Breaking News

నో టికెట్‌.. నో మనీ : విమానం ల్యాండింగ్‌ గేర్‌ పట్టుకుని ఢిల్లీకి వచ్చేసాడు

Published on Tue, 09/23/2025 - 16:45

‘విపత్కర పరిస్థితులనుంచి ఎలాగైనా ప్రాణాలను కాపాడుకోవాలి. బతికి బట్ట కట్టాలి’’  ఈ ఆరాటానికి నియమాలు, కట్టుబాట్లు ఇవేవీ గుర్తు రావు.  ఈ ధిక్కారమే ఒక ఆఫ్ఘన్‌ బాలుడి (Afghan Boy) సాహసోపేత చర్యకు దారి తీసింది. ఏకంగా విమానం ల్యాండింగ్ గేర్‌కు వేలాడుతూ ఢిల్లీ దాకా వచ్చేశాడు. ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. ప్రమాదమని తెలిసినాసాహసానికి పూనుకున్న 13 ఏళ్ల  తెగువ ఇపుడు నెట్టింట చర్చనీయాంశంగా నిలిచింది.

కాబూల్ నుండి ఢిల్లీకి  (Kabul-Delhi) కామ్ ఎయిర్‌లైన్స్ విమానంRQ-4401 లో ఆదివారం(సెప్టెంబర్ 22) ఉదయం 11.10 గంటలకు 1.5 గంటల ప్రయాణం తర్వాత ఢిల్లీలో  దిగిపోయాడు. విమానం కాబూల్ నుండి ఢిల్లీకి గంటన్నర ప్రయాణం పూర్తిచేసుకుని ల్యాండ్ అయిన తరువాత అధికారులు ఈవిషయాన్ని గ్రహించారు. టాక్సీవేపై నడుస్తున్న బాలుడిని గుర్తించి ఎయిర్‌లైన్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్  ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్‌కు సమాచారం ఇచ్చాడు.  దీంతో అధికారులు విస్తుపోయారు. బాలుడ్ని అదుపులోకి తీసుకుని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌ (CISF) సహా భద్రతా సంస్థలకు అప్పగించారు.

కుందూజ్‌ ప్రాంతానికి చెందిన ఈ బాలుడు సెక్యూరిటీ కళ్లు గప్పి ఎయిర్‌పోర్ట్‌లోకి  చొరబడి విమానం బయలుదేరే ముందు రియర్ సెంట్రల్ ల్యాండింగ్ గేర్‌లోకి  ఎక్కి దాక్కున్నట్టు అంగీకరించాడు. అంతేకాదు  విమానం అటు ఇటు కుదుపులకు గురైనప్పటికీ వేలాడుతూ  అలాగే ధైర్యంగా ఉండిపోయినట్లు చెప్పాడు. అయితే అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణాపాయం లేకుండా చేరాడు. అయితే మైనర్‌బాలుడు కావడంతో ఎలాంటి చర్యలు లేకుండానే  మరో విమానంలో తిరిగి కాబూల్‌కు పంపించివేశారు అధికారులు. గడ్డ కట్టే చలి, తీవ్రమైన గాలులు లాంటి వాతావరణం మధ్య ఆ బాలుడు ఎలా తట్టుకున్నాడు?  అల్పోష్ణస్థితి , హైపోక్సియా , అధిక ఎత్తులో తక్కువ వాతావరణ పీడనంతో ఎవరైనా చనిపోవాల్సిందే  అని కొందరు, ఇది స్టోరీ మాత్రమే కాదు, ప్రాణాలకు తెగించి పారిపోవాల్సి భయానక పరిస్థితులకు అద్దం అని కొందరు వ్యాఖ్యానించారు.  కాగా గతంలో కూడా ఇలాంటి ఘటనలు  కొన్ని వెలుగు చూశాయి. ప్రపంచవ్యాప్తంగా “వీల్-వెల్ స్టోవేవే” అని పిలుస్తారు.
 

Videos

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)