Breaking News

కోడిపల్లి ఘటనపై అనుమానాలున్నాయ్‌: అనంత ఎస్పీ

Published on Tue, 08/15/2023 - 17:06

సాక్షి, అనంతపురం:  కళ్యాణదుర్గం మండలం కోడిపల్లిలో గ్యాంగ్ రేప్ జరిగిందని, దళిత మహిళపై వైకాపా నాయకుల దాష్టీకమంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి కథనాలు వండివార్చాయి. దీంతో ఎల్లో మీడియా కథనాలపై జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు స్పష్టత ఇచ్చారు. కోడిపల్లి ఘటనపై మంగళవారం మీడియా సమావేశం నిర్వహించిన ఆయన..  గ్యాంగ్‌రేప్‌పై అనుమానాలున్నాయని తెలిపారు. 

‘‘కళ్యాణదుర్గం మండలం కోడిపల్లి ఘటనపై అనేక అనుమానాలు ఉన్నాయి. కోడిపల్లిలో గ్యాంగ్ రేప్ జరిగిన ఆనవాళ్లు లేవు. ఈ ఘటనతో వైఎస్సార్ సీపీ నేతలకు సంబంధం లేదు. కొందరు కావాలనే బాధితులను తప్పు దారి పట్టించి.. లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. తప్పుడు ఆరోపణలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని ఎస్పీ తెలిపారు. 

ఫోన్‌లో వీడియోలు లేవు
ఏడాది క్రితం తనపై గ్యాంగ్ రేప్ జరిగిందని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. అత్యాచార సమయంలో విడియోలు తీశారని బాధితురాలు చెబుతోంది. ఆమె ఫోన్ లో ఎలాంటి విడియోలు లేవు. పైగా బాధిత మహిళ ఓ వ్యక్తితో ఉండగా.. గదికి తలుపులు వేసి కోడిపల్లి గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మహిళ ప్రవర్తనపై గ్రామస్తుల నుంచి అనేక ఫిర్యాదులు ఉన్నాయి అని ఎస్పీ వెల్లడించారు.

అన్ని కోణాల్లో దర్యాప్తు
బాధిత మహిళ ఈనెల 10వ తేదీన ఒక రకంగా.. 14 తేదీన మరోలా ఫిర్యాదు చేసింది. కోడిపల్లికి మహిళ ఫిర్యాదు మేరకు అట్రాసిటీ కేసు నమోదు చేశాం. కోడిపల్లి ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. అసత్య ప్రచారాలను నమ్మొద్దు అని ప్రజలకు ఎస్పీ తెలియజేశారు.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)