Breaking News

90 ఏళ్లుగా  డైరీలు  రాస్తూనే ఉంది!

Published on Sat, 02/15/2025 - 02:10

కొందరు డైరీలు రాయరు. కొందరు డైరీ రాసే అలవాటును మధ్యలోనే వదిలేస్తారు. అమెరికాకు చెందిన ఎవీ రిస్కీ అలా కాదు. వంద సంవత్సరాల రిస్కీ తొంభై సంవత్సరాలుగా డైరీలు రాస్తూనే ఉంది... ఎవీ రిస్కీ తండ్రికీ డైరీలు రాయడం అంటే ఎంతో ఇష్టం. కూతురు చిన్న వయసులో ఉన్నప్పుడు కొత్త సంవత్సరం రోజున డైరీని కానుకగా ఇచ్చాడు. 

ఇక అప్పటినుంచి మొదలైన డైరీ రాసే  అలవాటు ఇప్పటికీ అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. దాదాపు తొమ్మిది దశాబ్దాలుగా ప్రతిరోజూ డైరీ రాస్తోంది. ఇది ఆమెకు జీవితకాలపు అలవాటు అయింది. చిన్ననాటి నుంచి మొదలైన ఈ అలవాటు వల్ల ఆమె వ్యక్తిగత ప్రయాణంతోపాటు చుట్టూ మారుతున్న ప్రపంచాన్ని కూడా డాక్యుమెంటూ చేస్తూ వస్తోంది.

నయాగరా అనే చిన్న పట్టణంలో పెరిగిన రిస్కీ ప్రతి సీజన్‌ గురించి రాసింది. కుటుంబ ప్రయాణాల నుంచి చారిత్రాత్మక సంచలన ఘటనల వరకు ఎన్నో చేసింది. కష్టకాలంలోనూ, ప్రతికూల పరిస్థితుల్లోనూ డైరీ రాయడం ఆపలేదు. అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నప్పుడు కూడా డైరీ రాయడం మానలేదు.

 ఎప్పుడైనా డైరీని చేరుకోలేనంత అనారోగ్యంగా ఉంటే చిత్తు కాగితాలపై నోట్సు రాసి ఆ తరువాత డైరీలో రాసేది. ప్రతిరాత్రి డైరీ రాయడం పూర్తి చేసిన తరువాత గత సంవత్సరం ఆరోజు విషయాలను తెలుసుకోవడం తనకు ఆసక్తిగా ఉంటుంది. ‘వాషింగ్టన్‌ పోస్ట్‌’ ఎవీ రీస్కీ గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయడంతో ఆన్‌లైన్‌ సెన్సేషన్‌గా మారింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)