Breaking News

అల్లుడిపై పెట్రోలు పోసి నిప్పు పెట్టిన అత్తా మామ..

Published on Mon, 02/17/2025 - 13:34

టేకులపల్లి: భార్యాపిల్లలను చూసేందుకు అత్తారింటికి వచ్చిన అల్లుడిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి, ఇంట్లోకి వెళ్లి తలుపుపెట్టుకున్నారు. మంటలకు తాళలేక ఎంతగా మెత్తుకున్నా వారు తలుపు తీయకపోవడంతో పక్కనే ఉన్న నీటితొట్టిలో దూకాడు. స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. పాల్వంచ మండలం దంతెలబోరు ఎస్సీకాలనీకి చెందిన బల్లెం చినవెంకటేశ్వర్లు పెద్ద కుమారుడు బల్లెం గౌతమ్‌ (23).. టేకులపల్లి మండలం రామచంద్రునిపేట గ్రామానికి చెందిన ఎజ్జు వెంకటేశ్వర్లు కుమార్తె కావ్యను రెండేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

 ప్రస్తుతం వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. సుజాతనగర్‌లో ఉంటూ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. గత నెల కావ్య తన ఇద్దరు పిల్లలతో కలిసి రామచంద్రునిపేటలోని పుట్టింటికి వచ్చింది. ఈ నెల 2న రాత్రి గౌతమ్‌ తన పిల్లలు, భార్యను చూసేందుకు రామచంద్రునిపేటకు వచ్చాడు. గౌతమ్‌ని లోపలికి వెళ్లనీయకుండా అత్తా మామ, బావమరుదులు అడ్డుకున్నారు. దుర్భాషలాడి, దాడి చేయడంతో పాటు గౌతమ్‌పై పెట్రోలు పోసి నిప్పంటించారు. అనంతరం అందరూ లోపలికి వెళ్లి తలుపులు వేసుకున్నారు. మంటల్లో కాలుతూ ఆర్తనాదాలు చేస్తున్నా రక్షించలేదు. 

పక్కనే ఉన్న నీటి తొట్టిలో దూకిన గౌతమ్‌ని చుట్టు పక్కల వారు బయటకు తీసి, కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఖమ్మం, వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. 14 రోజుల పాటు చికిత్స పొందిన గౌతమ్‌ ఆదివారం మృతి చెందాడు. బోడు ఎస్‌ఐ పొడిశెట్టి శ్రీకాంత్‌ను వివరణ కోరగా ఈ నెల 2న రామచంద్రునిపేటలో ఘటన జరిగిందని, 11న మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. కాగా, ఈ నెల 2న ఘటన జరిగి, 11న ఫిర్యాదు వచ్చినప్పటికీ ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడంతో ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)