Breaking News

ముప్పైలో హృదయం పదిలంగా ఉండాలంటే..!

Published on Fri, 09/27/2024 - 13:48

గుండె జబ్బులు ఒకప్పుడూ వృద్దులలోనే కనిపించేవి. కానీ ప్రస్తుత జీవన విధానంలో జస్ట్‌ 30 ఏళ్లు కూడా నిండని యువకులే గుండె జబ్బుల బారిన పడి చనిపోతున్నారు. సెలబ్రిటీల దగ్గర నుంచి ప్రముఖులు వరకు చాలా మంది చిన్న ఏజ్‌లోనే గుండె సమస్యలతో చనిపోయిన సంఘటనలను చూశాం. అలాగే కొందరూ ఫిట్‌నెస్‌ పేరుతో గుండె అలిసిపోయేలా వర్కౌట్‌లు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఉదంతాలు కూడా చూశాం. అందుకే నిపుణులు సింపుల్‌ ట్రిక్‌తో ముప్పై నుంచే హృదయ ఆరోగ్యం కోసం జాగ్రత్త పడమని చెబుతున్నారు. ఏంటంటే అది..!.

నిజానికి 30వ దశకం జీవితం వేగంగా సాగిపోతున్నట్లు ఉంటుంది. కెరీర్‌ లక్ష్యాలు, వ్యక్తిగత ఆశయాలతో బిజీగా ఉంటారు. అందువల్ల సమయమే తెలియదు. ఈ సమయంలో వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ కూడా ఉండదు. యంగ్‌గా ఉన్నాం మనకేంటి అనే భావనతో ఉంటారు. అదేతప్పని అంటున్నారు. ఈ సమయమే దీర్థకాలిక జబ్బుల బారిన పడేందుకు కీలకమైనదని చెబుతున్నారు. ఇప్పుడే గనుక ఆరోగ్యంపై శ్రద్ధపెడితే 60లో కూడా చలాకీగా తిరగగలుగుతారని చెబుతున్నారు. అందుకోసం పెద్ద పెద్ద వ్యాయామాలు చేయాల్సిన అవసరం లేదు జస్ట్‌ 30 మెట్లు ఎక్కండి అని అంటున్నారు.  

30 మెట్లు..
స్థిరంగా ఒకచోట కంప్యూటర్‌ ముందు కూర్చొని పనిచేసేవాళ్లకు ఇది మంచిది. జంక్‌ఫుడ్‌కి అలవాటు పడ్డవాళ్లకి కూడా ఇది బెస్ట్‌ వ్యాయామం అని చెబుతున్నారు నిపుణులు. ఇందుకోసం ఎలివేటర్‌ ఉపయోగించకుండా ఉంటే చాలు ప్రత్యేకించి మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదని అన్నారు. రోజువారీ పనుల్లో, కార్యాలయాల్లో మెట్లు ఎక్కండి చాలు గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారు. 

ప్రయోజనాలు..

  • మెట్లు ఎక్కడం వల్ల శరీరం అంతటా రక్త ప్రసరణ అయ్యి ఆక్సిజన్‌ ప్రవాహాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. గుండె పంపింగ్‌ను వేగవంతం చేస్తుంది. 

  • కేలరీలు బర్న్‌ అవ్వడంలో చక్కగా ఉపయోగపడుతుంది. ఆరోగ్యకరమైన బరువు నిర్వహించేందుకు మంచి వర్కౌట్‌

  • చెడు కొలస్ట్రాల్‌ని తగ్గిస్తుంది, ధమనుల్లో ఫలకం ఏర్పడటానికి బాధ్యత వహిస్తుంది

  • శారీరక శ్రమ రక్తపోటుని తగ్గిస్తుంది. ధమనులపై ఒత్తిడిని తగ్గిస్తుంది. గుండెపోటుకి ప్రధాన కారణమైన రక్తపోటుని నివారించడంలో సహాయపడుతుంది. 

  • దీంతోపాటు గుండె ఆర్యోగ్యానికి సంబంధించిన మరిన్ని వర్కౌట్‌లు చేయడం కూడా మంచిది. అయితే ఇది కేవలం గుండె ఆరోగ్యానికి సరైన ప్రారంభం అని అన్నారు నిపుణులు. 

  • అలాగే హార్ట్‌కి సంబంధించి.. కీలకమైన రక్తపోటు, కొలస్ట్రాల్‌ స్థాయిలు, రక్తంలో చక్కెర వంటివి ఎప్పకప్పుడు చెకప్‌ చేయించుకోవాలని చెబుతున్నారు. 

వీటి తోపాటు..

  • డైట్‌లో తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులను తీసుకోండి.

  • ఒత్తిడి స్థాయిలను తగ్గించడానికి యోగా, ధ్యానం లేదా లోతైన శ్వాస వంటి మైండ్‌ఫుల్‌నెస్ పద్ధతులను ప్రాక్టీస్ చేయండి 

  • ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండండి. 

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత నిపుణులు, వైద్యుల సలహాలు సూచనల మేరకు అనుసరించడం మంచిది. 
 

#

Tags : 1

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)