కరుగుతున్న హిమనీనదాలు, తగ్గుతున్న మంచు సరస్సుల వల్ల భవిష్యత్తు మార్పులపై అవగాహన కల్పించటం కోసం లద్దాఖ్‌లోని పాంగోంగ్‌ సరస్సులో 4,273 మీటర్ల ఎత్తులో 2023లో మొదటిసారి ఈవెంట్‌ నిర్వహిస్తున్నారు. ఈ మారథాన్, గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులో ‘అత్యంత ఎత్తులో జరిగే మంచు సరస్సు మారథాన్‌’గా గుర్తింపు పొందింది. 

తాజా రన్‌లో అమెరికా, నేపాల్, కొరియా, ఆ్రస్టేలియా, భారత్‌కు చెందిన అంతర్జాతీయ రన్నర్లు పాల్గొన్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఇలాంటి ఈవెంట్లు జరగకపోవచ్చని హెచ్చరిస్తూ, పర్యావరణాన్ని కాపాడాల్సిన అవసరాన్ని చాటుతూ నిర్వహించే ఈ మారథాన్‌ను ‘ది లాస్ట్‌ రన్‌’ అని కూడా పిలుస్తారు. 

నగరానికి చెందిన ప్రవీణ్‌ గోయెల్, నవీన్‌ సింకా, బిక్కినా వెంకట రాజేష్‌ రతన్‌ నలుగురూ వేర్వేరు రంగాలకు చెందిన వారు. అయితే వీరంతా.. సమవయస్కులు కూడా కాదు. అయితేనేం.. అభిరుచి వారిని కలిపింది. ఆత్మవిశ్వాసం వారిని విజయ శిఖరాన నిలిపింది. ‘ఇంట్లో వాళ్లు వద్దనే చెప్పారు. కానీ.. అప్పటికే సైక్లింగ్, రన్నింగ్‌ వంటివి అలవాటయ్యాయి. అందుకే దీన్ని ప్రయత్నించడం భయం అనిపించలేదు’ అని చెప్పారు వ్యాపారి ప్రవీణ్‌గోయెల్‌. 

‘16 డిగ్రీల చలిని పట్టించుకోకుండా కదులుతూ ఉండటానికి చేసిన మానసిక ప్రయత్నం..ఫలించింది. భయాన్ని అధిగమించడానికి సహాయపడింది’ అని భారత నావికాదళంలో అధికారిగా పనిచేసే రతన్‌ (29) చెప్పారు.  ‘గత 15 సంవత్సరాలుగా మారథాన్‌ రన్నర్, బ్యాడ్మింటన్‌ ఆటగాడిగా అనుభవం ఉంది. అయినప్పటికీ ఇది పూర్తిగా ప్రత్యేకం అంటున్నారు ఐటీ నిపుణులు నవీన్‌ సింకా (45). పరుగులో మా ముఖాలు మొద్దుబారిపోయాయి. మా దగ్గర ఉన్న నీరు కూడా పరుగు మధ్యలో గడ్డకట్టుకుపోయింది’ అంటూ గుర్తు చేసుకున్నారు. 

‘గ్లోబల్‌ వార్నింగ్‌ కారణంగా, పాంగోంగ్‌ త్వరలో గడ్డకట్టడం ఆగిపోవచ్చు’ అని మరో ఐటీ ప్రొఫెషనల్‌ (50) రాజేష్‌ చెప్పారు. ‘తనకు ఇది వ్యక్తిగత రికార్డ్‌ కన్నా ఎక్కువ అని, ఈ రన్‌లో ఇమిడి ఉన్న సందేశమే తనకు ముఖ్యమని అంటున్నారాయన. లాస్ట్‌ రన్‌ పేరు ఆకర్షణీయంగా అనిపించవచ్చు కానీ.. దాని వెనుక అంతరార్థం మాత్రం ఆందోళనకరం’ అని చెప్పారు.

విభిన్న నేపథ్యాల నుంచి..
నావికాదళ అధికారి, కార్పొరేట్‌ వ్యవస్థాపకుడు, సాఫ్ట్‌వేర్‌ నిపుణుడు, ఐటీ మారథానర్‌ – వంటి విభిన్న నేపథ్యాలున్నప్పటికీ, ఈ నలుగురూ అవరోధాలను అధిగమించి అనూహ్యమైన రికార్డు సాధించారు. నగరానికి తిరిగి వచ్చిన వారి ప్రయాణం కొత్త లక్ష్యాల దిశగా సాగనుంది. 

ఐరన్‌ మ్యాన్‌ గోవా అనే ఈవెంట్‌పై రతన్‌ తన దృష్టి పెట్టారు. కిలిమంజారోను అధిరోహించాలని నవీన్‌ యోచిస్తుంటే, రాజేష్‌ 6000+ మీటర్ల హిమాలయ శిఖరంపై సూపర్‌ రాండన్నూర్‌ సైక్లింగ్‌ హోదాను గురిపెట్టారు. పాంగోంగ్‌ నుంచి కొత్తగా ప్రేరణ పొందిన ప్రవీణ్‌ మరిన్ని సాహసాలను అన్వేషిస్తున్నారు.

(చదవండి: 16 ఏళ్లకే బ్రెస్ట్‌ కేన్సర్‌ సర్జరీ..! జస్ట్‌ 15 రోజుల్లేనే మిస్‌ వరల్డ్‌ వేదికకు..)

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)