Breaking News

చంపడానికొచ్చి.. హతమయ్యాడు

Published on Tue, 03/05/2024 - 02:35

మల్యాల(చొప్పదండి): ప్రేమ పేరుతో మూడేళ్లుగా వేధిస్తున్న యువకుడు.. నేరుగా ఆ యువతి ఇంటికే వెళ్లి కుటుంబ సభ్యులపై కత్తితో దాడికి తెగబడ్డాడు. యువతి కుటుంబ సభ్యులు ఆత్మరక్షణ కోసం ఆ యువకుడిపై దాడి చేయగా.. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలం తక్కళ్లపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రానికి చెందిన బోగ మహేశ్‌ తన దూరపు బంధువైన తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ మూడేళ్లుగా ఫోన్‌లో వేధిస్తున్నాడు.

భరించలేని ఆ యువతి ఈనెల 2న మల్యాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కక్ష పెంచుకున్న మహేశ్‌ ఆ యువతిని చంపేందుకు కత్తితో సోమవారం మధ్యాహ్నం 2.20 గంటలకు తక్కళ్లపల్లిలోని యువతి ఇంటికి చేరుకున్నాడు. ఆ సమయానికి మొదట యువతి తల్లి కనపడగా. ఆమెపై కత్తితో దాడికి యత్నించాడు. తప్పించుకునే క్రమంలో కత్తి ఆమె కాలికి తగిలింది. అనంతరం అక్కడే మంచంలో పడుకున్న యువతి తాతపైనా దాడి చేసి కత్తితో పొడవగా ఆయనకూ గాయాలయ్యాయి.

ఈ క్రమంలో యువతి తల్లి అక్కడే ఉన్న తన తమ్ముడు నర్సయ్యతో కలిసి మహేశ్‌ని ఆపే ప్రయత్నం చేస్తుండగానే మరోసారి దాడికి యత్నించాడు. ఈ క్రమంలో ముగ్గురి మధ్య జరిగిన ఘర్షణలో మహేశ్‌ కింద పడిపోయాడు. అక్కడే ఉన్న బండరాయితో మహేశ్‌పై యువతి తల్లి దాడి చేయగా.. తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. దాడిలో గాయపడిన నర్సయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్‌కు తరలించారు.  

పంచాయితీ పెట్టించినా మారని తీరు
యువతికి దూరపు బంధువు కావటంతో పరిచయం పెంచుకున్న మహేశ్‌.. ఆమె ఫోన్‌ నంబర్‌ తీసుకున్నాడు. ప్రేమించాలంటూ మూడేళ్లుగా వెంటపడి వేధిస్తున్నాడు. విషయాన్ని యువతి తన తల్లిదండ్రులకు చెప్పడంతో రెండేళ్ల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటినుంచి కొంతకాలం యువతికి ఫోన్‌ చేయకుండా దూరంగా ఉన్న మ హేశ్‌.. ఇటీవల కొద్దిరోజులుగా ఫోన్‌లో వేధిస్తున్నాడు. ఈ క్రమంలో పలుమార్లు పంచాయితీ పెట్టించారు. పెద్దలతో నూ హెచ్చరించారు. అయినా అతడిలో మాత్రం మార్పు రాలేదు. 

యువతి జన్మదినాన్ని డెత్‌ డేగా మారుస్తానంటూ పోస్టులు 
యువతి జన్మదినం ఈనెల 6న ఉండగా.. డెత్‌డేగా మా రుస్తానంటూ మహేశ్‌ పోస్టులు పెడుతున్నాడు. దీంతో ఈనెల 2న పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశా మని సదరు యువతి తెలిపింది. కాగా, మహేశ్‌ కుటుంబసభ్యుల ఫిర్యాదుతో యువతితోపాటు తల్లి, అన్న, వది న, అమ్మమ్మ, తాతయ్యపై కేసు నమోదు చేసినట్లు మల్యా ల ఎస్సై అబ్దుల్‌ రహీం తెలిపారు. సంఘటన స్థలాన్ని డీ ఎస్పీ రఘుచందర్‌ స్థానిక పోలీసులతో కలిసి పరిశీలించా రు. యువతి ఇంటి వద్ద పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశా రు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)