Breaking News

150 ఏళ్ల నాటి నిధి, వాటాలకోసం జగడం..చివరికి..?

Published on Fri, 03/08/2024 - 12:55

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలోని ఒక గ్రామంలో ఇల్లు నిర్మిస్తున్న కూలీలకు  ఊహించని  పరిణామం ఎదురైంది.  150 ఏళ్ల నాటి బ్రిటిష్ కాలం నాటి నిధి  వారి కంటపడింది   ఇంటి నిర్మాణం కోసం (మంగళవారం మార్చి 5న)  గుంతలు తవ్వుతున్న కూలీలకు బ్రిటీష్ కాలం నాటి వెండి నాణేలు  లభ్యమైనాయి. దీంతో ఈ వార్త ఆ నోటా ఈ నోటా ఊరంతా పాకి వివాదానికి దారి తీసింది. 

సంజయ్ పాల్ అనే వ్యక్తి ఇల్లు కట్టుకోవడానికి కూలీలను పెట్టుకున్నాడు. ఈ క్రమంగా అక్కడ తవ్వుతుండగా ఇద్దరు కార్మికుల వెండి నాణేలు లభించాయి. ఈ సంగతి సంజయ్ పాల్ పొరుగువారికి తెలియడంతో వివాదం రేగింది.త మకూ  వాటా కావాలని పట్టుబట్టడంతో వాగ్వాదానికి దారి తీసింది. దీంతో సంజయ్ కుమారుడు హరీష్ జంగంజ్ పోలీసులను ఆశ్రయించాడు.  సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. వాటా  అడిగిన ఇంటి పొరుగువారితో పాటు ఇద్దరు కార్మికులను అరెస్టు చేస్తామని చెప్పారు. కొన్ని వెండి నాణేలను కూడా వారు స్వాధీనం చేసుకున్నారు. ఈవిషయానికి సంబంధించి పురావస్తు శాఖ నుంచి వివరాలను సేకరించి తగిన చర్యలు చేపడతామని పోలీసు అధికారులు ప్రకటించారు.

కాగా ఇంటి పునాదిని తొలగిస్తుండగా నిధి కనిపించిందని, కూలీలకు 40-50 నాణేలు లభించాయని తమకు సమాచారం అందిందనీ,   తాము అక్కడికే చేరుకునే సరికి అక్కడ ఎవరూ లేరని, వాటిని కార్మికులో తీసుకుని ఉంటారని హరీష్‌ తెలిపాడు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)