Breaking News

మంత్రి కందుల దుర్గేష్ పైరవీలు.. జనసేన నేతల అసంతృప్తి

Published on Sun, 01/04/2026 - 00:36

సాక్షి,కాకినాడ: జనసేన పార్టీలో కాకినాడ జిల్లా రాజకీయాలు రోజు రోజుకు మరింత ఉత్కంఠగా మారుతున్నాయి. ముఖ్యంగా కాకినాడ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (KUDA) చైర్మన్ పదవి ఎవరికి కేటాయించాలన్న అంశంపై జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో మంత్రి కందుల దుర్గేష్ పాత్రపై పార్టీ లోపలే భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.

మంత్రి దుర్గేష్ పైరవీలపై అసంతృప్తి
కుడా చైర్మన్ పదవిని ముత్తా శశిధర్ ముఖ్య అనుచరుడైన తలాటం సత్యకు కేటాయించాలంటూ మంత్రి కందుల దుర్గేష్ పైరవీలు చేయడం జనసేన వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో దుర్గేష్‌కు సంబంధించిన లేఅవుట్లు, వ్యాపార ప్రయోజనాలే ఇందుకు కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దుర్గేష్‌కు అనుకూలమైన వ్యక్తిని ముందుంచి నిర్ణయాలపై ప్రభావం చూపాలన్న ప్రయత్నం జరుగుతోందని కొందరు నేతలు బహిరంగంగానే వారి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారికి ఇప్పుడు కీలక పదవులు ఎలా ఇస్తారు? అని ఇతర నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లు దుర్గేష్‌ను ప్రశ్నిస్తున్నారు. జగ్గంపేట, ప్రత్తిపాడు వంటి ప్రాంతాల్లో పార్టీ కోసం కష్టపడ్డ నేతలను పక్కన పెట్టి వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటే సహించబోమని వారు హెచ్చరిస్తున్నారు.

ఒకే పార్టీ నుంచి ఒకే సామాజిక వర్గానికి, ఒకే నియోజకవర్గానికి రెండు కీలక పదవులు ఇవ్వకూడదన్న పార్టీ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే కాకినాడ సిటీ నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన తోట సుధీర్ సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. గతంలో కుడా చైర్మన్ పదవి విషయంలో ఏర్పడిన వివాదాన్ని నివారించేందుకు పెద్దాపురం నియోజకవర్గానికి చెందిన తుమ్మల బాబుకు ఆ బాధ్యతలు అప్పగించిన విషయం గుర్తు చేస్తున్నారు.

తలాటం సత్య కాకినాడ సిటీకి చెందినవారే కావడంతో మరోసారి సిటీ నుంచే పదవి ఇస్తే సమస్యలు తలెత్తవచ్చని పార్టీ పెద్దలకు సూచిస్తున్నారు. కుడా చైర్మన్ పదవిని కాపు సామాజిక వర్గానికే కేటాయించాల్సి వస్తే ఇతర నియోజకవర్గాలకు చెందిన నేతలకు అవకాశం ఇవ్వాలని పార్టీ శ్రేణులు డిమాండ్‌ చేస్తున్నారు. జగ్గంపేట ఇన్‌ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, ప్రత్తిపాడు జనసేన నేత కత్తిపూడి బాబీ, లేదా పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ఓదూరి నాగేశ్వరరావు పేర్లు చర్చలో ఉన్నాయి. 

Videos

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)