Breaking News

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

Published on Mon, 05/08/2023 - 12:37

మహబూబాబాద్‌ రూరల్‌ : అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన సంఘటన మున్సిపాలిటీ పరిధిలోని ఈదులపూసపల్లిలో ఆదివారం చోటు చేసుకుంది. రూరల్‌ ఎస్సై బి.రాంచరణ్‌ తెలిపిన కథనం ప్రకారం ఎండీ. ఫకృద్దీన్‌–ఆశ దంపతుల ఏకైక కుమారుడు ఉమర్‌ (20) శనివారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు.  తెల్లవారుజామున కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి ఆశ ఇంటిగేటు కొట్టి వెళ్లారు. 

కొంత సమయానికి ఆమె ఇంట్లో నుంచి బయటకు వచ్చి చూసేసరికి ఉమర్‌ తలకు తీవ్ర గాయామై రక్తస్రావంతో పడి ఉండడాన్ని గమనించింది. వెంటనే అతడిని మహబూబాబాద్‌ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు మృతి చెందాడని నిర్ధారించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల కారణాలు పోలీసుల విచారణలో వెల్లడికానున్నాయి. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులను స్థానిక  వార్డు కౌన్సిలర్, కాంగ్రెస్‌ మున్సిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ వెన్నం లక్ష్మారెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మహ్మద్‌ ఫరీద్‌ పరామర్శించారు. 

బంధువుల ఆందోళన..
ఉమర్‌ మృతిపై కారణాలను పోలీసులు విచారణ చేస్తుండగా మృతుడి తండ్రి ఫకృద్దీన్‌ తరుపు బంధువులు మాత్రం తల్లి ఆశ అతడిని చంపి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న   రూరల్‌ సీఐ బి.రమేష్, ఎస్సై బి.రాంచరణ్‌  ఈదులపూసపల్లికి చేరుకుని వారితో మాట్లాడారు. ఎవరికైనా అనుమానం ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. సమగ్ర విచారణ జరిపి దోషులను తప్పనిసరిగా శిక్షిస్తామని చెప్పారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)