Breaking News

అజ్ఞాతంలో హర్షసాయి.. స్పెషల్‌ టీమ్‌లు రంగంలోకి

Published on Thu, 09/26/2024 - 10:19

హైదరాబాద్‌: లైంగిక దాడి కేసులో ప్రముఖ తెలుగు యూట్యూబర్‌ హర్షసాయి కోసం గాలింపు కొనసాగుతోంది. ముంబైలో ఉన్నాడన్న సమాచారంతో నాలుగు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఏ క్షణమైనా అతన్ని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

గుడ్‌ మెసేజ్‌.. హెల్పింగ్‌ హ్యాండ్‌ తరహా వీడియోలతో హర్షసాయి తెలుగు స్టేట్‌లోనే కాకుండా సౌత్‌లోనూ పాపులారిటీ సంపాదించుకున్నాడు. అయితే హర్ష, ఆయన తండ్రి తనను లైంగికంగా వేధించారంటూ ఓ నటి కమ్‌ ప్రొడ్యూసర్‌ పోలీసులను ఆశ్రయించడం సంచలనం సృష్టించింది.  

హర్షసాయి డెబ్యూ మూవీ  ‘మెగా’ కాపీరైట్సే్‌ కోసమే లైంగికంగా వేధించారని బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో హర్షసాయిపై కేసు నమోదు అయ్యింది. అయితే.. డబ్బు కోసమే ఈ ఆరోపణలంటూ హర్షసాయి ఓ ప్రకటన విడుదల చేయగా.. ఆయన తరఫు లాయర్‌ కూడా ఇదే చెబుతున్నారు. మరోవైపు ఆరోపణలే అయితే అజ్ఞాతంలోకి వెళ్లాల్సిన అవసరం ఏముందని బాధితురాలి తరఫు న్యాయవాది ప్రశ్నిస్తున్నారు.

ఇక ఈ కేసులో పోలీసుల దర్యాప్తు వేగం పుంజుకుంది.  ఇప్పటికే బాధితురాలికి వైద్య పరీక్షలు పూర్తి కాగా, హర్షసాయిపై ఆరోపణలకుగానూ ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. 

జానీ మాస్టర్‌ ఉదంతం వార్తల్లో ఉండగానే.. మరో డర్టీ పిక్చర్‌ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రేమ, పెళ్లి పేరుతో హర్షసాయి తనను లొంగదీసుకుని నగ్న వీడియోలను, నగ్న చిత్రాలను పెట్టుకుని బ్లాక్మెయిల్ చేశారని.. పలుమార్లు తనపైన అత్యాచారం చేశాడంటూ బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అలాగే దాడి కూడా చేశాడని బాధితురాలు వాపోయింది. దీంతో.. 328, 376(2)(n)354(ఆ)(ఇ) సెక్షన్ల కింద పోలీసులు హర్షపై కేసులు నమోదు చేశారు. హర్ష సాయితో పాటు ఆయన తండ్రి రాధాకృష్ణపై కూడా కేసు నమోదు చేశారు. 

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)