Breaking News

చిరుదీవిలో ఎన్నికల చేపలవేట

Published on Wed, 04/03/2024 - 00:50

ఎన్నికలంటే సాధారణంగా ఉద్యోగాలు, ద్రవ్యోల్బణం లాంటివి ప్రస్తావనకొస్తాయి. కానీ, మూడు రోజులుగా ఓ విదేశాంగ విధానం ప్రధానాంశమై కూర్చుంది. లోక్‌సభ ఎన్నికల తొలి దశలోనే తమిళనాట పోలింగ్‌ జరగనున్న వేళ ఆ రాష్ట్రానికి అతి సమీపంగా భారత – శ్రీలంకల మధ్యనున్న చిరుద్వీపం కచ్చతీవు ఇప్పుడు వార్తల్లో నిలిచింది. స్టాలిన్‌ సారథ్యంలోని స్థానిక డీఎంకె ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రధాని, విదేశాంగ మంత్రి సహా సమస్త శక్తులనూ బీజేపీ కేంద్రీకరించినట్టు కనిపిస్తోంది. ఎన్నికల మాట అటుంచితే, భారత సర్కారే ఒకప్పుడు శ్రీలంకకు అప్పగించిన ఓ ద్వీపప్రాంత ప్రాదేశిక హక్కులపై ఇప్పుడు రగడ చేయడం సబబేనా? ప్రభుత్వాలు మారినప్పుడల్లా సముద్ర జలాల సరిహద్దులు మార్చేసే ప్రయత్నాలు ఎక్కడికి దారి తీస్తాయి?

భారత్‌ – శ్రీలంకల మధ్య పాక్‌ జలసంధిలో 1.6 కిలోమీటర్ల పొడవు, 300 మీటర్ల వెడల్పున్న చిన్న ప్రాంతం కచ్చతీవు. భారత్‌లోని రామేశ్వరానికి ఉత్తరాన 30 కి.మీ.ల దూరంలో, శ్రీలంకలోని జాఫ్నాకు దక్షిణాన 60 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ ద్వీపం వ్యూహాత్మకంగా కీలకమైనది. కచ్చతీవు చారిత్రకంగా జాఫ్నా రాజ్యంలో, ఆపైన రామ్‌నాడ్‌ సహా పలువురు రాజుల ఏలుబడిలో, బ్రిటీష్‌ వారి హయాంలో మద్రాస్‌ ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేది. తాగునీటితో సహా ప్రాథమిక వసతులేవీ లేని ఈ ప్రాంతంలో ఒకే ఒక్క చర్చి మినహా నివాసాలే లేవు.

ఈ ద్వీపం తాలూకు ప్రాదేశిక హోదాపై భారత్, శ్రీలంకల మధ్య దీర్ఘకాలం వివాదం నెలకొంది. అయితే, 1974లో ఇరుదేశాలూ ఓ ఒప్పందానికి వచ్చి, సంతకాలు చేశాయి. శ్రీలంకతో పటిష్ఠ బంధానికై కేంద్రంలో ఇందిరా గాంధీ సారథ్యంలోని నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ చిరుద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించింది. ఇప్పుడు యాభై ఏళ్ళ తర్వాత మోదీ నేతృత్వంలోని బీజేపీ భారత సమైక్యతకు విఘాతం కలిగిస్తూ కాంగ్రెస్, డీఎంకెలు ‘నిర్లక్ష్యంగా’ ఆ ద్వీపాన్ని శ్రీలంకకు ధారాదత్తం చేసేశాయంటూ దాడికి దిగింది. 

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఇటీవల ‘సమాచార హక్కు’ పిటిషన్‌ ద్వారా ఇప్పటి దాకా బయటపడని ఈ ద్వీపం అప్పగింత వివరాలను తీసుకున్నారు. అవన్నీ మీడియాలో వచ్చాయి. దక్షిణాదిన, అందునా తమిళనాట బీజేపీ జెండా ఎగరేయాలని తరచూ పర్యటిస్తున్న ప్రధాని మోదీ దాన్ని అందిపుచ్చుకొన్నారు. ద్వీపం అప్పగింత తప్పుడు నిర్ణయమంటూ కాంగ్రెస్‌ను దుయ్య బట్టారు. విదేశాంగ మంత్రి జైశంకర్‌ స్వరం కలిపారు. సమీప శ్రీలంక జలాల్లో భారతీయ జాలర్లను పదే పదే అరెస్టు చేస్తున్నారంటే, అదంతా అప్పటి తప్పుడు నిర్ణయం ఫలితమేనని ఆయన ఆరోపణ.

ఈ చిరుద్వీపానికి తన దృష్టిలో పెద్దగా ప్రాధాన్యం లేదని 1961 మేలోనే ప్రధాని నెహ్రూ అన్నారట. ద్వీపాన్ని అప్పగించినా చేపలు పట్టుకొనేందుకు భారతీయులకున్న హక్కుల్ని 1974 ఒప్పందంలో పరిరక్షిస్తున్నామంటూ పార్లమెంట్‌కు హామీ ఇచ్చిన నాటి సర్కార్‌ తీరా ఆ ప్రాంతంలో చేపలు పట్టే హక్కులను సైతం 1976లో వదులుకుందని జైశంకర్‌ నిందిస్తున్నారు. గత ప్రధానులు ఈ అంశంపై ఉదాసీనంగా ఉన్నా, భారత – శ్రీలంక సముద్రజలాల సరిహద్దు చట్టం అమలు, భారతీయ జాలర్ల హక్కులపై తమ సర్కార్‌ శ్రీలంకతో చర్చలు జరుపుతుందని ఆయన చెబుతున్నారు. 

గమ్మత్తేమిటంటే, కేంద్రంలో అధికారంలో ఉన్న కమలనాథులు గత పదేళ్ళుగా ఆ పని ఎందుకు చేయలేదో తెలీదు. అలాగే, ఆ ద్వీపాన్ని తిరిగి స్వాధీనం చేసుకొనే పనిలో మోదీ సర్కార్‌ ఉన్నట్టు తమిళనాడు బీజేపీ చెబుతోంది కానీ, అసలు ఇప్పటి దాకా ఆ అంశంపై మోదీ సర్కార్‌ నుంచి అధికా రిక సమాచారమే లేదని శ్రీలంక మంత్రి ఒకరు తేల్చేశారు. మరి, కచ్చతీవు అంశాన్ని బీజేపీ ఉన్న ట్టుండి ఎందుకు లేవదీసినట్టు? లోక్‌సభ ఎన్నికల తొలి దశలో భాగంగా ఈ నెల 19న తమిళనాట పోలింగ్‌ జరగనుంది.

ప్రాంతీయ, భాషాభిమానాలు మెండుగా ఉండే తమిళనాట చొచ్చుకుపోవడా నికి తంటాలు పడుతున్న బీజేపీ దీన్ని ఓ అస్త్రంగా భావించింది. కేంద్రంలోని కాంగ్రెస్‌ సర్కార్‌ ఆ ద్వీపాన్ని ఇచ్చేస్తుంటే, అడ్డుకోని కరుణానిధి సారథ్యంలోని డీఎంకె సర్కార్‌దీ తప్పుందని బీజేపీ నిందిస్తోంది. తమిళ ఓటర్లలో సెంటిమెంట్‌ రగిల్చి లబ్ధి పొందడమే దాని అజెండాగా కనిపిస్తోంది.

నిజానికి, ఎవరు సలహా ఇచ్చారో కానీ ఆ దీవిని శ్రీలంకకు ఇచ్చేశాం. దీవి అప్పగింత విషయం అంతర్జాతీయ వ్యవహారం గనక అప్పట్లో కేంద్రం తమిళ సర్కార్‌కు సమాచారమిచ్చి ఉంటుందే తప్ప, సరేనన్న అనుమతి తీసుకొని ఉంటుందనుకోలేం. స్థానిక అనివార్యతల రీత్యా అప్పటి కరుణానిధి సర్కార్‌ నుంచి ఇప్పటి స్టాలిన్‌ సర్కార్‌ దాకా డీఎంకె ప్రభుత్వాలు శ్రీలంకతో ఒప్పందాన్ని నిరసిస్తూనే వచ్చాయి.

చేపల వేటకు వెళ్ళే తమిళ జాలర్లు పదే పదే లంకేయుల చేతిలో అరెస్టవుతున్నారని చెబుతూనే ఉన్నాయి. ఆ మధ్య భారత – శ్రీలంక ప్రధానుల భేటీ ముందూ స్టాలిన్‌ ఈ సంగతి మోదీ దృష్టికి తెచ్చారు. అవేవీ పట్టించుకోని బీజేపీ ఎన్నికల ముందు ఈ అంశం పట్టుకోవడమే విడ్డూరం. ద్వైపాక్షిక బంధాలపై ప్రభావం చూపే సున్నితమైన అంశాన్ని ఎన్నికల లబ్ధి కోసం తలకెత్తుకోవడం ప్రమాదకరం. నేపాల్‌ లాంటి పొరుగుదేశాలతోనూ అపరిష్కృత ప్రాదేశిక వివాదాలున్న భారత్‌ గతాన్ని తవ్వితే తలనొప్పులే.

శ్రీలంకలో జాతుల యుద్ధం ముగిశాక వాణిజ్యం, ఇంధన, రవాణా రంగాల్లో ఇరు దేశాలూ ముందుకు సాగుతున్నాయి. పాత చరిత్రను ఆశ్రయిస్తే కొత్త దౌత్య యత్నాలకు చిక్కులు తప్పవు. హిందూ మహాసముద్రంలో వ్యూహాత్మక ప్రాంతంలో లంగరేయడానికి చైనా సిద్ధంగా ఉన్నవేళ కచ్చతీవు వివాదం అభిలషణీయం కానే కాదు. అయినా, మనమే వదులుకున్న ఈ దక్షిణాగ్ర ద్వీపంపై ఇంత ప్రేమ ప్రదర్శిస్తున్న పాలకులు ఉత్తరాన వేలాది చదరపు కిలోమీటర్లు చైనా ఆక్రమించుకున్నట్టు వార్తలున్నా ఉలకరేం? పలకరేం? 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)