Breaking News

‘మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అత్యంత దుర్మార్గం’

Published on Tue, 01/27/2026 - 14:54

సాక్షి,ఢిల్లీ: రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం అత్యంత దుర్మార్గం. పేద ప్రజలను వైద్య విద్యకు దూరం చేసేందుకు చంద్రబాబు ప్రైవేటీకరణ చేస్తున్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్లో  గళం విప్పుతాం​’అని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు.

రేపటి నుంచి పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో మంగళవారం ఢిల్లీలో ఆల్‌ పార్టీ మీటింగ్‌ జరిగింది. ఈ సమావేశంలో ఫ్లోర్ లీడర్లు  మిథున్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ మీడియాతో మాట్లాడారు. 

‘అమరావతికి మేము వ్యతిరేకం కాదు.అమరావతికి భూములు ఇచ్చిన రైతుల ప్రయోజనాలు కాపాడాలని బిల్లులో పెడితే మద్దతు ఇస్తాం. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం అత్యంత దుర్మార్గం. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్లో  గళం విప్పుతాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును చంద్రబాబు మూలన పడేశారు. దానికి నిధులు కేటాయించకుండా రాయలసీమ ప్రజలను మోసం చేస్తున్నారు. ఏపీ అప్పుల కుప్పగా మారిపోయింది.నిర్దేశించిన సీలింగ్‌కు మించి 69 శాతం ఎక్కువగా అప్పులు చేశారు.అప్పుల తెచ్చిన నిధులను ఏం చేస్తున్నారు.
 
కనీసం సంక్షేమ పథకాలను కూడా అమలు చేయడం లేదు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేయడం లేదు. 8 త్రైమాసిక ఫీజులు చెల్లించలేదు. కనీసం హాస్టల్ బిల్లులు చెల్లించకపోవడంతో విద్యార్థులు పస్తులు ఉంటున్నారు. రైతులకు పంటల భీమా అమలు చేయడం లేదు.మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి తగ్గించిన నిధులను కేంద్ర నుంచి తీసుకురావాలి.కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ ... నిధుల లోటును పూడ్చేలా కృషి చేయాలి’ అని డిమాండ్‌ చేశారు. 

MP Subhash : అమరావతికి మేము వ్యతిరేకం కాదు ప్రైవేటీకరణకు వ్యతిరేకం

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి