Breaking News

2024 ప్యారిస్ ఒలింపిక్స్: స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నీతా అంబానీ

Published on Wed, 07/24/2024 - 15:31

రిలయన్స్‌ ఫౌండేషన్‌, నీతా ముఖేష్‌ అంబానీ కల్చరల్‌ సెంటర్‌,  ఛైర్మన్‌ నీతా అంబానీ 2024 పారిస్ ఒలింపిక్స్ ఈవెంట్‌లో  ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పారిస్‌లో జరుగుతున్న 142వ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సెషన్‌కు నీతా అంబానీ హాజరయ్యారు.  ఈ సందర్బంగా  ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ నుంచి ఘనస్వాగతం లభించింది. ముఖ్యంగా నీతా అంబానీ సాదరంగా ఆహ్వానించిన మాక్రాన్‌ ఆమె చేతిని ముద్దు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట సందడి చేస్తోంది. అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్ కూడా నీతాకు  శుభాకాంక్షలు తెలిపారు.

ఫ్రాన్స్ రాజధాని నగరంలో జరిగిన లూయిస్ విట్టన్ ఫౌండేషన్‌లో జరిగిన 142వ ఐఓసీ షన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నీతా అంబానీ ఎంబ్రాయిడరీతో  తీర్చిదిద్దిన  ఎరుపు రంగు సూట్‌ను ధరించారు.  గోల్డెన్ థ్రెడ్‌వర్క్‌ డ్రెస్‌లో చాలా నిరాడంబరమైన ఆభరణాలతో  నీతా  అందంగా, హుందాగా కనిపించారు..

కాగా 2024 ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు శుక్రవారం, జూలై 26న జరగనున్నాయి. అధికారిక ప్రారంభోత్సవానికి ముందు జూలై 24న  కొన్ని క్రీడలు ప్రారంభమవుతాయి.  ఈ ఏడాది ఒలింపిక్స్‌లో 206 దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న  10,500 మంది అథ్లెట్లు పోటీ పడనున్నారు. పారిస్ ఒలింపిక్స్ 2024 ఆగస్టు 11న ముగుస్తుంది. రిలయన్స్‌ అధినేత ముఖేష్ అంబానీ  భార్య, నీతా అంబానీ వ్యాపారవేత్తగా, పరోపకారిగా  చాలా పాపులర్‌. ఇటీవల తన చిన్నకుమారుడు అనంత్‌ అంబానీ గ్రాండ్‌ వెడ్డింగ్‌ వేడుకలను విజయవంతంగా నిర్వహించారు.  
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)