Breaking News

వారు స్కై వారియర్లు

Published on Mon, 05/26/2025 - 01:02

సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: డ్రోన్ల సాయంతో వ్యవసాయ పనులు చేస్తున్న సంగారెడ్డి జిల్లాలోని 54 మంది స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళలపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ఆదివారం నిర్వహించిన మాసాంతపు రేడియో కార్యక్రమం ‘మన్‌ కీ బాత్‌’లో వారి ప్రతిభను కొనియాడారు. ‘వారు డ్రోన్‌ ఆపరేటర్లు కాదు.. స్కై వారియర్లు’అంటూ ప్రధాని అభివర్ణించారు. ‘పొలాలతోపాటు ఆకాశపు ఎత్తుల్లో కూడా పనిచేస్తున్న అనేక మంది మహిళలు ఈ రోజుల్లో ఉన్నారు. ఇప్పుడు గ్రామీణ మహిళలు డ్రోన్‌ దీదీలుగా మారి డ్రోన్లను ఆపరేట్‌ చేస్తున్నారు.

వారు వ్యవసాయంలో కొత్త విప్లవాన్ని తీసుకొస్తున్నారు. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో కొంతకాలం కిందటి వరకు ఇతరులపై ఆధారపడిన మహిళలు ఇ ప్పుడు స్వయంగా డ్రోన్ల ద్వారా 50 ఎకరాల భూమిలో మందులు పిచికారీ చేస్తున్నారు. ఉదయం మూడు గంటలు, సా యంత్రం రెండు గంటలు పనిచేస్తున్నారు. అంతే పని పూ ర్తయిపోతుంది. ఎండ వేడి లేదు. విషపూరిత రసాయనాల ప్రమాదం లేదు. గ్రామస్తులు కూడా ఈ మార్పును మన స్ఫూర్తిగా అంగీకరించారు. ఇప్పుడు మహిళలు డ్రోన్‌ ఆపరేటర్లుగా కాదు, స్కైవారియర్లుగా గుర్తింపు పొందారు. సాంకేతికత, సంకల్పం కలిసి నడిచినప్పుడు మార్పు వస్తుందని ఈ మహిళలు నిరూపిస్తున్నారు’అని మోదీ ప్రశంసించారు. 

సబ్సిడీపై డ్రోన్లు.. శిక్షణ అందించి.. 
సంగారెడ్డి జిల్లా ఆందోల్‌ ప్రాంతానికి చెందిన 54 మంది ఎస్‌హెచ్‌జీ మహిళలను కేంద్రం అమలు చేస్తున్న నమో డ్రోన్‌ దీదీ పథకానికి ఎంపిక చేసింది. వారికి బెంగళూరుకు చెందిన ఫ్లైయింగ్‌ వెడ్జ్‌ అనే సంస్థ ఆధ్వర్యంలో డ్రోన్లను ఎగరేయడంలో శిక్షణ ఇప్పించింది. అలాగే ఈ పథకం కింద 80% సబ్సిడీపై డ్రోన్లను అందించింది. కేంద్ర సాయంతో రూ. 10 లక్షల వ్యయంతో ఎస్‌హెచ్‌జీ మహిళలు యూనిట్‌ను ప్రారంభించారు.

ఇందులో లబ్ధిదారులు 20% (రూ.2 లక్షలు) చెల్లించగా మిగిలిన 80% రూ. 8 లక్షలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నమో దీదీ, కిసాన్‌ దీదీ పథకాల కింద సబ్సిడీ ఇస్తున్నాయి. డ్రోన్‌ సేవలను మహిళలు వారి పొలాల వద్ద వినియోగించడంతోపాటు ఇతర రైతుల పొలాల వద్ద సేవలందిస్తున్నారు. ఇందుకోసం వారు రైతుల నుంచి నిర్ణిత మొత్తాన్ని తీసుకుంటూ ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు. డ్రోన్‌ దీదీల సాయంతో రైతులకు సైతం పొలాల్లో పురుగుమందుల పిచికారీ చేసేందుకు కూలీల కొరత తప్పుతోంది. 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)