Breaking News

1500 గంటలు, వేలాది క్రిస‍్టల్స్‌, కాన్స్‌ క్వీన్‌ ఐశ్వర్య లుక్‌ స్పెషాల్టీ!

Published on Sat, 05/23/2026 - 11:11

కాన్స్‌ క్వీన్‌, మాజీ మిస్ వరల్డ్, బాలీవుడ్ దివా ఐశ్వర్యా రాయ్ బచ్చన్ మరోసారి ఫ్రెంచ్ రివేరా రెడ్ కార్పెట్‌పై తన అద్భుతమైన లుక్‌తో అందరినీ మంత్రముగ్ధులను చేశారు.  ప్రతిష్టాత్మక 79వ  గ్లోబల్ ఫిల్మ్ ఫెస్టివల్ చివరి దశలో ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్య లుక్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. అభిమానుల ఆశలను ఐష్‌  ఏమాత్రం వమ్ము చేయలేదు. లారియల్ (L'Oreal) బ్రాండ్ అంబాసిడర్‌గా హాజరైన ఆమె, ప్రముఖ డిజైనర్ అమిత్ అగర్వాల్ రూపొందించిన కస్టమ్ స్కల్ప్చరల్ గౌన్‌లో  మెరిసి అందర్నీ మెస్మరైజ్‌ చేశారు.

డిజైనర్ అమిత్ అగర్వాల్ ఐశ్వర్య కోసం ప్రత్యేకంగా రూపొందించిన  అబిస్-బ్లూ గౌన్‌ హాట్‌ టాపిక్‌గా నిలిచింది. ఈ అబిస్-బ్లూ (Abyss-Blue) గౌను "లుమినారా" (Luminara) కేవలం ఒక గౌను మాత్రమే కాదు. అందాల ఐశ్వర్యం చుట్టూ ఒక కాంతి వలయం (Energy field) ఉన్నట్లుగా కనిపించేలా డిజైన్ చేయడం దీని స్పెషల్‌.

 

అంతరిక్షంలో కాంతి ప్రయాణించే అనంతమైన తీరును ప్రతిబింబించేలా  రెడ్ కార్పెట్ పై ఉన్న కాంతికి, కెమెరా ఫ్లాష్ లైట్‌కి గౌన్ లోపల ఏదో లిక్విడ్ (ద్రవం) కదులుతున్నట్లుగా ఒక విజువల్ మ్యాజిక్ కనిపిస్తుంది. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ కేన్స్ వేదికపై అందరినీ మంత్రముగ్ధులను చేసింది. ఈ అద్భుతమైన శాఫైర్-బ్లూ గౌన్‌కు మ్యాచ్ అయ్యేలా ఐశ్వర్యారాయ్ మెడలో డైమండ్-శాఫైర్ కాలర్ నెక్లెస్‌ ధరించారు. సిల్కీ ఓపెన్ హెయిర్ స్టైల్, సింపుల్ మేకప్‌తో ఆమె రెడ్ కార్పెట్‌పై  ఒక దేవకన్యలా మెరిసిపోయారు. దీన్ని రూపొందించేందుకు 1500 (62  రోజుల 12 గంటలు) గంటలు పట్టిందట.

1500 గంటల కష్టం
ఈ గౌను తయారీ వెనుక అమిత్ అగర్వాల్‌కి చెందిన సిగ్నేచర్ 'క్రిస్టల్ వీన్' ఎంబ్రాయిడరీ టెక్నిక్ ఉంది. దీనికోసం కళాకారులు ఏకంగా 1500 గంటలకు పైగా శ్రమించి, వేలాది క్రిస్టల్స్ చేత్తో అమర్చడం విశేషం. ఇంకా ఐశ్వర్య భుజాల భాగంలో వింగ్స్ (రెక్కలు) తరహాలో డిజైన్ చేసిన నిర్మాణం ఈ గౌనుకు ఒక ప్రత్యేకమైన, ఫ్యూచరిస్టిక్ (భవిష్యత్ కాలపు) లుక్‌ను తీసుకొచ్చింది. మొదటి లుక్‌తోనే ఇంతలా అదరగొట్టిన 'కాన్స్ క్వీన్', ముగింపు వేడుకలో (Closing Ceremony) ఎలాంటి దుస్తుల్లో కనిపిస్తారోనని ఫ్యాన్స్ ఇప్పుడు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ ఐకానిక్ లుక్ వెనుక డిజైనర్ అమిత్ అగర్వాల్‌తో పాటు ప్రముఖ సెలబ్రిటీ స్టైలిస్ట్ మోహిత్ రాయ్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి.ఫ్యాషన్ ఇన్నోవేషన్‌ను సమపాళ్లలో మిక్స్ చేస్తూ  ఈ లుక్‌ను ప్లాన్ చేశారంటూ అభినందిస్తున్నారు.

 

రెండో లుక్‌
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026లో తన రెండోలుక్‌లో తనదైన ఫ్యాషన్‌ స్టైల్‌న చాటుకున్నారు. ఈసారి, ఈ నటి లేత గులాబీ రంగు దుస్తులతో రొమాన్స్ , పురాతన గ్లామర్‌ను ప్రదర్శిస్తూ, ఈ ఉత్సవానికి  మరింత గ్లామర్‌ జోడించారు. 

వర్ధమాన మహిళా చిత్రనిర్మాతలను గౌరవించడానికి లోరియల్ పారిస్ నిర్వహించే వార్షిక కార్యక్రమం 'లైట్స్ ఆన్ ఉమెన్స్ వర్త్'కు ఐశ్వర్య హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు కుమార్తె ఆరాధ్య బచ్చన్ కూడా పాల్గొన్నారు. ఆమె రూబీ-ఎరుపు రంగు గౌను, దానికి సరిపోయే కేప్‌తో చాలా అందంగా కనిపించారు.

Videos

నా ఇల్లే ముట్టడిస్తారా.. దమ్మున్నోళ్లు రెండిరా..?! భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్

నాదే బాధ్యత.! సలార్ 2పై క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ నీల్

బిగ్ రిలీఫ్.. ముగిసిన ఇరాన్ - అమెరికా యుద్ధం?

3 నెలల్లోనే రూ. 5.6 లక్షల కోట్ల లాభం..

బాబు మాటలు.. APలో అగ్గి రాజేస్తున్న మనువాద రాజకీయం

తాటి చెట్టులా పెరిగావ్.. బుర్ర లేదు.. మీ అన్న చావు వెనుక ఉన్నది నువ్వేనా?!

నోటికాడి కూడు లాక్కున్నావ్.. దీనికి అనుభవిస్తావ్..

సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్.. పంజాబ్ ప్లే ఆఫ్స్ ఆశలన్నీ ముంబై పైనే

స్టార్ట్.. కెమెరా.. యాక్షన్.. హల్ చల్ చేసిన నాగ బాబు

బుమ్రాకు రామ్ చరణ్ క్షమాపణలు

Photos

+5

యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

విజయవాడలో గాలివాన బీభత్సం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : అందమా.. అందుమా.. (ఫొటోలు)

+5

మృణాల్‌ని ఇంత అందంగా చూసుండరేమో! (ఫొటోలు)

+5

'పాటశాల' ఈవెంట్‌లో మంచు మనోజ్ ఫ్యామిలీ సందడి (ఫొటోలు)

+5

తమిళ స్టార్ హీరోలతో మహేశ్ క్రికెట్ ఆడితే? (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 24-31)

+5

'మ్యాడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌' షో విజేతలుగా వాసంతి- కల్యాణ్‌ (ఫోటోలు)

+5

కరుప్పు సక్సెస్‌: కేక్‌ కట్‌ చేసిన త్రిష (ఫోటోలు)

+5

చీరలో చందమామలా సమీరా(ఫోటోలు)