Breaking News

Mancherial: పాపం సాయిష్మ.. ఎంగేజ్‌మెంట్‌ అయ్యిందన్నా ప్రేమోన్మాది వదల్లేదు!

Published on Mon, 03/20/2023 - 14:53

సాక్షి, మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో వెంటపడుతున్న యువకుడి వేధింపులు తట్టుకోలేక ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబ సభ్యులను ఆమెను హైదరాబాద్‌ నిమ్స్‌కు తరలించగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. 

వివరాలు.. మంచిర్యాల జిల్లా దండపేల్లి మండలం కొత్త మామిడిపల్లి గ్రామానికి చెందిన ఎంబడి సాయిష్మ అనే యువతిని అదే గ్రామానికి చెందిన నలిమేల వినయ్‌ కుమార్‌ గత కొంతకాలంగా ప్రేమ పేరుతో వెంటపడుతున్నాడు. యువతిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోవాలని తరుచూ వేధింపులకు గురిచేస్తున్నాడు. తనకు ఇప్పటికే నిశ్చితార్థం జరిగిందని, వేధించవద్దని సాయిష్మ కోరినా.. యువకుడు పట్టించుకోలేదు. అంతేగాక తనను పెళ్లి చేసుకోకపోతే నీ సంగతి చూస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు.

ఈ క్రమంలో ఈనెల 18న యువతికి ఫోన్‌చేసి నువ్వు చచ్చిపో, బతికి ఉండకంటూ బెదిరించాడు. దీంతో మనస్తాపానికి గురైన సాయిష్మ.. వినయ్‌ వేధింపులు తట్టుకోలేక శనివారం సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. తల్లిదండ్రులు వెంటనే చికిత్స కోసం కరీంనగర్‌కు తీసుకువచ్చారు. అనంతరం అక్కడి నుంచి మెరుగైన చికిత్సకు హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. కాగా నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం సాయిష్మా మృతి చెందింది. దీంతో వినయ్ కుమార్ వల్లే తమ కూతురు చనిపోయిందని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు