Breaking News

రీల్స్ పిచ్చి.. మరో యువకుడి దుర్మరణం

Published on Thu, 05/01/2025 - 19:35

కరీంనగర్ జిల్లా: సోషల్ మీడియా సరదా మరో యువకుడి ప్రాణం తీసింది. ఇటీవల హైదరాబాద్ లో రీల్స్ చేస్తూ ఒక యువకుడు దుర్మరణం చెందిన ఘటన మరువకముందే ఇప్పుడు మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కరీంనగర్ జిల్లా అశోక్ నగర్ కు చెందిన మహ్మద్ అర్బాజ్ రీల్స్ చేసే క్రమంలో ఓ లోతైన లోయలో పడి దుర్మరణం చెందాడు. 

రీల్స్ చేస్తున్న క్రమంలో మానేరు నదీ తీరంలో ప్రమాదవశాత్త జారిపడి 20 ఏళ్ల అర్బాజ్ మృత్యువాత పడ్డాడు. అర్బాజ్ తో పాటు రీల్స్ చేయడానికి మరో ఇద్దరు యువకులు కూడా వెళ్లారు. అయితే నదీ తీరంలో అర్బాజ్ ను వారిద్దరూ కెమెరాతో షూట్ చేసే క్రమంలోనే ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కుమారుడు మృతితో కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కాగా, ఇటీవల హైదరాబాద్ లోని జవహర్‌నగర్‌లో రీల్స్ చేస్తూ తరుణ్‌(17) అనే యువకుడు క్వారీ గుంతలో పడి మృతి చెందిన సంగతి తెలిసిందే. రీల్స్ ప్రభావంతో తరుణ్ తన ఆరుగురి స్నేహితులతో కలిసి ఓ క్వారీ దగ్గర ఫోటో షూట్‌ చేస్తుండగా ఈ విషాదం జరిగింది. స్నేహితులతో ఈత కొడుతూ ఫొటోలు దిగుతూ లోతును గమనించకపోవడంతో ఈత రాక ప్రాణాలు కోల్పోయాడు.

కొంత‌మందిలో సోష‌ల్ మీడియా పిచ్చి రోజురోజుకీ పెరిగిపోతుంది. చిన్నపిల్లల నుంచి ముసలివాళ్ల వరకు సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోవటంతో.. ఆ క్రేజ్‌ను ఉపయోగించుకుని ఓవర్ నైట్ స్టార్ కావాలని పిచ్చి పిచ్చి ప్రయత్నాలన్నీ చేస్తున్నారు.  త్వ‌ర‌గా ఫేమ‌స్ అయిపోవాల‌ని, త‌మ వీడియోలు వైర‌ల్ అవ్వాల‌ని కొన్నిసార్లు ప్రాణాల‌తో చెల‌గాటం ఆడుతున్నారు. ఇలాంటి చేష్ట‌లు చేయ‌కూడ‌ద‌ని ఎంత‌మంది చెప్పినా త‌మ ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు తెచ్చుకోవ‌డం లేదు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)