Breaking News

అమ్మా.. నీకు భారమయ్యా.. క్షమించు!

Published on Sat, 11/23/2024 - 10:33

శివ్వంపేట(నర్సాపూర్‌): జులాయిగా తిరుగుతున్న కుమారుడిని తల్లి మందలించడంతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మండల పరిధి దంతన్‌పల్లి గ్రామానికి చెందిన కుల్ల లక్ష్మీ నర్సింలు దంపతులకు సంతానం కలగకపోవడంతో ఓ బాబుని దత్తత తీసుకున్నారు. కొన్నేళ్ల తర్వాత దంపతులకు కూతురు పుట్టింది. పిల్లలు చిన్నతనంలోనే నర్సింలు మృతి చెందాడు. అప్పటి నుంచి లక్ష్మీ కూలి పనులు చేసుకుంటూ దత్తత కుమారుడు వెంకటేశ్‌(24)తోపాటు కూతురు అఖిలను పోషిస్తుంది. 

కుమారుడు ఎలాంటి పనులు చేయకుండా జులాయిగా తిరుగుతుండటంతో తల్లి గురువారం మందలించింది. ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన అతడు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికారు. శుక్రవారం ఉదయం గ్రామ శివారులో చెట్టుకు ఉరి వేసుకొని కనిపించాడు. అమ్మ నన్ను క్షమించు నీకు భారమయ్యాను. నా చావుకు కారణం ఎవరు కాదు. నీవు, చెల్లి ఆనందంగా ఉండండి అంటూ రాసిన సూసైట్‌ నోట్‌ మృతుడి జేబులో లభ్యమైంది. మృతుడు తల్లి లక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ శ్రీనివాస్‌ తెలిపారు.

ఉరేసుకొని వ్యక్తి..
సిద్దిపేటరూరల్‌: చెట్టుకు ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నారాయణరావుపేట మండల పరిధిలోని జక్కాపూర్‌ గ్రామంలో చోటు చేసుకుంది. చిన్నకోడూరు ఎస్‌ఐ బాలక్రిష్ణ కథనం మేరకు.. జక్కాపూర్‌ గ్రామానికి చెందిన కారంకంటి రాజు (32) కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రాజుకు నాలుగేళ్లుగా మానసిక స్థితి సక్రమంగా లేదు. ఆస్పత్రుల్లో వైద్యం చేయించినప్పటికీ ఫలితం లేదు. శుక్రవారం ఉదయం పొలం వద్దకు వెళ్తున్నానని వెళ్లి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)