Breaking News

పిడుగుపాటుకు యువతీ యువకుడు మృతి

Published on Mon, 10/07/2024 - 04:36

ఐనవోలు/వర్ధన్నపేట: వ్యవసాయ భూముల్లో పనులు చేస్తుండగా పిడుగుపడి యువతీ యువకుడు మృతి చెందారు. కాగా, విద్యుత్‌ సౌకర్యం లేక టార్చ్‌లైట్‌ వెలుతురులోనే శవపరీక్ష చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. వివరాలిలా ఉన్నాయి. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన దౌతుబాజి శ్రీనివాస్, దౌతుబాజి విజయ, రాధాబాయి, ఇందిర, కోమల, శ్రావణి, రాజు ఆదివారం పొలాల్లో పనులు చేస్తున్నారు. 

మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం ప్రారంభమైంది. దీంతో అందరూ సమీపంలోని రేకుల షెడ్డులోకి వెళ్లారు. అదే సమయంలో పిడుగు పడింది. పిడుగు ధాటికి షెడ్డులో ఉన్న ఏడుగురూ కింద పడిపోయారు. 

తేరుకుని లేచి చూడగా ఇందిర కుమార్తె శ్రావణి (17), కూకట్ల కోమల కుమారుడు రాజు (24) మృతిచెంది ఉన్నారు. ఈ ఘటనలో కోమలతోపాటు మిగతా నలుగురు అస్వస్థతకు గురయ్యారు. జఫర్‌గఢ్‌ ఎస్సై రాంచరణ్‌ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.   

టార్చ్‌లైట్‌ వెలుతురులో శవపరీక్ష 
ఇదిలా ఉండగా శ్రావణి, రాజు మృతదేహాలకు వర్ధన్నపేట శ్మశానవాటికలోని పోస్టుమార్టం గదిలో విద్యుత్‌ సౌకర్యం లేక టార్చ్‌లైట్‌ వెలుతురులోనే శవపరీక్ష చేశారు. వెంకటాపురం గ్రామం జఫర్‌గఢ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉండడంతో వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి మృతదేహాలను తీసుకురాగా శ్మశానవాటికలోని పోస్టుమార్టం గదికి తరలించారు.

 ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో వైద్యులు అక్కడికి చేరేసరికి విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో టార్చ్‌లైట్ల సహాయంతో రెండు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. అక్కడ కనీసం తాగునీటి సౌకర్యం కూడా లేకపోవడంతో మృతుల కుటుంబ సభ్యులు ఇబ్బంది పడ్డారు. 

అక్కడ విద్యుత్‌ మీటరు లేకపోవడంతో విద్యుత్‌ సరఫరాను నిలిపి వేసినట్లు విద్యుత్‌ శాఖ అధికారులు చెబుతుంటే.. పోస్టుమార్టం గది నిర్మించి ఇచ్చాం, మిగతా విషయాలకు ఆస్పత్రి వారిదే బాధ్యత అని మున్సిపల్‌ శాఖ చేతులు దులిపేసుకున్నట్టు సమాచారం.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)