Breaking News

వింట‌ర్‌లో ముఖం తేట‌గా ఉండాలంటే వెంట‌నే ఇలా చేయండి!

Published on Sun, 12/31/2023 - 09:02

'చలికాలంలో ముఖం పొడిబారిపోవడమూ, పెదవులు పగలడం, ముఖంపై ముడతలు రావడం చాలా సాధారణం. అందరికీ తెలిసిన చిట్కా వ్యాజలైన్‌ రాయడంతో పాటు ఈ కాలంలోనూ ముఖం తేటగా, ఆరోగ్యంగా ఉంచేందుకు పాటించాల్సిన చిట్కాలివి..'

  • చలికాలంలో ఉదయం, సాయంత్రం మంచుకురుస్తున్నా.. మధ్యాహ్నపు ఎండ తీక్షణంగా గుచ్చుతున్నట్టుగా ఉంటుంది. ఈ మంచుకూ, మధ్యాహ్నపు ఎండకూ నేరుగా ముఖచర్మం ఎక్స్‌పోజ్‌ కాకుండా జాగ్రత్త తీసుకోవాలి.
  • ఈకాలంలో ఉండే మంచు, పొగ కలిసిన కాలుష్యం.. స్మాగ్‌లోకి వెళ్లకుండా జాగ్రత్తపడాలి.
  • తేలికపాటి వ్యాయామం వల్ల ముఖానికి తగినంత రక్తప్రసరణ జరిగి ముఖం తేటగా మారుతుంది.
  • రోజుకి కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్రతో ముఖం తేటబారుతుంది.

ఆహార పరంగా..

  • అన్ని రకాల పోషకాలు అందే సమతులాహారాన్ని రోజూ  తీసుకోవాలి. అయితే చలి వాతావరణం కారణంగా నీళ్లు తక్కువగా తాగుతుంటారు. ఇది సరికాదు. రోజూ తప్పనిసరిగా మూడు లీటర్లకు తగ్గకుండా నీళ్లు తాగాలి.
  • ఆకుకూరలు, కూరగాయలూ, ములగకాడల వంటి తాజా కూరలను ఎక్కువగా తీసుకోవాలి. ఈ సీజన్‌లో దొరికే పండ్లను తప్పక తీసుకోవాలి. ఇందులోని నీటిమోతాదులూ, పోషకాలూ, యాంటీ ఆక్సిడెంట్స్‌ చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరచి ముఖాన్ని తేటగా కనిపించేలా చేస్తాయి. 
  • డ్రైఫ్రూట్స్‌ పరిమితంగా తీసుకుంటూ ఉండాలి. అందులో జీడిపప్పు వంటి కొవ్వులు ఎక్కువగా ఉండే నట్స్‌ కంటే బాదం పప్పు వంటి కొవ్వులు తక్కువగా ఉండే నట్స్‌ ఎక్కువగా తీసుకోవాలి.

ఇవి చ‌ద‌వండి: గుడిలో తీర్థం, ప్రసాదాలు ఎందుకు ఇస్తారో తెలుసా? కారణమిదే!

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)