Breaking News

ప్రియురాలి కండిషన్‌.. ప్రేమించిన అమ్మాయి దక్కదేమోనని..  

Published on Tue, 03/08/2022 - 11:09

సాక్షి, కామారెడ్డి క్రైం: ప్రేమించిన అమ్మాయి దక్కదేమోననే బెంగతో మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లా కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. పట్టణంలని స్నేహపూరి కాలనీలో నివాసం ఉండే పోలబోయిన లలితకు అఖిల్‌ (20), నిఖిల్‌ అనే కవల పిల్లలు ఉన్నారు. వారిలో పెద్దవాడైన అఖిల్‌ ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా.. ఇటీవలే ఉద్యోగం మానేసి ఇంటి వద్ద ఉంటున్నాడు.

చాలా రోజులుగా విద్యానగర్‌ కాలనీకి చెందిన ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. తల్లిదండ్రులు ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకోవాలని అమ్మాయి చెప్పినట్లు తెలిసింది. దీంతో ప్రియురాలు దక్కదేమోనని మనస్థాపం చెందాడు. అనారోగ్య కారణాలతో తల్లి బంధువుల ఇంటికి ఆదివారం వెళ్లింది. సోమవారం ఉదయంఇంటికి వచ్చి చూడగా బెడ్‌రూంలో ఫ్యాన్‌కు అఖిల్‌ చున్నీతో ఉరివేసుకుని ఉన్నాడు. మృతుడి తల్లి లలిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రసాద్‌ తెలిపారు.  

ఫెయిల్‌ అయ్యానని యువతి ఆత్మహత్య 
కామారెడ్డి క్రైం: పరీక్షలో ఫెయిల్‌ కావడంతో నర్సింగ్‌ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని ఇస్రోజివాడి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన దుబ్బాక శిరీష (19) నిజామాబాద్‌ జిల్లా ధర్మారంలోని తిరుమల నర్సింగ్‌ కళాశాలలో ఇటీవల జీఎన్‌ఎం పూర్తి చేసింది. పరీక్షా ఫలితాల్లో కొన్ని సబ్జెక్టులు తప్పాయని ఆమెకు తెలిసింది. దీంతో మనస్తాపం చెందిన శిరీష ఇంట్లో ఎవరు లేని సమయంలో దూలానికి చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి చిన్న పోచయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు దేవునిపల్లి ఎస్సై ప్రసాద్‌ తెలిపారు. 

Videos

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

73 మంది ప్రజా సంఘాల నాయకులపై అక్రమ కేసులు: YS Jagan

పల్నాడు జిల్లా దాచేపల్లిలో పోలీసుల ఓవరాక్షన్

సీజ్ ది షిప్ అన్నాడు షిప్ పోయింది బియ్యం పోయాయి.. పవన్ పై జగన్ సెటైర్లు..

అక్రమ కేసులు అరెస్టులు ఏపీలో రెడ్ బుక్ బుసలు కొడుతుంది

సుమోలు, కేరళాలు.. గుడ్ ఫ్రెండ్స్ ఏందయ్యా ఈ బ్రాండ్లు..!

రెడ్ బుక్ రాజ్యాంగంలో 390 మంది హత్యకు గురయ్యారు

అందాల యుద్ధం

Photos

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

కాన్స్‌లో అదితి : ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)