Breaking News

అనారోగ్యంతో రిసెప్షనిస్టు మౌనిక ఆత్మహత్య

Published on Tue, 04/08/2025 - 11:33

చౌటుప్పల్‌(నల్గొండ): అనారోగ్యంతో బాధపడుతున్న యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సోమవారం చౌటుప్పల్‌ పట్టణ కేంద్రంలో జరిగింది. సీఐ మన్మథకుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్‌ పట్టణ కేంద్రానికి చెందిన గుండ్ల రామచంద్రయ్య–లక్ష్మమ్మ దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు సంతానం.

 వీరు పండ్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమార్తె గుండ్ల మౌనిక(25) స్థానిక వలిగొండ రోడ్డు వద్ద ఉన్న అఖిల్‌ నేత్రాలయంలో రిసెప్షనిస్టుగా పనిచేసేది. ఇటీవల తనకు ఎర్ర రక్తకణాలు హెచ్చుతగ్గులు అవుతుండడంతో నాలుగు నెలలుగా ఉద్యోగం మానేసి ఇంటి వద్దనే ఉంటోంది. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో సన్నద్ధమవుతోంది.

 సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఒంటరిగా ఉన్న మౌనిక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి రామచంద్రయ్య మధ్యాహ్నం ఇంటికి రాగా.. తలుపు పెట్టి ఉండడం, కుమార్తెను పలకకపోవడంతో తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా.. మౌనిక ఉరేసుకుని కనిపించింది. వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందిందని నిర్ధారించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

 

 

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)