Breaking News

కోడింగ్ టు ప్రిస్క్రిప్షన్: సత్తా చాటిన ‘ఆకృతి @ 32’

Published on Mon, 06/22/2026 - 10:34

కలలు కనడానికి వయసుతో నిమిత్తం లేదని, సంకల్పం బలంగా ఉంటే ఎంతటి కఠినమైన లక్ష్యాన్నైనా సాధించవచ్చని నిరూపించారు ముంబైకి ఆకృతి గోయల్. ఇంజనీరింగ్ పూర్తి చేసి, మంచి జీతంతో ఉద్యోగం చేస్తున్నప్పటికీ.. డాక్టర్ కావాలనే చిన్నప్పటి కల ఆమెను నిద్రపోనివ్వలేదు. 32 ఏళ్ల వయసులో ఇంకా పెళ్లి కాలేదనే  హేళనలను, ‘ఈ వయసులో ‘నీట్‌’ రాస్తారా?’ అనే మాటలను లెక్కచేయకుండా, కేవలం 10 నెలల కఠోర ప్రిపరేషన్‌తో నీట్ (NEET UG) పరీక్షను  క్రాక్‌ చేసి సరికొత్త రికార్డు సృష్టించారు ఆకృతి గోయల్.

బిట్స్ పిలానీ నుండి ఎంబీబీఎస్‌ వైపు అడుగులు
ఆకృతికి చిన్నతనం నుంచే మెడిసిన్ వైపు మక్కువ ఉన్నప్పటికీ, కొన్ని పరిస్థితుల వల్ల ఇంజనీరింగ్ దిశగా వెళ్లాల్సి వచ్చింది. ఆమె ప్రతిష్టాత్మక ‘బిట్స్‌ పిలానీ’లో ఎంఎస్సీ ఎకనామిక్స్, బిటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్స్‌లో డ్యూయల్ డిగ్రీ పూర్తి చేశారు. చదువు తర్వాత క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లకు వెళ్లకుండా, స్వయంగా ఇంటర్వ్యూల ద్వారా స్టార్టప్‌లలో ఉద్యోగాలు సంపాదించారు. ఆ తర్వాత ‘హీలోఫీ’ అనే స్టార్టప్‌లో లీడర్‌షిప్ పాత్రను పోషిస్తూ, నేరుగా సీఈఓతో కలిసి మిలియన్ డాలర్ల ప్రాజెక్టులను విజయవంతంగా హ్యాండిల్ చేశారు.

ఉద్యోగానికి గుడ్ బై.. సమాజం నుండి అవహేళనలు
వరుసగా లేట్ నైట్ షిఫ్టులు, విపరీతమైన పని ఒత్తిడి కారణంగా 2020 జనవరిలో ఆకృతి అనారోగ్యానికి గురయ్యారు. ఆ తర్వాత కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో ఆమె తన ఉద్యోగాన్ని వదిలేసి, మళ్లీ డాక్టర్ కావాలనే తన చిన్ననాటి కల వైపు అడుగులు వేశారు. అయితే, 30 ఏళ్లు దాటిన ఆకృతి ఉద్యోగం వదిలేసి పరీక్షలకు సిద్ధమవడాన్ని చుట్టుపక్కల వారు తప్పుపట్టారు. ‘ఈ వయసులో పెళ్లి చేసుకోకుండా నీట్ ప్రిపరేషన్ ఏంటి?’ అంటూ ఎగతాళి చేశారు. కానీ ఆ విమర్శలనే ఆమె తన విజయానికి ఇంధనంగా మార్చుకున్నారు.

10 నెలల కఠోర దీక్ష.. 676 మార్కులతో..
దాదాపు 10 ఏళ్ల తర్వాత మళ్లీ పుస్తకాలు పట్టడం ఆకృతికి అంత సులువు కాలేదు. తొలుత ఆన్‌లైన్‌లో ఉచిత బయాలజీ క్లాసులు వింటూ, రోజుకు 10 గంటల చొప్పున చదవడం ప్రారంభించారు. కేవలం 10 నెలల ప్రిపరేషన్ కాలంలో ఆమె 100 కి పైగా మాక్ టెస్టులు రాశారు. 2021లో నీట్ ఫలితాలు విడుదలైనప్పుడు, ఆమె 676 స్కోరుతో, ఆల్ ఇండియా లెవెల్లో 1,118వ ర్యాంకు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం ఆమె హిందూ రావు మెడికల్ కాలేజీ(ఢిల్లీ)లో ఎంబీబీఎస్ చదువుతూ, సరికొత్త జీవితాన్ని ప్రారంభించారు.

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)