ఫేస్‌బుక్‌లో పరిచయం.. వాట్సాప్‌లో మరింత క్లోజ్‌, చివరికి!

Published on Sun, 08/29/2021 - 08:10

సాక్షి, హిమాయత్‌నగర్‌: ఇంగ్లండ్‌లో డాక్టర్‌ (జనరల్‌ ఫిజీషియన్‌) అంటూ ఓల్డ్‌ బోయిన్‌పల్లికి చెందిన అడ్వకేట్‌ రజలి అమృతరావుకు కొద్దిరోజుల క్రితం ఫేస్‌బుక్‌లో ఓ యవతి పరిచమైంది. కొంతకాలం వీరిద్దరూ మెసెంజర్‌లో చాటింగ్‌ చేసుకుని వాట్సాప్‌ నంబర్స్‌ను ఎక్సేంజ్‌ చేసుకున్నారు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం మరింత ఎక్కువ అయ్యింది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో తాను క్లినిక్‌ పెడతానని, దానికి సపోర్ట్‌ కావాలని అమృతరావును కోరింది. ఇందుకు ఆయన అంగీకరించడంతో... ఇంగ్లండ్‌ నుంచి హైదరాబాద్‌కు వస్తున్నానని చెప్పింది. తనతో పాటు ఖరీదైన గిఫ్ట్‌లను సైతం తీసుకొస్తున్నానని అమృతరావును నమ్మించింది.

మరుసటి రోజు ఢిల్లీ కస్టమ్స్‌ అధికారులు నన్ను ఆపేశారని, నా వద్ద ఇండియన్‌ కరెన్సీ లేదని కాల్స్‌ చేసింది. ఇందుకు అమృతరావు రూ. 2.03 లక్షలను ఆమె ఖాతాకు పంపారు. ఆ తర్వాతా ఇంకా డబ్బులు అవసరమని పదే పదే చెప్పడంతో అనుమానం వచ్చిన అమృతరావు ఆరా తీసేందుకు ప్రయతి్నంచాడు. ఫోన్‌లను స్విచ్చాఫ్‌ రావడంతో మోసపోయానని గ్రహించి శనివారం సిటీ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
చదవండి: రోడ్డు ప్రమాదం: ముగ్గురు యువకుల మృతి 
చదవండి: మీ ఇంట్లో మనీ ప్లాంట్‌ ఉందా.. అది డెంగీ దోమలకు నిలయమే

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ